Share News

Aamir Khan: సిక్స్‌తో పెళ్లి ఖరాబ్.. ఆమిర్ ఖాన్ మాటలు వింటే నవ్వాగదు!

ABN , Publish Date - Jul 02 , 2025 | 03:31 PM

సిక్స్ కారణంగా తన పెళ్లి ఖరాబ్ అయిందంటూ అందర్నీ నవ్వుల్లో ముంచెత్తారు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్. ఇంతకీ ఆ సిక్స్ కొట్టింది ఎవరో ఇప్పుడు చూద్దాం..

Aamir Khan: సిక్స్‌తో పెళ్లి ఖరాబ్.. ఆమిర్ ఖాన్ మాటలు వింటే నవ్వాగదు!
Aamir Khan

భారత్-పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయంటే చాలు.. అందరూ టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతారు. క్రికెట్‌లో బిగ్గెస్ట్ రైవల్రీగా చెప్పుకునే ఇండో-పాక్ ఫైట్‌కు ఓ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంది. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే చాలు స్టేడియాలకు పోటెత్తుతారు. ఆ అవకాశం లేకుంటే టీవీలు, మొబైల్స్‌లో చూస్తారు. ఆఫీసులు, వ్యాపారాలు మానుకొని మరీ మ్యాచులు చూసేవారూ ఉన్నారు. అలాంటి భారత్-పాక్ మ్యాచ్ వల్ల, ఆ పోరులోని ఓ ప్లేయర్ కొట్టిన సిక్స్ వల్ల తన పెళ్లి ఖరాబ్ అయిందని అంటున్నారు బాలీవుడ్ టాప్ హీరో ఆమిర్ ఖాన్. మరి.. ఆయన వివాహం రోజు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

india-vs-pakistan.jpg


సిక్స్ కొట్టి..
‘అది 1986, ఏప్రిల్ 18వ తేదీ. ఆ రోజు నా పెళ్లి జరిగింది. అదే రోజు భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో జావేద్ మియాందాద్ సిక్స్ కొట్టాడు. షార్జాలో జరిగిన మ్యాచ్‌లో చివరి బంతికి సిక్స్ కొట్టి పాక్‌ను గెలిపించాడు మియాందాద్. మ్యాచ్ భారత్‌దేనని అంతా అనుకున్నాం. గెలుపు మనదేననే ధీమాతో ఉన్నాం. కానీ ఆఖరి బంతికి అనూహ్యంగా సిక్స్ కొట్టాడు మియాందాద్. పెళ్లి అయిందనే సంతోషంలో ఉన్న మేం ఆ సిక్స్ వల్ల చాలా బాధపడ్డాం. ఒకవేళ పాక్‌ను మనం ఓడించి ఉంటే మా సంతోషం రెట్టింపు అయ్యేది’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో ఆమిర్ చెప్పుకొచ్చారు. తన పెళ్లయిన కొన్నేళ్ల తర్వాత ఓ రోజు ఫ్లైట్‌లో మియాందాద్‌ను కలిశానని.. మీ వల్లే నా పెళ్లి ఖరాబ్ అయిందని చెప్పానని ఆమిర్ పేర్కొన్నారు. మీరు చేసింది కరెక్ట్ కాదు.. ఆ ఒక్క సిక్స్ మమ్మల్ని బాధలోకి నెట్టేసిందని చెప్పానని బయటపెట్టారు.


ఇవీ చదవండి:

క్రికెట్‌లోనే అతిపెద్ద సమరం

సీఎస్‌కేలోకి సంజూ శాంసన్

టీమ్ కంటే బుమ్రా గొప్పా?

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 02 , 2025 | 03:32 PM