Ayush Matre Century: ఆయుశ్ సూపర్ సెంచరీ.. రోహిత్ రికార్డ్ బ్రేక్
ABN , Publish Date - Nov 29 , 2025 | 09:37 AM
ముంబై ఓపెనర్ ఆయుశ్ మాత్రే సెంచరీతో అదరగొట్టాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మకు సంబంధించిన ఓ రికార్డ్ బద్దలైంది. ఇదే సమయంలో విదర్భపై ముంబై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: ముంబై యువ ఓపెనర్ ఆయుశ్ మాత్రే(Ayush Matre) (53 బంతుల్లో 110 నాటౌట్) సూపర్ సెంచరీ చేశాడు. ఫలితంగా ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టు వరుసగా రెండో విజయం తన ఖాతాలో వేసుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు 7 వికెట్ల తేడాతో విదర్భపై గెలుపొందింది. ఇక ఈ మ్యాచ్ లో ఆయుశ్ మాత్రే ఓ అరుదైన రికార్డును సాధించడమే కాకుండా.. టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ రికార్డు(Rohit Sharma Record)ను బ్రేక్ చేశాడు.
ముంబై ఓపెనర్ ఆయుశ్ మాత్రే(Ayush Matre Mumbai Opener) దేశవాళీ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన పిన్నవయస్కుడిగా అరుదైన రికార్డును సృష్టించాడు. ఇప్పటికే ఫస్ట్ క్లాస్ క్రికెట్, లిస్ట్ ‘ఎ’లో శతకాలు నమోదు చేసుకున్న ఆయుశ్... తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ( Syed Mushtaq Ali Trophy 2025)లో విదర్భతో మ్యాచ్‌లో టీ20 ఫార్మాట్‌లోనూ సెంచరీ చేశాడు. తద్వారా చిన్న వయసు (18 సంవత్సరాల 135 రోజులు)లో ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అంతకు ముందు రోహిత్ శర్మ (19 సంవత్సరాల 339 రోజులు) ఫస్ట్-క్లాస్, లిస్ట్ ఏ, టీ20 ఫార్మట్ లో సెంచరీలు చేశాడు. 2007 ప్రారంభంలో ముంబై తరపున భారత బ్యాట్స్‌మన్ చేసిన తొలి టీ20 సెంచరీతో రోహిత్(Rohit Sharma Record Broken) ఈ సెట్‌ను పూర్తి చేశాడు.
ఇక మ్యాచ్(Mumbai vs Vidarbha) విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ 20 ఓవర్లలో 9 వికెట్లకు 192 పరుగులు చేసింది. ఓపెనర్లు అథర్వ తైడె (36 బంతుల్లో 64), అమన్ (30 బంతుల్లో 61) హాఫ్ సెంచరీలతో రాణించారు. అయితే ముంబై బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొడుతూ విదర్భను భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. ముంబై బౌలర్లలో శివమ్ దూబే, సాయిరాజ్ పాటిల్ చెరో మూడు వికెట్లు సాధించారు. అనంతరం ఛేదనలో ముంబై(Mumbai) 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఆయుశ్ మాత్రే అదరగొట్టగా... టీమిండియా టి20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (35), పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే(Shivam Dube) (39 నాటౌట్) రాణించారు.
ఇవి కూడా చదవండి:
అమ్మకానికి ఐపీఎల్ జట్లు.. హర్ష గొయెంకా పోస్ట్ వైరల్!
మహిళల టీ20 సిరీస్.. పూర్తి షెడ్యూల్ ఇదే!