Arjuna Ranatunga: ఈ క్రికెటర్ ఎవరో తెలుసా?
ABN , Publish Date - Nov 07 , 2025 | 05:03 PM
అర్జున రణతుంగ.. శ్రీలంకకు 1996 వన్డే ప్రపంచకప్ అందించిన దిగ్గజ కెప్టెన్. ప్రస్తుతం ఆయన గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. ఒకప్పుడు బొద్దుగా కనిపించిన రణతుంగ ఇప్పుడు బాగా సన్నబడ్డారని అభిమానులు షాక్ అవుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అర్జున రణతుంగ.. శ్రీలంకకు 1996 వన్డే ప్రపంచకప్ అందించిన దిగ్గజ కెప్టెన్. ప్రస్తుతం ఆయన గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. సనత్ జయసూర్య, అరవింద డి సిల్వా, ముత్తయ్య మురళీధరన్‌లతో కలిసి తాజాగా జరిగిన తమిళ యూనియన్ 125వ వార్షికోత్సవ వేడుకలో పాల్గొన్న రణతుంగను చూసి అభిమానులు షాక్‌కు గురవుతున్నారు.
ఆయనేనా..?
తాజాగా రణతుంగ(Arjuna Ranatunga) ఎరుపు రంగు కుర్తాలో సింపుల్‌గా కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది. రణతుంగ పక్కనే ఉన్న ముగ్గురు మాజీ క్రికెటర్లు సూట్‌లలో ఉన్నారు. ఆయన మాత్రం కుర్తాలో ఉండటంతో ఆ లుక్ మరింతగా దృష్టిని ఆకర్షించింది. జుట్టు మొత్తం తెల్లబడడంతోపాటు, ఒకప్పుడు బొద్దుగా కనిపించిన రణతుంగ ఇప్పుడు బాగా సన్నబడి, గుర్తుపట్టలేనంతగా మారిపోయారు.
ఆ ఫొటోను సనత్ జయసూర్య సోషల్ మీడియాలో షేర్ చేయగానే, అభిమానులు కామెంట్లతో ముంచెత్తుతున్నారు. ‘ఈయనేనా వరల్డ్ కప్ కెప్టెన్?’, ‘రణతుంగా బాగున్నారా?’, ‘ఇంత సన్నబడిపోయారేంటి!’ అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
క్రికెట్ నుంచి రాజకీయాల వరకు..
1963లో కొలంబోలో జన్మించిన రణతుంగ, 1982లో శ్రీలంక తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. 93 టెస్టులు, 269 వన్డేల్లో ఆడారు. 12 వేలకు పైగా అంతర్జాతీయ పరుగులు సాధించారు. 1996లో ఆయన నాయకత్వంలో శ్రీలంక మొదటిసారి వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. 2001లో ఆటకు గుడ్ బై చెప్పిన రణతుంగ, ఆ తరువాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2008లో శ్రీలంక క్రికెట్ బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినా, ఏడాది నిండక ముందే ఆ పదవి కోల్పోయారు. ప్రస్తుతం 61 ఏళ్ల రణతుంగ కుటుంబంతో సేద తీరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
దీప్తిని అందుకే వదిలేశాం: అభిషేక్ నాయర్
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి