Pratyekam : ఇలాంటి లక్షణాలున్న అబ్బాయిలకి.. అమ్మాయిలు ఈజీగా పడిపోతారు..
ABN , Publish Date - Feb 18 , 2025 | 07:35 PM
అమ్మాయిలు ఏదీ అంత త్వరగా యాక్సెప్ట్ చేయరు. మరీ ముఖ్యంగా ప్రేమ విషయంలో. అబ్బాయిలు ఎన్ని కబుర్లు చెప్పినా, చూసేందుకు అట్రాక్టివ్‌గా కనిపించినా అంత ఈజీగా లవ్ అంటూ ముందడుగు వెయ్యరు. కానీ, ఈ లక్షణాలున్న అబ్బాయిలకి మాత్రం అమ్మాయిలు ఇట్టే పడిపోతారంట. ఇంతకీ, ఏంటా స్పెషల్ క్వాలిటీస్ అని ఆలోచిస్తున్నారా..

అమ్మాయిలు ఏదీ అంత త్వరగా యాక్సెప్ట్ చేయరు. మరీ ముఖ్యంగా ప్రేమ విషయంలో నిక్కచ్చిగా ఉంటారు. ఎందుకంటే అమ్మాయిలకు ఒక అబ్బాయిపై లవ్ ఫీలిగ్ కలిగేందుకు దాదాపు 15 రోజలు పడుతుందట. అందుకే అంత త్వరగా అబ్బాయిల ప్రేమను అంగీకరించరు. కానీ, బాయ్స్‌కు మాత్రం కేవలం 8.2 సెకన్ల సమయం చాలంట ప్రేమలో పడిపోవడానికి. అయితే, అబ్బాయిల్లో ఈ క్వాలిటీస్ ఉంటే మాత్రం అమ్మాయిలు వారికి తెలియకుండానే ఇట్టే ఆకర్షితులు అవుతారంట. త్వరగా పరిచయం పెంచుకోవాలని ఆరాటపడతారని మనస్తత్వ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరి, అబ్బాయిల్లో అమ్మాయిలకు నచ్చే స్పెషల్ క్వాలిటీస్ ఏంటని అనుకుంటున్నారా..
విశ్వాసం
ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉన్న పురుషలకు స్త్రీలు త్వరగా ఆకర్షితులు అవుతారు. ఇలాంటి లక్షణం ఉన్నవారు బాధ్యతాయుతంగా ఉంటారని వారి నమ్మకం. వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువే. తమపై తాము నమ్మకం కలిగి ఉండటంతో పాటు రిస్క్ తీసుకోవడానికి భయపడని పురుషులను బాగా ఇష్టపడతారు.
హాస్యం
సాధారణంగా మహిళలు సరదాగా ఉండే భాగస్వామి కావాలని కోరుకుంటారు. అందుకే ఫన్నీగా నవ్వుతూ నవ్విస్తూ ఉల్లాసంగా ఉంటే మగాళ్లకు ఇట్టే అట్రాక్ట్ అవుతారంట. ఇలాంటి వారితో చాలా త్వరగా స్నేహం చేస్తారు. స్త్రీ, పురుషులు ఇద్దరికీ ఒకే వయస్సు ఉన్నప్పటికీ స్త్రీలే ఎక్కువ మెచ్యురిటీతో ఆలోచిస్తారంట.
భావోద్వేగం
భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి భయపడని పురుషుల పట్ల మహిళలు ఆకర్షితులవుతారు. చుట్టూ ఉన్నవారితో ఎలా ఉంటున్నారనే దాన్ని బాగా గమనిస్తారు. సున్నిత మనస్తత్వం, చురుగ్గా వినయంగా ఉండేవారిని భాగస్వామిగా చేసుకోవాలని అనుకుంటారు.
ఆశయం
మహిళలు ఆశయం, పట్టుదలతో అంటూ తమ లక్ష్యాల పట్ల మక్కువ కలిగిన పురుషుల పట్ల ఆకర్షితులవుతారు. విజయం సాధించడానికి వారు చూపించే ఉత్సాహం, సాహసం వీరిని బాగా నచ్చుతాయి.
దయ, సానుభూతి
స్త్రీలు ఇతరుల పట్ల శ్రద్ధగా ఆలోచించే, కరుణగల పురుషులను ఇష్టపడతారు. దయ, సానుభూతి నమ్మకం, భద్రతా భావాన్ని పెంచుతుంది. అయితే, తమ పట్ల దయ, జాలి చూపించే వారంటే స్త్రీలకు అస్సలు నచ్చరు.
నిజాయితీ
నిజాయితీపరులైన పురుషుల వైపు మహిళలకు త్వరగా నచ్చుతారు. నమ్మకస్తులుగా ఉన్నవారికి స్నేహం చేసేందుకు ముందుకొస్తారు. భాగస్వామిలో నిజాయితీ అనే లక్షణం వారిలో ప్రేమ భావనను పెంపొదిస్తుందంట.
శారీరక, మానసిక ఆరోగ్యం
సంతోషకరమైన మరియు సంతృప్తికరమైన జీవితానికి శారీరక, మానసిక ఆరోగ్యం చాలా అవసరం. అందుకే మహిళలు ఈ విషయానికి ప్రాధాన్యతనిచ్చే పురుషుల పట్ల ఆకర్షితులవుతారు. ఆరోగ్యం, ధైర్యం, దృఢత్వం ఉండే పురుషులను స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారట.
తెలివితేటలు
మహిళలు తెలివైన, విమర్శనాత్మకంగా ఆలోచించగలవారిని, తమ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఆసక్తిగా ఉండే పురుషులను ఇష్టపడతారు.
గౌరవం
సరిహద్దులు దాటకుండా నిజాయితీగా, గౌరవంగా సంభాషించే పురుషులను మహిళలు బాగా ఇష్టపడతారు. మర్యాదపూర్వకమైన సంభాషణ రిలేషన్‌షిప్‌కు పునాదిలాంటి నమ్మకాన్ని ఏర్పరుస్తుంది. ఇలాంటివారితో కమ్యూనికేట్ కావడాన్ని సేఫ్టీగా ఫీలవుతారు. తమ తరపున నిలబడి గట్టిగా వాదించేవారిని బాగా ఇష్టపడతారు. కనుక అబ్బాయిలు ఈ విషయాలు గుర్తు పెట్టుకున్నారంటే అమ్మాయిల దృష్టిని ఇట్టే ఆకర్షిస్తారు.
ఇవి కూడా చదవండి..
Shocking Truth About OM : ఓం అని జపిస్తే ఏమవుతుంది.. ? పరిశోధనలో విస్తుపోయే నిజాలు..
ఈ కుర్రాడి స్పీడ్‌ను చూసి మిక్సీ కంపెనీలు కూడా భయపడతాయేమో.. వీడియో చూస్తే థ్రిల్ కావాల్సిందే..
Jhansi: అమ్మను నాన్నే చంపాడు..బొమ్మ వేసి మరీ చెప్పిన నాలుగేళ్ల చిన్నారి!
మరిన్ని ప్రత్యేక, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..