10th Class: టెన్త్ విద్యార్థికి ఎంత కష్టం వచ్చింది.. పరీక్ష పాస్ కాకపోతే బ్రేకప్..
ABN , Publish Date - Apr 20 , 2025 | 07:38 AM
10th Class Student Answer Sheet: విద్యార్థి ఆన్సర్ షీటులో రాసింది చదివి ఆ టీచర్ షాక్ అయ్యాడు. తనను పరీక్షల్లో పాస్ చేసి.. తన ప్రేమను గెలిపించాలని ఆ విద్యార్థి రిక్వెస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పరీక్షలంటే భయపడని పిల్లలు చాలా తక్కువ మందే ఉంటారని చెప్పొచ్చు. కొంతమంది విద్యార్థులకు ఎంత చదివినా .. పరీక్ష హాలులోకి వెళ్లి కూర్చోగానే అన్నీ మర్చిపోతూ ఉంటారు. మరికొంత మంది చదవకుండా పరీక్షలకు వెళుతూ ఉంటారు. చదవక పోయినా ఆన్సర్ షీట్లను మాత్రం నింపేస్తుంటారు. రామాయణం దగ్గరినుంచి లేటెస్ట్ సినిమా స్టోరీ వరకు అన్నిటిని పేపర్లలో నింపేస్తూ ఉంటారు. కాదేదీ కవితకు అనర్హం అన్నట్లుగా.. తమకు తోచింది రాసేస్తుంటారు. అత్యంత అరుదుగా కొంతమంది విద్యార్థులు ఆన్సర్ షీట్ల లోపల డబ్బులు పెడుతూ ఉంటారు. పాస్ చేయమని బ్రతిమిలాడుతూ ఉంటారు.
ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో విద్యార్థి మాత్రం ఓ మెట్టు పైకి ఎక్కాడు. పరీక్షలో పాస్ చేసి తన ప్రేమను గెలిపించమని బ్రతిమలాడాడు. ఈ సంఘటన కర్ణాటక, బెళగావి జిల్లాలోని చిక్కోడిలో చోటు చేసుకుంది. పదవ తరగతి విద్యార్థికి సంబంధించిన ఆన్సర్ పేపర్ దిద్దుతుండగా.. అందులో ఐదు వందల రూపాయల నోటు కనిపించింది. ఆ నోటు ఉండే పేపర్‌లో ఆ విద్యార్థి ఈ విధంగా రాశాడు..‘ దయచేసి నన్ను పాస్ చేయండి. నా ప్రేమ ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. నేను పరీక్షలో పాస్ అయితేనే.. ప్రేమలో కూడా పాస్ అవుతాను.
మీరు నన్ను పాస్ చేస్తే డబ్బులు ఇస్తాను. నన్ను పాస్ చేయకపోతే.. మా అమ్మానాన్న నన్ను కాలేజీకి పంపించరు ’ అని పేర్కొన్నాడు. ఈ విద్యార్థి చేసిన పనికి పేపర్లు దిద్దే టీచర్ షాక్ అయ్యాడు. దాన్ని ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు ‘ పిల్లాడికి ఎంత కష్టం వచ్చింది’..‘ పాస్ చేసేయండి సార్.. పాస్ చేసేయండి’.. ‘ ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ విద్యార్థితో పాటు చాలా మంది కూడా ఆన్సర్ షీటులో డబ్బులు పెట్టి.. పాస్ చేయమంటూ బ్రతిమలాడటం గమనార్హం.
ఇవి కూడా చదవండి
CID 2 : ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు.. ఆయన బతికే ఉన్నాడు
Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. ఈ రోజు ధరలు ఎంతంటే..