Share News

Highway Journey Viral Video: రాత్రివేళలో హైవేపై వేగంగా వెళ్తున్నారా.. ఇతడికేమైందో చూస్తే షాక్ అవుతారు..

ABN , Publish Date - Oct 17 , 2025 | 09:56 AM

ఓ వ్యక్తి కారులో రాత్రి వేళ హైవేపైకి వచ్చేశాడు. రోడ్డు బాగుండడంతో ఒక్కసారిగా వాహనం స్పీడు పెంచేశాడు. సుమారు 100నుంచి 150 మధ్యలో దూసుకెళ్తున్నాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది..

Highway Journey Viral Video: రాత్రివేళలో హైవేపై వేగంగా వెళ్తున్నారా.. ఇతడికేమైందో చూస్తే షాక్ అవుతారు..

కొందరు వాహనంతో రోడ్డు పైకి రాగానే పూనకం వచ్చిన వారిలా ఊగిపోతుంటారు. అధిక వేగంతో వాహనాలను నడుపుతూ అందరికీ షాక్ ఇస్తుంటారు. ఈ క్రమంలో వారు ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. మరికొందరు రోడ్డు బాగుంది కదా అని వంద స్పీడులో దూసుకెళ్తుంటారు. ఇలాంటి సమయాల్లో సడన్‌గా రోడ్డు మలుపులు రావడమో, రోడ్డు అడ్డంగా వాహనాలు, పశువులు రావడమో లేక గుంతలు కనిపించడమో జరుగుతుంటుంది. దీంతో వేగాన్ని అదుపు చేయలేక ప్రమాదాలకు గురవుతుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. హైవేపై అధిక వేగంతో వెళ్తున్న వ్యక్తికి.. మార్గ మధ్యలో షాకింగ్ అనుభవం ఎదురైంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కారులో రాత్రి వేళ హైవేపైకి వచ్చేశాడు. రోడ్డు బాగుండడంతో ఒక్కసారిగా వాహనం స్పీడు పెంచేశాడు. సుమారు 100నుంచి 150 మధ్యలో దూసుకెళ్తున్నాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది.


అంతవరకూ శుభ్రంగా ఉన్న రోడ్డు కాస్తా.. ఒక్కసారిగా పూర్తిగా గుంతలమయంగా కనిపించింది. దీంతో వేగంగా వచ్చినా కారు.. (Car lost control after falling into potholes) గుంతల్లో పడి పెద్ద పెద్ద కుదుపులకు గురైంది. ఇంతటితో ఈ వీడియో ముగుస్తుంది. ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఈ ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయా.. అనే వివవరాలు తెలియలేదు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘రాత్రి వేళ వేగంగా వెళ్లేవారికి ఈ వీడియో గుణపాఠం కావాలి’.. అంటూ కొందరు, ‘ఇలాంటి తప్పు ఎవరూ చేయకండి’.. అంటూ మరికొందరు, ‘ఇది నిజమా లేక ఏఐ క్రియేషనా’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 45 వేలకు పైగా లైక్‌లకు, 2.8 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

టికెన్ కొని మెట్రో ఎక్కాడు.. లోపల అతడు చేసిన పనికి అంతా షాక్..

రాత్రి వేళ సంబరాల్లో యువతీయువకులు.. అర్ధరాత్రి రోడ్డు మధ్యలో షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 17 , 2025 | 09:57 AM