Smartwatch Helps Rescue Plane: విమానం గల్లంతైన ప్రమాదంలో సహాయపడిన స్మార్ట్‌వాచ్.. ఎలాగంటే..
ABN , Publish Date - Jul 22 , 2025 | 10:37 AM
ఇటీవల ఓ జాతీయ పార్క్ శివారులో జరిగిన ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనకు సంబంధించి షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఒక స్మార్ట్‌వాచ్ ప్రమాద ఘటనా స్థలాన్ని గుర్తించడంలో కీలక పాత్ర పోషించింది.

అమెరికా యెల్లోస్టోన్ జాతీయ పార్క్ సమీపంలో ఇటీవల జరిగిన ఓ విమాన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. అయితే ఈ ప్రమాద స్థలాన్ని గుర్తించడంలో ఒక స్మార్ట్ వాచ్ కీలక పాత్ర పోషించిందని అధికారులు సోమవారం సంతోషం వ్యక్తం చేస్తూ తెలిపారు. ఈ ఘటన మోంటానా రాష్ట్రంలోని వెస్ట్ యెల్లోస్టోన్ ప్రాంతంలో జరిగింది (Smartwatch Helps Rescue Plane). ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) రికార్డుల ప్రకారం, ఈ విమానం ఒక సింగిల్-ఇంజన్ పైపర్ PA-28 మోడల్.
సిగ్నల్ సహాయంతో..
ఇది గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత వెస్ట్ యెల్లోస్టోన్ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. అయితే, విమానం ఆచూకీ తెలియకపోవడంతో రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఆ సమయంలో, ప్రమాదానికి గురైన ఒక వ్యక్తి ధరించిన స్మార్ట్ వాచ్ చివరి స్థానం ఆధారంగా వెతకడం ప్రారంభించారు. ఆ క్రమంలో స్మార్ట్ వాచ్ సిగ్నల్ సహాయంతో విమానాలు దాదాపు అర గంటలోనే విమాన ప్రమాద స్థలాన్ని గుర్తించాయి.
అడవిలో విమానం..
వెస్ట్ యెల్లోస్టోన్ పట్టణానికి దక్షిణంగా ఉన్న దట్టమైన అడవిలో విమానం కూలిపోయి ఉంది. దురదృష్టవశాత్తూ విమానంలో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరణించిన వారిలో రాబర్ట్ కానోవర్ (60 సంవత్సరాలు, టెన్నెస్సీ), మాడిసన్ కానోవర్ (23 సంవత్సరాలు, టెన్నెస్సీ), కర్ట్ ఎనోక్ రోబీ (55 సంవత్సరాలు, ఉటా)గా గుర్తించబడ్డారు. ప్రమాదానికి గల కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు.
రెస్క్యూ బృందాలకు..
ఈ విషయంపై FAA, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి. విమానం ఎందుకు కూలిపోయింది, దాని వెనుక ఉన్న సాంకేతిక ఇతర కారణాలను తెలుసుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో స్మార్ట్ వాచ్ పాత్ర అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా స్మార్ట్ వాచ్‌లు ఆరోగ్యం, ఫిట్‌నెస్ లేదా నోటిఫికేషన్‌ల కోసం మాత్రమే ఉపయోగించబడతాయి. కానీ ఈ ఘటనలో ఒక స్మార్ట్ వాచ్ రెస్క్యూ బృందాలకు కీలక సమాచారాన్ని అందించి, ప్రమాద స్థలాన్ని త్వరగా కనుగొనడంలో సహాయపడింది. ఇది టెక్నాలజి ఉపయోగాలను మరో గుర్తు చేసింది.
ఇవి కూడా చదవండి
ముంబై పేలుళ్ల కేసు మళ్లీ ప్రశ్నార్థకం.. సుప్రీంకోర్టుకు మహారాష్ట్ర
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి