Share News

Kerala Trip : గాడ్స్ ఓన్ కంట్రీలో వెకేషన్‌ .. ఇలాగయితే అతి తక్కువ ఖర్చుతో ..

ABN , Publish Date - Feb 20 , 2025 | 04:15 PM

Kerala Trip : కొత్త జంటలు హనీమూన్ వెళ్లాలన్నా.. ఫ్యామిలీతో కలిసి టూర్ ఎంజాయ్ చేయాలన్నా ఇండియాలో కేరళ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. అందమైన బ్యాక్ వాటర్స్, బీచ్‌లు, కొబ్బరి చెట్ల మధ్య బోటు ప్రయాణం ఎవ్వరినైనా మైమరిపించక మానవు. తెలుగు రాష్ట్రాల నుంచి లిమిటెడ్ బడ్జెట్‌లో కేరళ ట్రిప్ ఎంజాయ్ చేసే మార్గమేంటో తెలుసుకుందాం..

Kerala Trip : గాడ్స్ ఓన్ కంట్రీలో వెకేషన్‌ .. ఇలాగయితే అతి తక్కువ ఖర్చుతో ..
How to Go Kerala Tour for Family Honey Moon with Limited Budget Mouni

Kerala Trip : ఇప్పటికే పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అయిపోయింది. కొత్త జంటలు హనీమూన్ వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటారు. పెళ్లినాటి తొలిరోజుల్ని మధురానుభూతులుగా మలుచుకోవాలని కోరుకుంటారు. ఇదే గాక కొన్నాళ్లు గడిస్తే వేసవి సెలవులు కూడా వచ్చేస్తున్నాయి. దీంతో అంతా టూర్ వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటారు. గాడ్స్ ఓన్ కంట్రీగా పిలువబడే కేరళ రాష్ట్రం మన దేశంలో ఉన్న అత్యుత్తమ పర్యాటక ప్రదేశమని అందరికీ తెలిసిందే. ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు బోలెడున్నాయి. దక్షిణ భారతదేశంలో తెలుగు ప్రాంతాలవారికి అతిదగ్గరగా ఉన్న కేరళ అందాలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. అయితే, తక్కువ బడ్జెట్ ఉన్నా కేరళ ట్రిప్ ఎలా ఎంజాయ్ చేయవచ్చో చూద్దాం..


కేరళలో 5-7 రోజుల బడ్జెట్ ఫ్రెండ్లీ హనీమూన్ ప్లాన్..

మొదటి రోజు కొచ్చికి చేరుకుని కొచ్చి ఫోర్ట్, మట్టంచెరి ప్యాలెస్‌లను చుట్టేయండి. తర్వాత కొచ్చి నుంచి మున్నార్‍‌కు కారు లేదా బస్సు ద్వారా చేరుకోవచ్చు. కారులో అయితే 4-5 గంటల సమయం పడుతుంది. 2వ రోజున మున్నార్ పట్టణం, సమీపంలోని తేయాకు తోటలు సందర్శించండి. అక్కడి అందాలు మిమ్మల్ని మరో లోకంలోకి తీసుకెళతాయి. 3వ రోజున మట్టుపెట్టి ఆనకట్ట, సరస్సులో రొమాంటిక్ బోట్ రైడ్ కొత్త జంటలకు మరిచిపోలేని అనుభవాన్ని అందిస్తాయి. ఏకాంతంగా గడిపేందుకు ఇదో అద్భుతమైన ఊరు. 4వ రోజున మున్నార్ నుంచి తెక్కడి వెళ్లవచ్చు. అక్కడ పెరియార్ నేషనల్ పార్క్ వన్యప్రాణుల అభయారణ్యం చూసి తీరాల్సిందే. 5వ రోజున వీలైతే తెక్కడిలోని పెరియార్ సరస్సు, స్పైస్ ప్లాంటేషన్, ఎలిఫెంట్ సఫారీ, స్థానిక మార్కెట్లను అన్వేషించండి. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్. ఆహారప్రియులకు బాగా నచ్చుతుంది. 6వ రోజు తెక్కడి నుంచి అల్లెప్పీ వెళ్లి ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్, అక్కడి గ్రామాలు పర్యటించి ఎంజాయ్ చేయవచ్చు. 7వ రోజున కావలిస్తే అలెప్పీ హౌస్ బోట్‌లో విశ్రాంతి తీసుకుంటూ కేరళ టూర్ విశేషాలు నెమరువేసుకుంటూ సూర్యాస్తమయాలు ఆస్వాదిస్తూ విశ్రాంతిగా గడపండి.

అయితే, మీ ప్రాధాన్యతలు, బడ్జెట్ అనుసరించి టూర్ ప్లాన్ చేసుకోండి.

kerala-backwater.jpg


తెలుగు రాష్ట్రాల నుంచి కేరళకు కొన్ని IRCTC టూర్ ప్యాకేజీలు :

హైదరాబాద్ నుంచి

1. కేరళ బ్యాక్ వాటర్ టూర్ : టూర్ వ్యవధి 5 రాత్రులు, 6 పగళ్లు. కొచ్చి, అల్లెప్పీ, కోవలం సందర్శించవచ్చు. టికెట్ ధర రూ.19,990 నుంచి ప్రారంభం. రవాణా, వసతి, సందర్శనా స్థలాలు మరియు భోజనం

2. కేరళ హనీమూన్ ప్యాకేజీ : టూర్ వ్యవధి 6 రాత్రులు, 7 పగళ్లు. కొచ్చి, మున్నార్, తేక్కడి, అలెప్పి చూడవచ్చు. టికెట్ ధర రూ.24,990

విశాఖపట్నం నుంచి

1. కేరళ ఆలయ పర్యటన : కొచ్చి, త్రిస్సూర్, గురువాయూర్, అలెప్పీ సందర్శిస్తారు. టూర్ వ్యవధి 5 రాత్రులు, 6 పగళ్లు, టికెట్ ధర రూ.17,990 నుంచి ప్రారంభం.

2. కేరళ హిల్ స్టేషన్ టూర్ : కొచ్చి, మున్నార్, తేక్కడి, కోవలం పర్యటించవచ్చు. టూర్ వ్యవధి 6 రాత్రులు, 7 పగళ్లు, టికెట్ ధర రూ.22,990 నుంచి మొదలు.

విజయవాడ నుంచి

1. కేరళ బ్యాక్ వాటర్ టూర్ : కొచ్చి, అల్లెప్పీ, కోవలం చూడవచ్చు. టూర్ వ్యవధి 5 రాత్రులు, 6 పగళ్లు, టికెట్ ధర రూ.20,990 నుండి ప్రారంభం.

2. కేరళ హనీమూన్ ప్యాకేజీ : కొచ్చి, మున్నార్, తేక్కడి, అలెప్పి సందర్శిస్తారు. టూర్ వ్యవధి 6 రాత్రులు, 7 పగళ్లు, టికెట్ ధర రూ.26,990 నుండి ప్రారంభం.


Kerala-trip.jpg

కడప నుంచి

1. కేరళ బ్యాక్ వాటర్ టూర్ : కొచ్చి, అల్లెప్పీ, కోవలం టూర్ వ్యవధి 5 రాత్రులు,6 పగళ్లు. టికెట్ ధర రూ.20,990 నుండి ప్రారంభం.

2. కేరళ హనీమూన్ ప్యాకేజీ : కొచ్చి, మున్నార్, తేక్కడి, అలెప్పి టూర్ వ్యవధి 6 రాత్రులు, 7 పగళ్లు, టికెట్ ధర రూ.27,990 నుండి ప్రారంభం.

కర్నూలు నుండి

1. కేరళ ఆలయ పర్యటన : కొచ్చి, త్రిస్సూర్, గురువాయూర్, అలెప్పీ యాత్రా వ్యవధి 5 రాత్రులు,6 పగళ్లు. టికెట్ ధర రూ.19,990 నుండి ప్రారంభం.

2. కేరళ హిల్ స్టేషన్ టూర్ : కొచ్చి, మున్నార్, తేక్కడి, కోవలం టూర్ వ్యవధి 6 రాత్రులు, 7 పగళ్లు, టికెట్ ధర రూ.24,990 నుండి ప్రారంభం.

అనంతపురం నుండి

1. కేరళ బ్యాక్ వాటర్ టూర్ : కొచ్చి, అల్లెప్పీ, కోవలం టూర్ వ్యవధి 5 రాత్రులు, 6 పగళ్లు, టికెట్ ధర రూ.21,990 నుండి ప్రారంభం.

2. కేరళ హనీమూన్ ప్యాకేజీ : కొచ్చి, మున్నార్, తేక్కడి, అలెప్పి టూర్ వ్యవధి 6 రాత్రులు, 7 పగళ్లు, టికెట్ ధర రూ.29,990 నుండి ప్రారంభం.

IRCTC టూర్ ప్యాకేజీలో రవాణా, వసతి, భోజన సదుపాయాలు ఉచితం అని గుర్తుంచుకోండి.


టికెట్ బుకింగ్ కోసం IRCTC టూరిజం వెబ్‌సైట్‌ను సందర్శించండి. సీజన్, సీటు లభ్యత వంటి అంశాలను బట్టి టికెట్ ఛార్జీ ధరలు మారే అవకాశం ఉంది.

హనీమూన్ ట్రిప్ వెళ్లే వారు రూ.25,000-రూ.40,000 కనీస బడ్జెట్‌తో కేరళ టూర్ వెళ్లవచ్చు. మధ్యస్థంగా అంటే రూ.40,000 నుంచి రూ. 70,000. లగ్జరీ ఆప్షన్ ఎంచుకుంటే రూ.70,000 -రూ.1,20,000


Read Also : సీఎం ప్రమాణ స్వీకారంలో స్పెషల్ అట్రాక్షన్‌గా పవన్ కళ్యాణ్.. జనసేనానితో ఆ ఒక్క నిమిషం మోదీ ఏం మాట్లాడారంటే

Pi Coin Launch : బిట్‌కాయిన్‌కు పోటీగా Pi కాయిన్..విడుదలకు ముందే సెన్సేషన్.. అసలేంటీ Pi కాయిన్..

TDP vs YSRCP: ఆ మందులు వికటించాయా.. ఆందోళనకరంగా జగన్ మాటలు

మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 20 , 2025 | 04:42 PM