Share News

Oscars 2025: ఆస్కార్ అవార్డుల ప్రకటన.. బెస్ట్ ఫిల్మ్ ఏదంటే..

ABN , Publish Date - Mar 03 , 2025 | 07:56 AM

Oscar Awards 2025 Winners: మూవీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులు వేడుక గ్రాండ్‌గా స్టార్ట్ అయింది. మరి.. ఈసారి విజేతలు ఎవరో ఇప్పుడు చూద్దాం..

Oscars 2025: ఆస్కార్ అవార్డుల ప్రకటన.. బెస్ట్ ఫిల్మ్ ఏదంటే..
Oscars 2025

ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల వేడుక గ్రాండ్‌గా స్టార్ట్ అయింది. లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 97వ ఆస్కార్ పురస్కారాల ప్రధానోత్సవం జరుగుతోంది. ఈవెంట్‌కు ప్రముఖ నటుడు, నిర్మాత కానన్ ఓ బ్రియాన్ హోస్ట్‌‌గా వ్యవహరిస్తున్నారు. ఈసారి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డును కియెరాన్ కుల్కిన్ (ఎ రియల్ పెయిన్) గెలుచుకున్నారు. బెస్ట్ యానిమేటేడ్ ఫిల్మ్‌గా ‘ఫ్లో’, బెస్ట్ యానిమేటేడ్ షార్ట్ ఫిల్మ్‌‌గా ‘ఇన్ ది షాడో ఆఫ్ ది సీప్రెస్’ నిలిచాయి. బెస్ట్ కాస్టూమ్ డిజైన్ పురస్కారం వికెడ్ (పౌల్ టాజెవెల్)కు వెళ్లింది.


బెస్ట్ స్క్రీన్‌ప్లేగా అనోరా..

ఈసారి ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లేగా అనోరా (సీన్ బేకర్) నిలిచింది. బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లేగా కాన్‌క్లేవ్ (పీటర్ స్ట్రాఘన్) పురస్కారాన్ని సొంతం చేసుకుంది. బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్‌కు ది సబ్‌స్టెన్స్ ఎంపికైంది. కాగా, ఈ అవార్డుల ప్రదానోత్సవ వేడుకకు వచ్చిన గెస్ట్‌లతో నటి, వ్యాఖ్యాత అమేలియా డిమోల్డెన్‌బర్గ్ చిట్‌చాట్ చేశారు. చాలా మంది సినీ ప్రముఖులతో ఆమె మాట్లాడారు. ఈ వేడుకను ఏబీసీ, జియో హాట్‌స్టార్, స్టార్ మూవీస్, హులు, యూట్యూబ్ టీవీ, ఫుబోటీవీ, ఏటీ అండ్ టీ టీవీలు లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాయి.

అవార్డు గ్రహీతలు వీరే..

ఉత్తమ నటుడు: అడ్రియన్ బ్రాడీ (ద్రి బ్రూటలిస్ట్)

ఉత్తమ దర్శకుడు: సీన్ బేకర్ (అనోరా)

ఉత్తమ సహాయ నటుడు: కీరన్ కైల్ కల్కిన్ (ది రియల్ పెయిన్)

ఉత్తమ సహాయ నటి: జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్)

ఉత్తమ స్క్రీన్‌ప్లే: అనోరా (సీన్ బేకర్)

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: డ్యూన్: పార్ట్2

ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: ఫ్లో

ఉత్తమ యానిమేటెడ్ షార్ట్‌ఫిల్మ్: ఇన్ ది షాడో ఆఫ్ సైప్రెస్


ఇవీ చదవండి:

అమ్మాయిలకు మెసేజ్‌లు.. వివరణ ఇచ్చిన హీరో

సినీ ప్రియులకు కిరణ్ అబ్బవరం గిఫ్ట్ 

అట్లీతో సినిమా.. అదే సమస్

మరిన్ని సినీ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 03 , 2025 | 09:19 AM