Viral Video: ఫోన్‌లో మాట్లాడుతూ పాపను మరచి వెళ్లిన తల్లి
ABN , Publish Date - Mar 10 , 2025 | 01:05 PM
స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిన తర్వాత అనేక మంది మారిపోయారని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం నిత్య జీవితంలో ఫోన్ లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేమని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఓ మహిళ ఫోన్ మాట్లాడుతూ తన చిన్నారిని మర్చిపోయి వెళ్లింది.

స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత అనేక మంది ఫుల్ బీజీగా మారిపోయారు. ఎక్కడికి వెళ్లినా కూడా ఫోన్ మాత్రం తప్పక ఉండాల్సిందే. పిల్లాడు మారాం చేసినా ఫోన్ చూపిస్తారు. పాప అన్నం తినకపోయినా కూడా అదే ఫోన్ చూపించి, తినిపించే పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు అదే ఫోన్ కారణంగా ఓ తల్లి ఏకంగా తన పాపను కూడా పార్కులో మర్చిపోయి వెళ్లింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో వైరల్ అవుతోంది. అయితే అసలు ఏం జరిగిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మొదటగా..
ఓ మహిళ పార్కులో తన బిడ్డతో ఉన్న క్రమంలో ఫోన్‌లో మాట్లాడటం ప్రారంభించింది. ఆ సమయంలో తన పాపను అక్కడే పరిసరాలలో వదిలేసి మాట్లాడుకుంటూ ముందుకు వెళ్లింది. అదే విషయాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి గమనించాడు. ఆ పాపను తీసుకుని ఆ మహిళకు ఇచ్చేందుకు ముందుకు వెళ్లాడు. అందుకు సంబంధించిన వీడియోలో ఓ పాపను ఎత్తుకున్న వ్యక్తి ఓ మేడమ్, హలో మిమ్మల్నే అని పిలుస్తున్నారు.
మళ్లీ వెనక్కి వచ్చి..
అతనికంటే ముందు ఆ పాప తల్లి.. ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అయితే మొదట్లో ఆమె అతని పిలుపును పట్టించుకోలేదు. కానీ తర్వాత కూడా అతను మళ్లీ పిలవడంతో ఆమె తిరిగి చూసి, వెనక్కి వచ్చి పాపను తీసుకుంది. ఆ క్రమంలో మహిళకు అతను కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. పాపను కూడా పట్టించుకోకుండా వెళ్తున్నారని, మీకో దండం తల్లి అన్నట్లుగా వీడియోలో అనిపిస్తుంది.
పలువురి కామెంట్లు..
ఈ వీడియో చూసిన అనేక మంది పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఆ తల్లి నిర్లక్ష్యంగా ఉందని కొంత మంది చెబుతుండగా, మరికొందరు మాత్రం ఆమె ఉద్దేశపూర్వకంగానే బిడ్డను పార్కులో వదిలి వెళ్లిందా అని ప్రశ్నిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత అనేక మందిలో నైతిక విలువలు, కుటుంబ బాధ్యతలు తగ్గిపోయాయని ఇంకో వ్యక్తి కామెంట్ చేశారు. ప్రస్తుతం instagramలో పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఒక్క రోజులోనే 2 లక్షల 39 వేలకుపైగా లైక్స్ వచ్చాయి. ఈ వీడియోను చూసిన అనేక మంది ఇంకా షేర్ చేస్తూనే ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
Accident: ఎస్‌యూవీ ట్రక్కు ఢీ.. ఏడుగురు మృతి, 14 మందికి గాయాలు
BSNL Offers: రూ. 200 బడ్జెట్‌లోపు బెస్ట్ రీఛార్జ్ పాన్లు.. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటే..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News