Auto Viral Video: లగ్జరీ బస్సుకు ఏమాత్రం తగ్గలేదుగా.. ఆటోను చూసి అవాక్కవుతున్న జనం..
ABN , Publish Date - Apr 01 , 2025 | 10:26 AM
విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఆటోను చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘లగ్జరీ బస్సుకు ఏమాత్రం తగ్గలేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కొందరు విచిత్రంగా ఆలోచిస్తూ చేసే ప్రయోగాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. చాలా మంది తమ పాత వాహనాలను సరికొత్తగా మారుస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడం చూస్తుంటాం. బైకును ఆటో తరహాలో, ఆటోను కారు తరహాలో, ఇక కారునేమో ఏకంగా హెలీకాప్టర్ రూపంలో మార్చడం చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఆటోను చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘లగ్జరీ బస్సుకు ఏమాత్రం తగ్గలేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ఆటోను చిత్రవిచిత్రంగా మార్చడం చూసి అంతా అవాక్కవుతున్నారు. లగ్జరీ బస్సులో ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయో అచ్చం అలాగే తన ఆటోలో కూడా డిజైన్ చేయించాలని ఫిక్స్ అయ్యాడు. అనుకున్నదే తడవుగా తన ఆటోను (Luxury arrangements in the auto) అనుకున్నవిధంగా సిద్ధం చేశాడు.
బస్సుకు ముందు వైపు ఎలాగైతే టీవీ ఉంటుందో.. అచ్చం ఈ ఆటోకు ముందు వైపు కూడా అలాగే బుల్లి స్క్రీన్‌ను సెట్ చేశాడు. దాని పక్కనే అనేక స్విచ్చులతో కూడిన బోర్డును కూడా ఏర్పాటు చేశాడు. అలాగే ఆటోకు మధ్యలో పైన ఫ్యాన్ సహా.. బస్సు తరహాలోనే జిగేల్‌మనే లైట్లతో పాటూ పాల్ సీలింగ్‌ను కూడా ఏర్పాటు చేశాడు. ఇక వకెనుక వైపు ముగ్గురు కూర్చునేలా బస్సు తరహాలో సీట్లను డిజైన్ చేయించాడు. ఇలా ఆటోకు రెండు వైపులా డోర్లను కూడా ఏర్పాటు చేశాడు.
Marriage Viral Video: కొంపముంచిన ఫొటోషూట్.. వధువును ఎత్తుకున్న వరుడు.. చివరకు ఆమెకు ఏమైందో చూడండి..
ఇలా ఫైనల్‌గా సాధారణ ఆటోను కాస్తా.. అందమైన లగ్జరీ బస్సు తరహాలో మార్చేశాడన్నమాట. ఈ వినూత్నమైన ఆటోకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్.. ఈ ఆటోలో ఏర్పాట్లు మామూలుగా లేవుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి ఆటోలో వెళ్లేందుకు జనం పోటీపడతారేమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2100కి పైగా లైక్‌లు, 1.83 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..
Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..
Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..