మరోసారి తండ్రైన ఎలాన్ మస్క్! మొత్తం ఎందరు సంతానం అంటే..
ABN , Publish Date - Mar 01 , 2025 | 01:04 PM
ఎలాన్ మస్క్ మరోసారి తండ్రి అయ్యారు. తన భాగస్వామి శివోన్ జిలిస్ ద్వారా మరో బిడ్డకు తండ్రయ్యారు. ఇప్పటికే శివోన్ జిలిస్- మస్క్‌లకు ముగ్గురు సంతానం ఉన్నారు. దీంతో, మస్క్ మొత్తం సంతానం సంఖ్య 14కు పెరిగింది.

ఇంటర్నెట్ డెస్క్: టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ మరోసారి తండ్రయ్యారు. ఆయన భాగస్వామి శివోజ్ జిలిస్ మరో బిడ్డను జన్మనిచ్చిన విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు. శివోన్, మస్క్‌లకు ఇప్పటికే ముగ్గురు పిల్లలున్నారు. తాము మరోసారి తల్లిదండ్రులైన విషయాన్ని శివోన్ తాజాగా వెల్లడించారు. బిడ్డ పేరు షెల్డన్ లైకర్గస్ అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఓ పోస్టు పెట్టారు (Elon Musk Welcomes 14th Child ).
‘‘ఈ విషయంలో మస్క్ నేను చర్చించుకున్నాకే ఈ విషయం చెబుతున్నాము. షెల్డన్ గురించి బహిరంగంగా పంచుకోవడమే మంచిదని మేము భావించాము. మా బిడ్డ బంగారం’’ అంటూ శివోన్ పోస్టు పెట్టారు. ఈ పోస్టుకు మస్క్ కూడా స్పందించారు. హృదయం ఎమోజీతో శివోన్ పోస్టుకు రిప్లై ఇచ్చారు. షెల్డన్ జననంతో మస్క్ మొత్తం సంతానం సంఖ్య 14కు చేరింది.
మస్క్‌కు మొదటి భార్య వల్ల ఐదుగురు సంతానం కలిగారు. వీరిలో జస్టిన్ విల్సన్, వీవియన్, గ్రిఫిన్ అనే కవలలు, కాయ్ సాక్సన్, డేమియన్ అనే ట్రిప్లెట్స్ ఉన్నారు. అయితే, మస్క్ తొలి సంతానం నెవాడా అలెగ్జాండర్ పుట్టిన 10 వారాలకే అనారోగ్యంతో కన్నుమూశాడు.
ఇక గ్రిమ్స్ అనే మ్యూజీషియన్‌తో కొంతకాలం పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్న మస్క్‌కు ఆమె ద్వారా ఎక్స్, టెక్నోమెకానికస్ అనే కుమారులు, ఎక్సా డార్క్ అనే కుమార్తె కలిగారు. ఎక్స్‌ను ఇటీవల మస్క్ శ్వేతసౌధానికి కూడా తీసుకెళ్లారు.
Trump-Zelensky Clash: నీ ఆట ముగిసింది.. జెలెన్‌స్కీకి ట్రంప్ మాస్ వార్నింగ్
ఇదిలా ఉంటే.. ఇటీవల అమెరికన్ ఇన్‌ఫ్లుయెన్సర్ షాన్ క్లెయిర్ తన బిడ్డకు మస్క్ తండ్రి అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టి కలకలానికి దారి తీసింది. బిడ్డ పేరు ఆర్ఎస్‌సీ అని కోర్టు డాక్యుమెంట్లలో పేర్కొంది. తన బిడ్డకు తండ్రి మస్క్ అని, ఇది నిరూపించేందుకు వైద్య పరీక్షలకు కూడా మస్క్ హాజరు కావాలని డిమాండ్ చేసింది. దీనిపై స్పందించిన కోర్టు మస్క్‌కు నోటీసులు పంపించింది. ఈ ఉదంతంపై మస్క్ ఇప్పటివరకూ పెద్దగా స్పందించలేదు.
ప్రపంచ జనాభా పడిపోతోందంటూ ఎంతో కాలంగా మస్క్ పలు వేదికలపై తన ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ సమ్యస్యకు పెద్ద కుటుంబాలే పరిష్కారమని మస్క్ చెప్పుకొచ్చారు. మానవజాతి అంతరించిపోకుండా ప్రజలు పిల్లల్ని కనాలని కూడా పిలుపునిచ్చారు.
మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి