Dog attack on Boy: బాలుడిపై శునకం దాడి.. తెగిపడిన చెవి
ABN , Publish Date - Nov 25 , 2025 | 07:21 AM
వాయవ్య ఢిల్లీలోని ప్రేమ్‌నగర్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం వేళ.. ఓ ఆరేళ్ల పిల్లాడు తన ఇంటి సమీపంలో ఆడుకుంటున్నాడు. ఇంతలో రాజేశ్ పాల్(50) అనే దర్జీకి చెందిన కుక్క అకస్మాత్తుగా ఇంటి నుంచి బయటకు వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో శునకాల దాడులు పెరిగిపోతున్నాయి. వీటిపై సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసినా.. వాటిని బేఖాతరు చేస్తున్నారు కొందరు డాగ్ లవర్స్. తాజాగా ఢిల్లీలో ఓ బాలుడిపై పెంపుడు కుక్క ఆకస్మికంగా దాడి చేసింది. ఇంతలో ఆ పిల్లాడిని దాని నుంచి తప్పించేందుకు కుటుంబసభ్యులు సహా స్థానికులు ప్రయత్నించినప్పటికీ.. ఆ పిల్లాడి చెవి తెగిపోయేదాక వదల్లేదా శునకం. స్థానిక సీసీటీవీ ఫుటేజీలో రికార్డైన ఈ దృశ్యాలు విస్మయానికి గురిచేస్తున్నాయి.
ఇలా జరిగింది..
వాయవ్య ఢిల్లీలోని ప్రేమ్‌నగర్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం వేళ.. ఓ ఆరేళ్ల పిల్లాడు తన ఇంటి సమీపంలో ఆడుకుంటున్నాడు. ఇంతలో రాజేశ్ పాల్(50) అనే దర్జీకి చెందిన కుక్క అకస్మాత్తుగా ఇంటి నుంచి బయటకు వచ్చింది. అక్కడున్న బాలుడిపై దాడి చేయబోయింది. ఆ పిల్లాడు దాని బారి నుంచి తప్పించుకుని పరుగెత్తేలోగా అది వెంటాడి అతడిపై ఎగబడింది. గమనించిన స్థానికులు అప్రమత్తమై ఆ బాలుణ్ని రక్షించబోయారు. అయినప్పటికీ అది ఆ పిల్లాడి చెవి తెగిపోయేలా కరిచింది. కుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుణ్ని వెంటనే స్థానికంగా ఉన్న రోహిణిలోని బీఎస్ఏ ఆస్పత్రికి, అక్కడి నుంచి సఫ్దార్‌జంగ్ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటనపై బాధిత బాలుడి కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ వీడియోను పరిశీలించారు. కుక్క యజమాని రాజేశ్‌ను హత్యాయత్నం కింద అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు జైల్లో ఉన్నారు. రాజేశ్ కుమారుడు సచిన్ పాల్.. సుమారు ఏడాదిన్నర క్రితం ఆ శునకాన్ని పోషించుకునేందుకు తమ ఇంటికి తెచ్చినట్టు సమాచారం.
ఇవీ చదవండి: