Tamilnadu Accident: తమిళనాడులో 2 బస్సులు ఢీ.. ఆరుగురు మృతి
ABN , Publish Date - Nov 24 , 2025 | 12:19 PM
తమిళ రాష్ట్రంలోని థెన్‌కాసి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. థెన్‌కాసి జిల్లాల్లో రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్న ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో సుమారు 30 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
మధురై నుంచి సెన్‌కొట్టాయ్ వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు.. థెన్‌కాసి నుంచి వస్తోన్న మరో ప్రైవేట్ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు బస్సులూ బాగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్.. వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు అధికారులు.
ఈ ప్రమాద ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఇవీ చదవండి: