Share News

Ramadan: ఆవో.. హలీం ఖావో..

ABN , Publish Date - Mar 11 , 2025 | 09:07 AM

రంజాన్ పండుగకు ముందు నెలరోజుల నుంచి ముస్లింలు ఉపవాసాలు ఉంటారు. అయితే.. ఈ ఉపవాసాల్లో హలీంను వారు ప్రత్యేకంగా ఆరగిస్తుంటారు. ఇప్పటికే నగరంలో హలీం తయారీ కేంద్రాలు ప్రదాన రహదారుల వెంట వెలిశాయి. ఈ హలీం ఎలా తయారు చేస్తారు.. దాని ప్రత్యేకత ఏంటో తెలెసుకుందాం.

Ramadan: ఆవో.. హలీం ఖావో..

- తయారీ బట్టీల వద్ద సందడి

- రంజాన్‌ ఉపవాస దీక్షలో ఈ పదార్థం ప్రత్యేకం

- పోషక ఫలమైన ఖర్జూరకూ అత్యంత ఆదరణ

- 100 గ్రాములు తింటే 350 కిలో క్యాలరీల శక్తి.. దీని సొంతం

ఆహా ఏమి రుచి తినరా మైమరచి.. రోజూ తిందాం మరి మోజే తీరనిది.. అన్నట్లుగా.. ఈ రంజాన్‌(Ramadan) మాసంలో ఠక్కున గుర్తుకొచ్చేవి ఖర్జూర, హలీంలు. ఉపవాస దీక్షలు ఇప్పటికే ప్రారంభం కావడంతో ప్రధాన కూడళ్లు, వీధుల్లో ఏర్పాటు చేసిన బట్టీల వద్ద సందడి కనిపిస్తుంది. నిర్వాహకులు మటన్‌, చికెన్‌, ఫిష్‌ హలీంతోపాటు ఖర్జూర విక్రయిస్తున్నారు. రుచితో పాటు పోషక విలువలు ఉంటడంతో ఆహార ప్రియులు ఆదరిస్తున్నారు.

హైదరాబాద్: ముస్లింలు ఉపవాస దీక్షలను విరమించే సమయంలో వివిధ రకాల పండ్లను తీసుకుంటారు. వాటిన్నింటిలో అత్యంత ప్రీతిపాత్రంగా తినేది ఖర్జూర. ఇఫ్తార్‌ సహర్‌లలో ఈ పండును అరగిస్తారు. వీటితోపాటు ఇతర ఫలాలకూ ప్రాధాన్యం ఇస్తారు.

మార్కెట్‌లో పలు రకాలు....

రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో పలు రకాల ఖర్జూరలు మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. దేశ, విదేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటారు. ప్రస్తుతం మర్యం, హజ్వా ఖలాస్‌, జైదీ, ముజాఫాతి, యాతి, కిమియా వంటి ఖర్జూరలు మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: MLC Kavitha: మహిళలకు ఎమ్మెల్సీ కవిత సూచన.. ఆమె ఏమన్నారంటే..


హలీం ప్రత్యేకత

ఈ రంజాన్‌ మాసంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది హలీం గురించే. రోడ్లకు ఇరువైపుల జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో, మజీద్‌ పరిసర ప్రాంతాల్లో హలీం బట్టీలు కనిసిస్తున్నాయి. రంజాన్‌ మాసంలో మేక మాంసంతో ప్రత్యేకంగా వంటకంగా తయారు చేస్తారు. రోజూ సాయంత్రం ఉపవాస దీక్షను విరమించిన తరువాత కొందరు ముస్లింలు హలీంను ఆరగిస్తుంటారు. అయితే మరికొందరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. అనేక రకాల పోషక విలువలు కలిగిన మసాలాలతో పాటు నెయ్యి వేసి తయారు చేస్తారు. శరీరానికి కావాల్సిన శక్తిని అందించడంతో పాటు అలసటను దూరం చేయడం దీని ప్రత్యేకత.

city5.2.jpg


మటన్‌ హలీం రుచి బాగుంది

రంజాన్‌ నెలలో హలీం తినడానికి ఎక్కువగా ఇష్టపడుతాను. ముఖ్యంగా మేక మాంసంతో తయారు చేసిన వంటకం రుచిగా ఉంది. కులమతాలకతీతంగా అందరూ ఆరగిస్తున్నారు.

పోషకాలు ఎక్కువ

అరబ్‌ దేశాల్లో అత్యధికంగా పండించే ఖర్జూరలో పోషక విలువలు అత్యధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రోగాలు దరిచేరవు. ముఖ్యంగా జీర్జవ్యవస్థ క్రమబద్ధీకరించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో 70 శాతం చక్కెర ఉంటుంది. పొటాషియం, మాంగనీస్‌, సల్ఫర్‌, కాల్షియం, పాస్పరస్‌, వంటి ఖనిజాలు విరివిగా ఉంటాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. విటమిన్‌ ఎ, బి-కాంప్లెక్స్‌, విటమిన్లు, ప్రోటీన్లు కూడా అధికంగా ఉంటాయని వైద్యులు పేర్కొంటున్నారు. 100 గ్రాములు ఖర్జూర తింటే 350 కిలో క్యాలరీల శక్తి శరీరానికి లభిస్తుంది. అందుకే ఉపవాస దీక్ష సమయంలో ప్రత్యేకంగా ఈ పండ్లను తినడం వల్ల ముస్లింలకు ఇఫ్తార్‌ సమయంలో అలసట దరిచేరకుండా ఉంటుంది.


ఈ వార్తలను కూడా చదవండి:

Harish Rao: సీఎం రేవంత్‌ రాజీనామా చేయాలి

కాళేశ్వరం నీరందకనే ఎండుతున్న పంటలు

Farmers: పంటతడి.. కంటతడి!

కేసీఆర్‌తో భేటీలో ఆ విషయం మాట్లాడు.. కవితకు ఎంపీ రఘునందన్ మాస్ సవాల్

Read Latest Telangana News and National News

Updated Date - Mar 11 , 2025 | 09:07 AM