
Breaking News: భారీ వర్షం.. చుక్కలు చూపిస్తున్న మెట్రో..
ABN , First Publish Date - Jul 17 , 2025 | 05:12 PM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
Jul 17, 2025 21:30 IST
హోంమంత్రి అనిత మచిలీపట్నం పర్యటనలో భద్రతాలోపం
అనిత పర్యటన సందర్భంగా ఉద్రిక్తతలకు వైసీపీ నేతల ప్లాన్
వైసీపీ నేతల ప్రణాళికకు సహకరించిన కొంతమంది పోలీసులు
మంత్రి కొల్లు రవీంద్ర ఇంటికి వెళ్లాల్సి ఉన్న హోంమంత్రి అనిత
మంత్రి కొల్లు ఇంటికి సమీపంలో చీపుళ్లతో వైసీపీ మహిళా నేతల నిరసన
కొల్లు రవీంద్ర ఇంటికి వెళ్లకుండా పర్యటన వాయిదా వేసుకున్న అనిత
మచిలీపట్నంలో పేర్ని నానికి కొందరు పోలీసులు సహకరిస్తున్నారని హోంమంత్రి అనితకు స్థానిక టీడీపీ నేతలు ఫిర్యాదు
ఇనగుదురు పీఎస్‌లో వైసీపీ నేతలపై టీడీపీ నేతలు ఫిర్యాదు
-
Jul 17, 2025 21:30 IST
బాపట్ల: వైసీపీ ఐదేళ్ల పాలనలో నరకం చూశాం: హోంమంత్రి అనిత
ఏపీలో అభివృద్ధిని చూసి వైసీపీ ఓర్వలేకపోతోంది: అనిత
కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు: హోంమంత్రి అనిత
పరామర్శల పేరుతో ప్రజలపైకి జగన్ దండయాత్ర చేస్తున్నారు: అనిత
మహిళలను కనీసం గౌరవించలేని పార్టీ వైసీపీ: హోంమంత్రి అనిత
-
Jul 17, 2025 20:42 IST
ఏపీ హైకోర్టులో వైసీపీ నేత పేర్ని నానికి ఎదురుదెబ్బ
పామర్రు పీఎస్‌లో నమోదైన కేసులో తొందరపాటు చర్యలు తీసుకోకుండా..
పోలీసులను ఆదేశించాలని చేసిన అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు
కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశం
తదుపరి విచారణ ఈనెల 22కి వాయిదా
పామర్రు పోలీసులు పెట్టిన కేసు కొట్టివేయాలని కోరుతూ పేర్ని నాని పిటిషన్
-
Jul 17, 2025 20:42 IST
నామినేటెడ్ పదవుల భర్తీలో మరో అడుగు
అమరావతి: కూటమి ప్రభుత్వ నామినేటెడ్ పదవుల భర్తీలో మరో అడుగు
66 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల ఖరారు
జనసేనకు 9 AMC, బీజేపీకి 4 AMC చైర్మన్ల పదవులు
66 చైర్మన్ పదవుల్లో బీసీలకు 17, ఎస్సీ 10, ఎస్టీ 5, మైనారిటీలకు 5
66 మార్కెట్ కమిటీ చైర్మన్లలో 35 చోట్ల మహిళలకు అవకాశం
-
Jul 17, 2025 20:18 IST
భారీగా ట్రాఫిక్ జామ్..
హైదరాబాద్: గచ్చిబౌలి, మాదాపూర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్
గచ్చిబౌలి PJR ఫ్లైఓవర్‌పై స్తంభించిన వాహనాలు
వర్షంతో పాటు ట్రాఫిక్ జామ్‌తో వాహనదారుల ఇబ్బందులు
-
Jul 17, 2025 20:18 IST
కిషోర్ అరెస్టు
విజయవాడ జంట హత్యల కేసు నిందితుడు కిషోర్ అరెస్టు
సికింద్రాబాద్‌లో అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్
విజయవాడ పోలీసులకు నిందితుడు కిషోర్ అప్పగింత
-
Jul 17, 2025 19:57 IST
ఆ స్కూల్ కు మహర్దశ..
బాపట్ల మున్సిపల్ హైస్కూల్‌లో అధునాతన మౌలిక వసతులు
యుద్ధ ప్రాతిపదికన 24 గదులు, డైనింగ్ హాల్, ల్యాబ్స్ నిర్మాణం పూర్తి
గతేడాది డిసెంబర్ 7న ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్
మంచి ఫలితాలు సాధించి బాపట్ల హైస్కూల్ పేరు నిలబెట్టాలి: లోకేష్
-
Jul 17, 2025 19:57 IST
మహబూబ్‌నగర్ కు సీఎం రేవంత్..
మహబూబ్‌నగర్: రేపు కొల్లాపూర్ మండలం జటప్రోలులో సీఎం రేవంత్ పర్యటన
యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్
SHGలకు వడ్డీలేని రుణాల చెక్కులు పంపిణీ చేయనున్న సీఎం రేవంత్
-
Jul 17, 2025 19:55 IST
చుక్కలు చూపిస్తున్న మెట్రో..
హైదరాబాద్: నాగోల్-రాయదుర్గం మెట్రోలో సాంకేతికలోపం
ఆలస్యంగా నడుస్తున్న మెట్రో రైళ్లు, ప్రయాణికుల ఇబ్బందులు
ప్రయాణికులతో కిక్కిరిసిన రాయదుర్గం మెట్రో స్టేషన్
టికెట్ కౌంటర్ నుంచి కిలోమీటర్ మేర బారులుతీరిన ప్రయాణికులు
-
Jul 17, 2025 19:53 IST
బెట్టింగ్‌కు బానిసై సోదరుడి ఇంట్లో చోరీ చేసిన సోదరి అరెస్ట్
హైదరాబాద్: ఈ నెల 5న గాజులరామారం షిర్డీ హిల్స్‌లో ఘటన
కారు పూజ కోసం సోదరుడు కర్మాన్‌ఘాట్ వెళ్లినప్పుడు ఇంట్లో చోరీ
ఇంట్లో చోరీ ఘటనపై పోలీసులకు బాధితుడు ఫిర్యాదు
బాధితుడి సోదరి చోరీకి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు
ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసై రూ.5లక్షలు అప్పు చేసిన సోదరి
స్నేహితులు కార్తీక్, అఖిల్‌తో కలిసి చోరీకి సోదరి పథకం
ముగ్గురు కలిసి 12 తులాల బంగారం, వెండి నగలు చోరీ
గోల్డ్ షాపులో తనఖా పెట్టిన నిందితురాలు
ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన జగద్గిరిగుట్ట పోలీసులు
-
Jul 17, 2025 19:53 IST
SIPB సమావేశం..
అమరావతి: సీఎం క్యాంప్ ఆఫీస్‌లో SIPB సమావేశం
ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన, పర్యాటక రంగాల్లోని వివిధ పరిశ్రమలకు భూకేటాయింపులు, అనుమతులపై చర్చ
-
Jul 17, 2025 18:29 IST
HCAపై ఈడీ కేసు నమోదు
ECIRలో ఐదుగురిపై కేసులు నమోదు
గతంలో నమోదైన రెండు HCA కేసులు కలిపి కొత్త ECIR
PMLA సెక్షన్ కింద కేసులు నమోదుచేసిన ఈడీ
BCCI నిధులు అంశంలో మనీలాండరింగ్ జరిగినట్లు కేసు
జగన్మోహన్‌రావు, శ్రీనివాసరావు, రాజేంద్ర యాదవ్,..
సునీల్ కాంటే, కవితపై కేసులు
కేసు నమోదుతో నిందితులను కస్టడీకి కోరనున్న ఈడీ
CID కస్టడీ ముగియగానే ఈడీ విచారణ
-
Jul 17, 2025 17:47 IST
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం
కూకట్‌పల్లి, KPHB, నిజాంపేట్, మియాపూర్‌లో వర్షం
మూసాపేట్, బాలానగర్, సనత్‌నగర్, ఎర్రగడ్డలో వర్షం
మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్‌లో వర్షం
శేరిలింగంపల్లి, హకీంపేట్, కంటోన్మెంట్, ఖైరతాబాద్‌లో వర్షం
అధికారులను అప్రమత్తం చేసిన GHMC
-
Jul 17, 2025 17:47 IST
బాక్సింగ్ పోటీల్లో గందరగోళం..
హైదరాబాద్: షేక్‌పేట్ స్టేట్‌లెవెల్ బాక్సింగ్ పోటీల్లో గందరగోళం
ఒకరినొకరు కొట్టుకున్న బాక్సర్లు, కోచ్‌లు
తప్పుడు ఎంపైరింగ్‌తో ఓడిపోయామని మరో టీమ్ దాడి
-
Jul 17, 2025 17:33 IST
మా అందరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి: హరీష్‌రావు
మా ఫోన్లను రేవంత్ ట్యాప్ చేస్తున్నారు: హరీష్‌రావు
ఢిల్లీలో ఒక రిపోర్టర్‌ను హరీష్‌రావుతో మాట్లాడుతున్నావట అని బెదిరించారు: హరీష్‌రావు
ఆ రిపోర్టర్ నాతో మాట్లాడుతున్నట్లు రేవంత్‌కు ఎలా తెలుసు?: హరీష్‌రావు
ట్యాప్ చేస్తేనే కదా తెలిసేది?: హరీష్‌రావు
-
Jul 17, 2025 17:33 IST
ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ ఫెయిల్: హరీష్‌రావు
పగలు, ప్రతీకారాలతో రేవంత్ పాలన: హరీష్‌రావు
కేసీఆర్ ఆదాయం పెంచి పేదలకు పంచారు: హరీష్‌రావు
రేవంత్ పాలనలో ఆదాయం పడిపోయింది: హరీష్‌రావు
ఓటుకు నోటు కేసులో రేవంత్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదు?
రేవంత్‌రెడ్డిని కిషన్‌రెడ్డి కాపాడుతున్నారు: హరీష్‌రావు
తెలంగాణకు రేవంత్ గుండుసున్నా సాధించారు: హరీష్‌రావు
కేటీఆర్‌పై రేవంత్ ఆరోపణలు రుజువు చేయాలి: హరీష్‌రావు
లేదంటే లీగల్‌గా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి: హరీష్‌రావు
లోకేష్‌ను చీకట్లో కావాల్సిన అవసరం కేటీఆర్‌కు లేదు: హరీష్‌రావు
-
Jul 17, 2025 17:33 IST
తెలంగాణ సమాజానికి రేవంత్ క్షమాపణలు చెప్పాలి: హరీష్‌రావు
రుణమాఫీ పైనా సీఎం రేవంత్ అబద్ధాలు చెప్పారు: హరీష్‌రావు
కేటీఆర్‌తో చర్చ నుంచి సీఎం రేవంత్ పారిపోయారు: హరీష్‌రావు
సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ఇంటి దొంగ: హరీష్‌రావు
రేవంత్ తినే సొమ్ము తెలంగాణది, పాడే పాట ఏపీది: హరీష్‌రావు
నిజాయితీ ఉంటే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి: హరీష్‌రావు
-
Jul 17, 2025 17:14 IST
చిట్‌చాట్ పేరుతో రేవంత్‌రెడ్డి నాపై అసత్య ఆరోపణలు చేశారు: కేటీఆర్
డ్రగ్స్ కేసుతో నాకు సంబంధం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయా?: కేటీఆర్
నాపై ఏదైనా డ్రగ్స్ కేసు నమోదైందా?: కేటీఆర్
ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సీఎంను సవాల్ చేస్తున్నా: కేటీఆర్
చిట్‌చాట్లతో వ్యక్తిత్వ హననానికి పాల్పడడం సీఎంకు కొత్త కాదు: కేటీఆర్
రేవంత్‌రెడ్డి.. మిమ్మల్ని కోర్టుకు లాగుతా: కేటీఆర్
నాపై దుష్ప్రచారానికి రేవంత్‌రెడ్డి మూల్యం చెల్లించుకోక తప్పదు: కేటీఆర్
-
Jul 17, 2025 17:14 IST
కేంద్రానికి సీఎం విజ్ఞప్తులు..
సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదించండి: రేవంత్‌రెడ్డి
కేంద్రమంత్రి అశ్వినీవైష్ణవ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి పలు విజ్ఞప్తులు
తెలంగాణకు నూతన రైలు మార్గాలు మంజూరు చేయండి
కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటుచేయండి: సీఎం రేవంత్‌రెడ్డి
-
Jul 17, 2025 17:12 IST
చెత్త వ్యాఖ్యలను ఖండిస్తున్నా: ఎమ్మెల్యే హరీష్‌రావు
కేటీఆర్‌పై సీఎం చెత్త వ్యాఖ్యలను ఖండిస్తున్నా: ఎమ్మెల్యే హరీష్‌రావు
కేటీఆర్‌పై గంజాయి అంటూ రేవంత్‌రెడ్డి చెత్త వ్యాఖ్యలు: హరీష్‌రావు
ఢిల్లీ కాలుష్యాన్ని తన మాటలతో రేవంత్‌రెడ్డి మరింత పెంచుతున్నాడు
రేవంత్‌రెడ్డి ఒక గజినీ, ఆయన చుట్టూ గార్బేజ్ బ్యాచ్ ఉంది: హరీష్‌రావు
జై తెలంగాణ అనడం లేదంటే మా పార్టీకి లింక్ పెడుతున్నారు: హరీష్‌రావు
జై తెలంగాణ అంటే చంద్రబాబుకు కోపం వస్తుందని రేవంత్ భయం: హరీష్‌రావు