
Breaking News: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం..
ABN , First Publish Date - Jul 10 , 2025 | 07:38 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
Jul 10, 2025 20:09 IST
అమరావతి: P-4 జీరో పావర్టీ కార్యక్రమంపై సీఎం చంద్రబాబు సమీక్ష
P-4 కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అంశంపై చర్చ.
ఇప్పటివరకు మార్గదర్శులుగా ఉండేందుకు వచ్చిన.. 18,332 మంది పారిశ్రామికవేత్తలు, NRIలు, ఉన్నతవర్గాలు.
వీరిద్వారా 1,84,134 మంది బంగారు కుటుంబాలకు చేయూత.
మార్గదర్శులను ప్రోత్సహించేందుకు పలు చర్యలు చేపట్టాలని నిర్ణయం.
-
Jul 10, 2025 20:07 IST
ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం
4 గంటలపాటు సాగిన తెలంగాణ కేబినెట్ భేటీ.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు కేబినెట్ ఆమోదం.
అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం.
గతంలో పదేళ్లపాటు రిజర్వేషన్లు అమలయ్యేలా చేసిన.. చట్టానికి సవరణ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం.
కాసేపట్లో మీడియాతో తెలంగాణ మంత్రుల సమావేశం.
కేబినెట్ నిర్ణయాలను వెల్లడించనున్న మంత్రులు.
-
Jul 10, 2025 18:06 IST
హెచ్సీఏ స్కామ్‌లో మొత్తం ఆరుగురు నిందితులపై కేసు నమోదు.
ఇప్పటి వరకు ఐదుగురు అరెస్ట్.. మరొకరు పరార్..
A -1 జగన్ మోహన్ రావు HCA అధ్యక్షులు.
A -2. దేవరాజ్ రామ చందర్ HCA సెక్రటరీ
A-3 జగన్నాథ్ శ్రీనివాస్ రావు HCA ట్రెజరర్
A-4 సునీల్ కుమార్ CEO
A-5 రాజేందర్ యాదవ్ శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రెటరీ..
A-6 కవిత రాజేందర్ యాదవ్ భార్య.
A -2. దేవరాజ్ రామ చందర్ HCA సెక్రటరీ పరారిలో ఉన్న నిందితుడు.
-
Jul 10, 2025 16:53 IST
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
346 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్
121 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ
-
Jul 10, 2025 14:40 IST
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..
ప్రభుత్వ ఉద్యోగులకు 30%-34% శాతం జీతాలు పెరిగే అవకాశం.
ఈ మేరకు 8వ వేతన సంఘం సిఫార్సు చేసే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ.
2026 జనవరి నుంచి పెరిగిన జీతాలు అమలులోకి వచ్చే అవకాశం.
ప్రతి 10 ఏళ్లకు వేతన సంఘాన్ని నియమిస్తున్న కేంద్రం.
2016లో 7వ వేతన సంఘాన్ని నియమించిన మోదీ ప్రభుత్వం.
మళ్లీ ఈ ఏడాది 8వ వేతన సంఘాన్ని నియమించిన మోదీ సర్కార్.
8వ వేతన సంఘం సిఫారసులతో 11 మిలియన్ల ఉద్యోగులకు లబ్ధి.
అత్యల్పంగా 14శాతం మాత్రమే జీతాలు పెంచిన 7వ వేతన సంఘం.
పెరిగిన ద్రవ్యోల్భణాన్ని దృష్టిలో పెట్టుకొని 30శాతం నుంచి 34శాతం వరకూ జీతాలు పెరిగే అవకాశం ఉందంటూ ప్రభుత్వ వర్గాలు అంచనా.
-
Jul 10, 2025 13:27 IST
మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి: మంత్రి లోకేష్
ఇంటి దగ్గర నుంచే ఈ విషయంలో మార్పు రావాలి
ఇంట్లో వాడే భాష మారాలి: మంత్రి లోకేష్
గాజులు తొడుక్కున్నావా?.. చీర కట్టుకున్నావా?.. ఇలాంటి కించపరిచే మాటలు వద్దు: లోకేష్
మహిళలను గౌరవంగా సంబోధించాలి: లోకేష్
విద్యాశాఖలో కొత్త యాప్‌ను తీసుకొస్తున్నాం: లోకేష్
ఆ యాప్ ద్వారా సమగ్ర సమాచారం అందిస్తాం: లోకేష్
డిప్యూటీ సీఎం పవన్ అన్న ఛాలెంజ్ స్వీకరిస్తున్నా: లోకేష్
విద్యాశాఖ ద్వారా కోటి మొక్కలు నాటుతాం: లోకేష్
ప్రతి మొక్కకు గ్రీన్ పాస్ పోస్ట్ ఇస్తున్నాం: లోకేష్
గ్రీన్ పాస్ పోస్ట్ ద్వారా మొక్క పరిస్థితిని తెలుసుకోవచ్చు: లోకేష్
-
Jul 10, 2025 09:18 IST
ఢిల్లీలో భూప్రకంపనలు
రిక్టర్ స్కేల్‌పై 4.1 తీవ్రత నమోదు
ఉత్తర భారత్‌లో పలు రాష్ట్రాల్లో స్వల్ప భూకంపం
రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో స్వల్ప భూప్రకంపనలు
-
Jul 10, 2025 09:17 IST
నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం
మ.3 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినేట్ భేటీ
గత సమావేశాల్లో చర్చించిన అంశాల పురోగతిపై సమీక్ష
కేబినెట్‌కు నివేదిక సమర్పించనున్న అధికారులు
-
Jul 10, 2025 09:17 IST
ఇవాళ ఏపీ వ్యాప్తంగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లు
అన్ని ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లలో కార్యక్రమం
ఉదయం 10 గంటలకు కార్యక్రమం మొదలు
పాఠశాల విద్యలో తల్లిదండ్రుల పాత్ర... ఉపాధ్యాయుల సహకారంపై చర్చ
గిన్నిస్ బుక్ రికార్డ్ దిశగా పేరెంట్ టీచర్ మీటింగ్
-
Jul 10, 2025 09:17 IST
కాసేపట్లో పుట్టపర్తి వెళ్లనున్న సీఎం చంద్రబాబు, లోకేష్
సత్యసాయి మహాసమాధిని దర్శించుకోనున్న చంద్రబాబు, లోకేశ్
కొత్తచెరువులో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌లో పాల్గొననున్న సీఎం
-
Jul 10, 2025 09:17 IST
హైదరాబాద్: నేడు మరోసారి యశోద ఆస్పత్రికి కేసీఆర్
గత 5 రోజులుగా నందినగర్ నివాసంలోనే ఉన్న కేసీఆర్
వైద్య పరీక్షల అనంతరం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు కేసీఆర్
-
Jul 10, 2025 07:41 IST
సత్యసాయి జిల్లాకు సీఎం చంద్రబాబు..
శ్రీసత్యసాయి జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన
సత్యసాయి మహాసమాధిని దర్శించుకోనున్న చంద్రబాబు
కొత్తచెరువులో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌లో పాల్గొననున్న సీఎం
-
Jul 10, 2025 07:41 IST
ఫోన్ ట్యాపింగ్ కేసు..
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ
నేడు మరోసారి సిట్ విచారణకు రానున్న ప్రభాకర్‌రావు
-
Jul 10, 2025 07:39 IST
ముగిసిన ప్రధాని మోదీ విదేశీ పర్యటన
8 రోజుల పాటు ఐదు దేశాల్లో పర్యటించిన మోదీ
ఘనా, ట్రినిడాడ్ టొబాగో, అర్జెంటీనా బ్రెజిల్, నమీబియా దేశాల్లో పర్యటించిన మోదీ
నమీబియా నుంచి ఢిల్లీ బయల్దేరిన ప్రధాని మోదీ
-
Jul 10, 2025 07:39 IST
విశాఖ: సింహాచలంలో ఆషాడ పౌర్ణమి వేడుకలు
తుది విడత చందన సమర్పణ
స్వామివారి దర్శనానికి అదనపు క్యూలైన్ ఏర్పాటు
32 కి.మీ. గిరిప్రదక్షిణ చేయని భక్తుల కోసం కొండపై 32 సార్లు ఆలయ ప్రదక్షిణకు ఏర్పాట్లు
-
Jul 10, 2025 07:38 IST
ఇంగ్లాండ్ వర్సెస్ భారత్..
నేడు ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ మూడో టెస్ట్ మ్యాచ్
లార్డ్స్ వేదికగా మ.3.30 గంటలకు టెస్ట్ మ్యాచ్ ప్రారంభం
-
Jul 10, 2025 07:38 IST
హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఈడీ కేసు నమోదు
29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసు నమోదు
విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటి, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖిపై కేసు నమోదు
గ్రేటర్ పరిధిలో నమోదైన FIRల ఆధారంగా ఈడీ విచారణ
సినీ సెలబ్రెటీలు, యూట్యూబర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్లపై PMLA కింద విచారణ
సినీ సెలబ్రిటీల స్టేట్‌మెంట్స్ రికార్డ్ చేయనున్న ఈడీ అధికారులు