
Breaking News: దయచేసి నన్ను క్లబ్‌లు, పబ్‌లకు పిలవొద్దు: సీఎం రేవంత్
ABN , First Publish Date - Jul 09 , 2025 | 09:27 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
Jul 09, 2025 20:03 IST
కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ప్రభుత్వ చర్యలను వివరిస్తాం: సీఎం రేవంత్
కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు.. ఆయన ఆరోగ్యంగా ఉండాలి: సీఎం రేవంత్
కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, తెలంగాణ అభివృద్ధికి సహకరించాలి: సీఎం రేవంత్
మీ ఇంట్లో సమస్యలు ఉంటే మీరు తీర్చుకోండి: సీఎం రేవంత్
కేసీఆర్ ఆరోగ్యం బాగా లేదంటే..
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనైనా చర్చకు సిద్ధం: సీఎం రేవంత్
మంత్రులతో మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం: సీఎం రేవంత్
క్లబ్‌లు, పబ్‌లు అంటే మాకు ఇబ్బంది: సీఎం రేవంత్
క్లబ్‌లు, పబ్‌లకు మేం మొదటి నుంచి దూరం: సీఎం రేవంత్
దయచేసి నన్ను క్లబ్‌లు, పబ్‌లకు పిలవొద్దు: సీఎం రేవంత్
-
Jul 09, 2025 18:20 IST
SRH, HCA వివాదంలో బిగ్ ట్విస్ట్
HCA అధ్యక్షుడు జగన్మోహన్‌రావు అరెస్టు
HCA అధ్యక్షుడితో పాటు పాలకవర్గం సభ్యులను అరెస్ట్ చేసిన CID
గత IPL మ్యాచ్ సందర్భంగా SRH, HCA మధ్య టికెట్ల వివాదం
హైదరాబాద్-లక్నో మ్యాచ్‌లో VIP గ్యాలరీలకు తాళాలు వేసిన HCA
IPL టికెట్ల వ్యవహారంలో విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా CID చర్యలు
HCA అధ్యక్ష హోదాలో SRH ఫ్రాంచైజీని బెదిరించినట్లు అభియోగం
20 శాతం టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని SRHని డిమాండ్ చేసిన జగన్మోహన్‌రావు
లేదంటే మ్యాచ్‌లు జరగనివ్వబోమని SRHని బెదిరించినట్లు ఆరోపణలు
10% టికెట్లు కేటాయించాలని జగన్మోహన్‌రావు పట్టుబట్టినట్లు ఆరోపణలు
HCAపై చర్యలు తీసుకుని వేదికలు మార్చాలని గతంలో BCCIని కోరిన SRH
వివాదం నేపథ్యంలో విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశం.
-
Jul 09, 2025 17:27 IST
అమరావతి: కొందరు మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి
మంత్రుల పనితీరు సంతృప్తికరంగా లేదు: సీఎం చంద్రబాబు
ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యల ఘటనలో మంత్రులు సరిగా రియాక్ట్ కాలేదు..
మిగతా విషయాల్లోనూ మంత్రులు సరిగా రియాక్ట్ కావట్లేదు: చంద్రబాబు
పొగాకు, మామిడి పంటలకు మనం సరైన మద్దతు ధర ఇచ్చినా.. మంత్రులు సరిగా స్పందించట్లేదు: సీఎం చంద్రబాబు
మనం చేసిన మంచి పనులు చెప్పుకోవడం లేదు: సీఎం చంద్రబాబు
-
Jul 09, 2025 15:30 IST
చిత్తూరు: ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శివకుమార్‌పై వైసీపీ మూకలు దాడి
బంగారుపాళ్యం మామిడి మార్కెట్‌యార్డ్ దగ్గర..
ఫొటోలు తీస్తుండగా ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై వైసీపీ గ్యాంగ్ దాడి
ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శివకుమార్‌పై కక్ష గట్టి వైసీపీ మూకల దాడి
కెమెరా చిప్స్ లాక్కుని ఫొటోలు డిలీట్ చేసిన వైసీపీ గూండాలు
ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శివకుమార్‌పై దాడి చేసి గాయపరిచిన వైసీపీ గ్యాంగ్
-
Jul 09, 2025 15:00 IST
జగన్ పర్యటనలో మామిడి పంటను తొక్కేయడం దారుణం: మంత్రి నాదెండ్ల
జగన్ వచ్చినప్పుడు రోడ్డుపై మామిడి వేయాలని ముందే ప్లాన్: నాదెండ్ల
ఇద్దరు డ్రైవర్లు ఈ విషయాన్ని స్వయంగా అంగీకరించారు: మంత్రి నాదెండ్ల
శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని వైసీపీ కుట్ర: మంత్రి నాదెండ్ల
రెచ్చగొట్టడానికే కాలు తీసేస్తాం, చేయి తీసేస్తాం అంటున్నారు: నాదెండ్ల
-
Jul 09, 2025 14:30 IST
హైదరాబాద్: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్
గత పదేళ్ల కంటే కృష్ణా జలాల వినియోగంలో..
మా ప్రభుత్వం సమర్థవంతంగా ముందుకెళ్తోంది: మంత్రి ఉత్తమ్
కాళేశ్వరంలో ఒకటే పిల్లర్ కుంగిందని BRS తప్పుడు ప్రచారం: ఉత్తమ్
-
Jul 09, 2025 13:53 IST
కూలిన ఎయిర్‌ఫోర్స్ విమానం..
రాజస్థాన్‌లో కూలిన ఎయిర్‌ఫోర్స్ విమానం
వైమానిక విమానం కూలిన ఘటనలో పైలట్ మృతి
రాజస్థాన్‌లోని రతన్‌గఢ్ ప్రాంతంలో ఘటన
-
Jul 09, 2025 13:50 IST
బంగారుపాళ్యంలో మాజీ MLA వెంకట్‌గౌడ్ అనుచరుల హంగామా
మమ్మల్ని అడ్డుకుంటారా అంటూ పోలీసులపై దురుసు ప్రవర్తన
రప్పా.. రప్పా నరకండి అంటూ DSPపై తిరగబడిన వైసీపీ శ్రేణులు
DSPతో మాజీ MLA వెంకట్‌గౌడ్ వాగ్వాదం, పరిస్థితి ఉద్రిక్తం
-
Jul 09, 2025 13:35 IST
హైదరాబాద్‌లో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు
కొంపల్లి మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్టు గుర్తించిన ఈగల్ టీమ్
మల్నాడు రెస్టారెంట్ ఓనర్ సూర్య నేతృత్వంలో డ్రగ్స్ సరఫరా
కార్డియాలజీ డాక్టర్ ప్రసన్నకు కూడా డ్రగ్స్ సరఫరా చేసిన సూర్య
సూర్య నుంచి 20 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసిన డాక్టర్ ప్రసన్న
-
Jul 09, 2025 13:34 IST
23 మంది వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సరఫరా చేసిన సూర్య
హైదారాబాద్ లోని ప్రముఖ పబ్‌ల్లో డ్రగ్స్ పార్టీలు జరిగినట్టు గుర్తింపు
డ్రగ్స్ పార్టీల కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తున్న పబ్ నిర్వాహకులు
ప్రిజం, ఫామ్, బర్డ్ బాక్స్, బ్లాక్ 22, వాక్ కోరా, బ్రాడ్ వే, వాక్ కోరా పబ్‌పై కేసు
క్వాక్ రాజా శేఖర, పృధ్వీ వీరమాచినేని, రోహిత్ మాదిశెట్టి కేసు నమోదు
ములుగులోని రిసార్ట్‌లో పలువురికి సూర్య పార్టీలు ఇచ్చినట్టు ఈగల్ గుర్తింపు
ఢిల్లీ నుంచి వచ్చిన మహిళల ఐహీల్స్‌లో డ్రగ్స్ పెట్టి సూర్యకు సరఫరా చేసిన నైజీరియన్ గ్యాంగ్
-
Jul 09, 2025 13:33 IST
తెలంగాణ రెవెన్యూ శాఖలో భారీ స్కామ్ జరిగింది: BRS నేత గంగుల
రూ.వెయ్యి కోట్ల స్కామ్‌పై ఈడీకి ఫిర్యాదు చేస్తాం: గంగుల కమలాకర్
35లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్మి 7వేల 600కోట్ల ఆదాయం కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచింది: గంగుల
సివిల్ సప్లై స్కామ్‌పై బండి సంజయ్, కిషన్‌రెడ్డి స్పందించాలి: గంగుల కమలాకర్
-
Jul 09, 2025 12:10 IST
హైదరాబాద్: కూకట్‌పల్లి కల్తీకల్లు బాధితుల్లో ముగ్గురు మృతి
గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఇద్దరు, ఇంట్లో మరొకరు మృతి
మృతులు తులసిరామ్(47), బొజ్జయ్య(55), నారాయణమ్మ(65)
మృతులంతా హెచ్‌ఎంటీ హిల్స్ సాయిచరణ్‌కాలనీ వాసులు
నిమ్స్‌లో చికిత్సపొందుతున్న 12 మంది బాధితులు
కల్తీకల్లు బాధితులను పరామర్శించిన మంత్రి జూపల్లి
-
Jul 09, 2025 12:10 IST
కిడ్నాపైన చిన్నారి ఆచూకీ లభ్యం..
హైదరాబాద్: శంషాబాద్‌లో కిడ్నాపైన చిన్నారి ఆచూకీ లభ్యం
వికారాబాద్‌లో చిన్నారి కీర్తనను గుర్తించిన పోలీసులు
మహిళా కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
Jul 09, 2025 12:10 IST
పల్నాడు: రెంటపాళ్ల వైసీపీ నేతలకు నోటీసులు
జగన్ పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించారని కేసులు నమోదు
సత్తెనపల్లి పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరైన వినుకొండ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు
-
Jul 09, 2025 10:51 IST
గుజరాత్: పద్రా దగ్గర మహిసాగర్ నదిపై కూలిన బ్రిడ్జి
నదిలో పడిపోయిన 4 వాహనాలు, నలుగురు మృతి
నదిలో పలువురు గల్లంతు
నదిలో పడ్డ కొందరిని కాపాడిన సహాయక బృందాలు
వడోదర-ఆనంద్ మధ్య నిలిచిన రాకపోకలు
-
Jul 09, 2025 10:51 IST
వైసీపీ శ్రేణుల వీరంగం..
బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్‌లో వైసీపీ శ్రేణుల వీరంగం
పోలీసుల ఆంక్షలను పట్టించుకోని వైసీపీ కార్యకర్తలు
పోలీసులను తోసేసి మార్కెట్ యార్డ్‌లోకి వచ్చిన వైసీపీ శ్రేణులు
పోలీసుల సూచనలను పట్టించుకోని వైసీపీ శ్రేణులు
-
Jul 09, 2025 09:27 IST
హైదరాబాద్: ఒవైసీ ఫాతిమా కాలేజీపై హైడ్రా క్లారిటీ
కాలేజీలో 10వేల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు: హైడ్రా
సామాజిక కారణాలవల్లే ఫాతిమా కాలేజీ కూల్చివేతను నిలిపివేశాం: హైడ్రా
సామాజిక స్పృహతో కాలేజీ నడుస్తుందనే మెతకవైఖరి: హైడ్రా
MIM నేతలు ఆక్రమించిన రూ. వెయ్యి కోట్ల ఆస్తులను రికవరీ చేస్తున్నాం
MIM కార్పొరేటర్ కబ్జా చేసిన స్థలాన్ని స్వాధీనం చేసుకున్నాం: హైడ్రా
ఎంఐఎం నేతల ఆస్తుల వ్యవహారంలో కఠినంగానే వ్యవహరిస్తున్నాం: హైడ్రా
-
Jul 09, 2025 09:27 IST
శాకాంబరి ఉత్సవాలు..
ఇంద్రకీలాద్రిపై రెండోరోజు శాకాంబరి ఉత్సవాలు
ఆలయ పరిసరాలను కూరగాయలు, పండ్లతో అలంకరణ
భక్తులకు అమ్మవారి కదంబం ప్రసాద వితరణ