
Breaking News: చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిటిషన్..
ABN , First Publish Date - Jul 07 , 2025 | 03:11 PM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
Jul 07, 2025 20:39 IST
చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిటిషన్..
ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిటిషన్
మద్యం స్కామ్‌లో తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమన్న మెహిత్‌రెడ్డి
హైకోర్ట్ విధించే నిబంధనలకు కట్టుబడి ఉంటానని కోర్టుకు తెలిపిన మోహిత్
రేపో మాపో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం
-
Jul 07, 2025 20:39 IST
హైదరాబాద్: నాంపల్లి కోర్టు సంచలన తీర్పు
పోక్సో కేసులో అరెస్టయిన నిందితుడికి 20 ఏళ్లు జైలుశిక్ష
జనపాల అఖిల్(21)కు 20ఏళ్ల జైలుశిక్ష, రూ.5 వేలు జరిమానా విధింపు
-
Jul 07, 2025 20:38 IST
సోహిణి బిల్డర్స్‌తో పాటు మరో నలుగురికి హైకోర్టు నోటీసులు జారీ
ప్రతివాదులుగా ఉన్న బెవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీకి నోటీసులు
ప్రతివాదులుగా ఉన్న బండి బిందు, పల్లవితో పాటు మరో ఇద్దరికి నోటీసులు
ఖాజాగూడ భూములపై పిల్ వేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మురళీనాయక్, రాజేష్ రెడ్డి
-
Jul 07, 2025 15:16 IST
బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి
తెలంగాణకు 3 రోజుల పాటు వర్ష సూచన
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
నేడు తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే చాన్స్
గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
-
Jul 07, 2025 15:13 IST
సైకో హల్‌చల్..
తిరుపతి కపిలతీర్థంలో సైకో హల్‌చల్
కత్తితో ముగ్గురిపై దాడి, ఒకరు మృతి
సైకో దాడిలో ఇద్దరికి తీవ్రగాయాలు
-
Jul 07, 2025 15:13 IST
పిటిషన్ డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు..
విజయవాడ: చాణక్య బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు
లిక్కర్ స్కామ్ కేసులో A8గా ఉన్న నిందితుడు చాణక్య
విజయవాడ సబ్‌జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చాణక్య
-
Jul 07, 2025 15:12 IST
నెల్లూరులో టీడీపీ శ్రేణులతో మంత్రి లోకేష్ ముఖాముఖి
కార్యకర్తల సందేహాలను నివృత్తి చేస్తున్న మంత్రి లోకేష్
ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా, అందరూ గుర్తించేలా చేయాలని లోకేష్‌ను కోరిన కార్యకర్తలు
అమ్మ ఒడి, సిలిండర్ల నగదు ఒకే తేదీన విడుదల చేసే అంశం సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని లోకేష్ హామీ
-
Jul 07, 2025 15:11 IST
అసెంబ్లీకి రాలేని పిరికి వ్యక్తి జగన్: మాజీమంత్రి దేవినేని ఉమ
జగన్ వంటి వ్యక్తి ప్రతిపక్షానికి కూడా పనికిరారు: దేవినేని ఉమ
కోర్టులు, ప్రజాస్వామ్యంపై గౌరవం లేని వ్యక్తి జగన్: దేవినేని ఉమ
ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి ఏపీని తగలబెట్టారు: దేవినేని ఉమ
బెయిల్‌పై ఉన్న ముద్దాయి వ్యవస్థలను బెదిరిస్తున్నారు: దేవినేని
పోలీసులు, న్యాయవ్యవస్థలు సవాల్‌గా తీసుకుని జగన్ రెడ్డిపై ఉన్న కేసులను త్వరితగతిన విచారించాలి: దేవినేని ఉమ