
Breaking News: గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో సీఎం చంద్రబాబు భేటీ
ABN , First Publish Date - Jul 11 , 2025 | 09:18 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
Jul 11, 2025 20:34 IST
లార్డ్స్ టెస్టు: ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 387 ఆలౌట్
5 వికెట్లతో రాణించిన జస్‌ప్రీత్ బుమ్రా
ఇంగ్లండ్ బ్యాటింగ్: జో రూట్ 104, బ్రిడన్ 56, జేమీ స్మిత్ 51, పోప్ 44, స్టోక్స్ 44
భారత్ బౌలింగ్: బుమ్రా 5, సిరాజ్, నితీష్‌కు చెరో 2, జడేజాకు 1 వికెట్
-
Jul 11, 2025 20:29 IST
విజయవాడ: గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో సీఎం చంద్రబాబు భేటీ
ఏడాది పాలన అంశాలను గవర్నర్‌కు వివరించిన సీఎం చంద్రబాబు.
ఏడాదిలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు.. చేపట్టిన అభివృద్ధి పనులను గవర్నర్‌కు వివరించిన చంద్రబాబు.
ఏపీలో పెట్టుబడుల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు.. ఫలితాలను గవర్నర్ నజీర్ దృష్టికి తీసుకెళ్లిన సీఎం చంద్రబాబు.
శాంతిభద్రతల పరిరక్షణ, గంజాయి నిర్మూలన కోసం.. చేపట్టిన చర్యలను గవర్నర్ నజీర్‌కు వివరించిన సీఎం చంద్రబాబు.
-
Jul 11, 2025 20:06 IST
ఢిల్లీ NCR ప్రాంతంలో భూకంపం
దేశ రాజధాని న్యూఢిల్లీలో భూకంపం సంభవించింది.
శుక్రవారం సాయంత్రం హర్యానాలోని ఝజ్జర్‌లో 3.7 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత ఢిల్లీలో కూడా ప్రకంపనలు సంభవించాయి.
గడిచిన రెండు రోజుల్లో హర్యానాలో ఇది రెండవ భూకంపం.
కాగా, ఢిల్లీలో శుక్రవారం రాత్రి 7.49 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
గురువారం ఉదయం, ఝజ్జర్ సమీపంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది.
దీంతో ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతం అంతటా ప్రకంపనలు సంభవించాయి.
-
Jul 11, 2025 18:03 IST
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి సన్నాహాలు
ఈనెల 14న తుంగతుర్తి నియోజకవర్గంలో కార్డులు పంపిణీ.
లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణవ్యాప్తంగా 2.4 లక్షల కొత్త రేషన్‌కార్డుల పంపిణీ.
11.30 లక్షల మంది పేదలకు చేకూరనున్న ప్రయోజనం.
-
Jul 11, 2025 16:49 IST
హైదరాబాద్: కల్తీ కల్లు వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ సీరియస్.
బాలానగర్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ వేణు కుమార్ సస్పెన్షన్.
డీటీఎఫ్ నర్సిరెడ్డి, AES మాధవయ్య, ES ఫయాజ్, AES జీవన్ కిరణ్ పాత్రపై కొనసాగుతున్న దర్యాప్తు.
-
Jul 11, 2025 14:16 IST
రాజాసింగ్ రాజీనామాకు బీజేపీ ఆమోదం
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎంపికపై రాజాసింగ్ అసంతృప్తి
జూన్ 30న రాజీనామా లేఖ పంపిన రాజాసింగ్
రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిన బీజేపీ చీఫ్ జేపీ నడ్డా
ఇటీవల MLA పదవి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన రాజాసింగ్
కాగా, లేఖలో కీలక అంశాలు ప్రస్తావించిన జేపీ నడ్డా
ఇటీవల రాజాసింగ్ ప్రస్తావించిన అంశాలు అసంబద్ధం: జేపీ నడ్డా
పార్టీ పనితీరు, భావజాలం, సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయంటూ లేఖలో పేర్కొన్న జేపీ నడ్డా
-
Jul 11, 2025 09:18 IST
మంత్రి సీతక్క పర్యటన..
నేడు ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన
మేడారం జాతర ఏర్పాట్లపై సమీక్షించనున్న మంత్రి
-
Jul 11, 2025 09:18 IST
అమరావతి: నేటి సీఎం చంద్రబాబు షెడ్యూల్
11 గంటలకు ప్రపంచ జనాభా దినోత్సవ సదస్సుకు చంద్రబాబు
మ. 3 గంటలకు కేంద్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో భేటీ
4 గంటలకు ఆదాయార్జు శాఖలపై చంద్రబాబు సమీక్ష
-
Jul 11, 2025 09:18 IST
కల్తీ కల్లు ఘటన.. బాధితులు ఎంతమంది అంటే..
హైదరాబాద్: కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో 51కి చేరిన బాధితులు
గాంధీ ఆస్పత్రిలో 14 మంది బాధితులకు కొనసాగుతున్న చికిత్స
నిమ్స్‌లో 34 మంది కల్తీ కల్లు బాధితులకు చికిత్స
నిమ్స్‌లో ఆరుగురికి డయాలసిస్ చేస్తున్న వైద్యులు
ESIలో ఒకరు, ప్రైవేట్ ఆస్పత్రిలో మరొకరికి కొనసాగుతున్న చికిత్స
ఇప్పటి వరకు కల్తీ కల్లుకు 9 మంది మృతి