Share News

Breaking News: రఘునందన్‌‌పై జగ్గారెడ్డి ఫైర్..

ABN , First Publish Date - May 30 , 2025 | 01:06 PM

LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: రఘునందన్‌‌పై జగ్గారెడ్డి ఫైర్..
Breaking News

Live News & Update

  • May 30, 2025 20:10 IST

    కొనసాగుతున్న వరద..

    • కర్నూలు: సుంకేశుల డ్యామ్‌కు కొనసాగుతున్న వరద

    • ఇన్‌ ఫ్లో, ఔట్‌ ఫ్లో 4,504 క్యూసెక్కులు

    • ఒక గేట్‌ ద్వారా నీరు దిగువకు విడుదల

  • May 30, 2025 19:23 IST

    రఘునందన్‌‌పై జగ్గారెడ్డి ఫైర్..

    • రాహుల్‌పై రఘునందన్‌ పరిధి దాటి మాట్లాడారు: జగ్గారెడ్డి

    • రఘునందన్‌కు కాంగ్రెస్‌ చరిత్ర ఏం తెలుసు: జగ్గారెడ్డి

    • 544 సంస్థానాలను దేశంలో విలీనం చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది..

    • బీజేపీ నేతలు చిల్లరగా మాట్లాడితే సహించేది లేదు: జగ్గారెడ్డి

    • నాకు ఏ కమిటీలో అవకాశం ఇచ్చినా హ్యాపీ: జగ్గారెడ్డి

    • గాంధీభవన్‌లో అటెండర్‌ పోస్టు ఇచ్చినా చేస్తా: జగ్గారెడ్డి

  • May 30, 2025 19:23 IST

    భారీ మోసం..

    • హైదరాబాద్‌: స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం

    • రూ.100 కోట్ల వరకు మోసం చేసిన ముఠా

    • జీడిమెట్ల పరిధి చింతల్‌ గణేష్‌ నగర్‌లో ది పెంగ్విన్‌ సెక్యూరిటీస్‌ పేరుతో భారీగా పెట్టుబడులు

    • ఒక్కొక్కరు రూ.లక్ష నుంచి రూ.కోటి వరకు పెట్టుబడులు

    • మదుపరులకు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న నిర్వాహకులు

    • సంస్థ నిర్వాహకులపై పోలీసులకు బాధితులు ఫిర్యాదు

    • ఒకరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు

  • May 30, 2025 17:08 IST

    భారత్‌కు మోదీ నాయకత్వం ప్రధాన బలం: చంద్రబాబు..

    • సరైన సమయంలో దేశానికి ప్రధానిగా మోదీ ఉన్నారు: చంద్రబాబు

    • భారత్‌కు మోదీ నాయకత్వం ప్రధాన బలం: చంద్రబాబు

    • చైనా ఆర్థిక వ్యవస్థ భారత్‌కు నాలుగున్నర రెట్లు, అమెరికా ఆర్థిక వ్యవస్థ భారత్‌ కంటే ఏడు రెట్లు ఎక్కువ

    • సరైన పాలసీలు రూపొందిస్తే మన ప్రగతిని ఎవరూ ఆపలేరు

    • దేశానికి రానున్న పదేళ్లు అత్యంత కీలకం: చంద్రబాబు

    • హైదరాబాద్‌ బ్రౌన్‌ ఫీల్డ్‌ సిటీ.. అమరావతి గ్రీన్‌ ఫీల్డ్‌ సిటీ

    • ఐటీ పరిశ్రమల వల్లే హైదరాబాద్‌కు లబ్ధి జరిగింది: చంద్రబాబు

  • May 30, 2025 17:04 IST

    నాకు ఓట్లు వేయరని చెప్పారు: సీఎం చంద్రబాబు..

    • ప్రముఖులతో సంబంధాల దృష్ట్యా పేదలు ఓట్లు వేయరని చెప్పారు: సీఎం చంద్రబాబు

    • ఆ సమయంలో ప్రధాని కూడా దావోస్‌ వెళ్లలేదు: చంద్రబాబు

    • 1995 నుంచి నేను మాత్రమే దావోస్‌ తరచూ వెళ్తున్నా: చంద్రబాబు

    • సంపద సృష్టి జరగాలి.. అది పారిశ్రామికవేత్తల ద్వారానే సాధ్యం: సీఎం చంద్రబాబు

    • సంపద సృష్టి ద్వారానే ఆదాయం పెరుగుతుంది: చంద్రబాబు

    • ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టవచ్చు: చంద్రబాబు

  • May 30, 2025 17:03 IST

    అప్పుడు నేనే నిర్వహించా: సీఎం చంద్రబాబు..

    • ఉమ్మడి ఏపీలో సీఐఐ సదస్సులు నిర్వహించాను: సీఎం చంద్రబాబు

    • నేను మొదటి నుంచి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ వచ్చా: సీఎం చంద్రబాబు

    • పీవీ ఆర్థిక సంస్కరణలు దేశగతిని మార్చేశాయి: చంద్రబాబు

    • 1990లోనే ఇంటర్‌నెట్‌ విప్లవం వచ్చింది: చంద్రబాబు

    • దావోస్‌లో ఏటా పారిశ్రామికవేత్తల సదస్సు జరుగుతుంది: సీఎం చంద్రబాబు

    • దావోస్‌ వెళ్లవద్దని కొందరు సూచించారు: చంద్రబాబు

  • May 30, 2025 16:59 IST

    మరోసారి అక్కడ పర్యటించిన మంత్రి నిమ్మల..

    • గతంలో బుడమేరు వరదకు గండ్లు పడినచోట నిమ్మల పర్యటన

    • సీసీ వాల్‌ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల

    • పనులు నత్తనడకల సాగుతుండటంతో మంత్రి నిమ్మల ఆగ్రహం

    • మూడు షిఫ్ట్‌ల్లో పనులు వేగవంతం చేయాలని నిమ్మల ఆదేశం

  • May 30, 2025 16:59 IST

    ఆ దెయ్యాలు ఎవరో చెప్పండి: మంత్రి పొంగులేటి..

    • కవిత ఎపిసోడ్‌ టీ కప్‌లో తుపాను: మంత్రి పొంగులేటి

    • బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య స్నేహం ఉందని కవితే స్వయంగా చెప్పారు: మంత్రి పొంగులేటి

    • కేసీఆర్‌ దగ్గర ఉన్న దెయ్యాలేవో కవితనే చెప్పాలి: పొంగులేటి

  • May 30, 2025 16:58 IST

    BRS మునిగిపోయే నావ: టీపీసీసీ చీఫ్‌ మహేష్‌గౌడ్‌

    • నావలో ఉన్న వస్తువుల కోసమే కేసీఆర్‌ కుటుంబంలో కొట్లాట

    • రాజాసింగ్‌ వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డికి సమాధానం చెప్పాలి: మహేష్‌గౌడ్‌

    • కవిత, రాజాసింగ్‌ వ్యాఖ్యలను చూస్తుంటే బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం తథ్యం అనిపిస్తోంది: మహేష్‌గౌడ్‌

    • కేసీఆర్‌ కుటుంబంలో వాటాల కోసం పంచాయతీ: మహేష్‌గౌడ్‌

    • కాళేశ్వరం విషయంలో నోటీసులు రాగానే కేసీఆర్‌, ఈటల పాత బంధం చిగురించింది: మహేష్‌గౌడ్‌

    • గతంలో బుడమేరు వరదకు గండ్లు పడినచోట నిమ్మల పర్యటన

    • సీసీ వాల్‌ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల

    • పనులు నత్తనడకల సాగుతుండటంతో మంత్రి నిమ్మల ఆగ్రహం

    • మూడు షిఫ్ట్‌ల్లో పనులు వేగవంతం చేయాలని నిమ్మల ఆదేశం

    • కవిత ఎపిసోడ్‌ టీ కప్‌లో తుపాను: మంత్రి పొంగులేటి

    • బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య స్నేహం ఉందని కవితే స్వయంగా చెప్పారు: మంత్రి పొంగులేటి

    • కేసీఆర్‌ దగ్గర ఉన్న దెయ్యాలేవో కవితనే చెప్పాలి: పొంగులేటి

  • May 30, 2025 16:07 IST

    తీరం దాటిన తీవ్ర వాయుగుండం..

    • బెంగాల్‌, బంగ్లాదేశ్‌ పరిసరాల్లో తీరం దాటిన తీవ్రవాయుగుండం

    • క్రమంగా బలహీనపడుతున్న తీవ్రవాయుగుండం

    • చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు

    • ఉత్తర, దక్షిణ కోస్తాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం

  • May 30, 2025 16:07 IST

    నష్టాల్లో స్టాక్ మార్కెట్..

    • నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

    • 182 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్‌

    • 83 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ

  • May 30, 2025 15:23 IST

    నీట్ పరీక్ష.. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే..

    • నీట్ పీజీ పరీక్షపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

    • ఒకే షిఫ్ట్‌లో పరీక్ష నిర్వహించాలని ఆదేశాలు

    • జూన్‌ 15న నీట్‌ పీజీ పరీక్ష

  • May 30, 2025 14:58 IST

    సీనియర్‌ జర్నలిస్ట్‌ మునీర్‌ మరణం బాధాకరం: ఎమ్మెల్సీ కవిత

    • తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు: ఎమ్మెల్సీ కవిత

    • ఆపరేషన్‌ కగార్‌ పేరుతో బీజేపీ నక్సలైట్లను చంపేస్తోంది: కవిత

    • ఆపరేషన్‌ కగార్‌ను ఆపాలని కోరినా కేంద్రం స్పందించలేదు

    • చనిపోయిన మావోయిస్టుల శవాలను కూడా ఇవ్వడం లేదు: కవిత

    • నక్సలైట్ల వ్యవహారంలో మానవత్వం ప్రదర్శించడం లేదు: కవిత

    • దళిత ఎమ్మెల్యేను వంశీ పుష్కరాలకు ఆహ్వానించకపోవడం సరికాదు: ఎమ్మెల్సీ కవిత

    • దళితుల పట్ల రేవంత్‌ సర్కార్‌ చిన్నచూపు చూస్తోంది: కవిత

  • May 30, 2025 14:58 IST

    విశాఖ: ముగిసిన ఫిల్మ్‌ఛాంబర్‌ ప్రతినిధుల భేటీ

    • థియేటర్ల నిర్వహణ, పర్సంటేజ్‌లపై చర్చ

    • 27 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు

    • నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో కమిటీ

    • ప్రస్తుత సమస్యలపై సమావేశంలో చర్చించాం

    • థియేటర్‌ నిర్వహణ, పర్సంటేజ్‌లపై చర్చించాం

    • సాధారణ తనిఖీల్లో భాగంగానే థియేటర్లలో సోదాలు

    • ఫిల్మ్‌ ఛాంబర్‌ మాజీ అధ్యక్షుడు సి. కల్యాణ్‌

  • May 30, 2025 14:58 IST

    ఫలితాలు వెల్లడి..

    • తెలంగాణ గ్రామ పాలన అధికారుల(GPO) ఫలితాలు విడుదల

    • ర్యాంకులు విడుదల చేసిన రెవెన్యూ అధికారులు

  • May 30, 2025 14:58 IST

    వారి ఫోకస్ అక్కడే..

    • కవిత మంచిర్యాల పర్యటనపై BRS ఫోకస్‌

    • సొంత మీడియా ప్రతినిధులతో కవిత ప్రోగ్రాం చిత్రీకరణ

    • కవిత వెంట ఉన్నవారు.. కలిసినవారి వివరాలను ఎప్పటికప్పుడూ తెలుసుకుంటున్న BRS ముఖ్యనేతలు

  • May 30, 2025 14:56 IST

    మిస్‌ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీపై చర్యలకు రంగం సిద్ధం..

    • హైదరాబాద్‌: మిస్‌ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ ఆరోపణలు అవాస్తవం: ABNతో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్

    • మిస్‌ ఇంగ్లండ్‌ మిల్లా మ్యాగీపై నిర్వాహకులు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు: ABNతో జయేష్‌ రంజన్‌

    • మ్యాగీపై ఇప్పటికే లండన్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు: జయేష్‌ రంజన్

    • రేపు మిస్‌ వరల్డ్‌ ఫైనల్‌ ఈవెంట్‌కు ఏర్పాట్లు పూర్తి: ABNతో జయేష్‌ రంజన్

  • May 30, 2025 14:56 IST

    ఢిల్లీ: సాయంత్రం సీఐఐ వార్షిక సదస్సు

    • సదస్సుకు హాజరుకానున్న ఏపీ సీఎం చంద్రబాబు

    • చంద్రబాబుతో సీఐఐ ప్రత్యేక సెషన్‌

    • ఆర్థిక వృద్ధి, స్థిరత్వం కొనసాగించడంలో ఏపీ నమూనాపై ప్రసంగించనున్న చంద్రబాబు

  • May 30, 2025 14:20 IST

    హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం

    • సైబరాబాద్‌లో రూ.3కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం

    • సైబరాబాద్ ఎస్‌వోటీ అదుపులో డ్రగ్స్ ముఠా

    • రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్న ముఠా

    • శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గంజాయి పట్టివేత

    • ప్రయాణికుడి నుంచి 10 కిలోల గంజాయి స్వాధీనం

    • బ్యాంకాక్ నుంచి శంషాబాద్ వచ్చిన ప్రయాణికుడు

  • May 30, 2025 14:00 IST

    వైసీపీ నాయకులపై కేసు నమోదు..

    • కడప: పులివెందులలో వైసీపీ నాయకులపై కేసు నమోదు

    • టీడీపీ మహానాడు ఫ్లెక్సీలు చించివేసిన 11 మందిపై కేసు

    • వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ సహా 11 మందిపై కేసులు

  • May 30, 2025 13:59 IST

    కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత ప్రెస్‌మీట్

    • మరోసారి కవిత సంచలన వ్యాఖ్యలు

    • బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలను తానే అడ్డుకున్నానన్న కవిత

    • కేటీఆర్ నాయకత్వంలో పనిచేయనని స్పష్టం చేసిన కవిత

    • మంచిర్యాలలో నిర్వహించే ప్రెస్‌మీట్‌లో మరిన్ని సంచలన విషయాలు బయటపెడతానంటున్న కవిత

    • కవిత ప్రెస్‌మీట్‌పై సర్వత్రా ఆసక్తి

  • May 30, 2025 13:07 IST

    ఎమ్మెల్సీ కవిత చిట్‌చాట్..

    • పార్టీని కాపాడుకోవాలనేదే నా తపన: ఎమ్మెల్సీ కవిత

    • పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డా: కవిత

    • పదేళ్లుగా ఎంతో ఆవేదన అనుభవిస్తున్నా: కవిత

    • బీజేపీలో పార్టీ విలీనాన్ని నేను ఒప్పుకోను: ఎమ్మెల్సీ కవిత

    • బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదు: ఎమ్మెల్సీ కవిత

    • కేసీఆర్‌కు లేఖ రాయడంలో నా తప్పు లేదు: ఎమ్మెల్సీ కవిత

    • పార్టీ కోసమే కేసీఆర్‌కు లేఖ రాశా: కవిత

    • కార్యకర్తల ఆవేదననే లేఖలో ప్రస్తావించా: కవిత

    • లేఖను బయటపెట్టినవారిని పట్టుకోవాలి: కవిత

    • నాకంటూ సొంత జెండా.. అజెండా లేదు: కవిత

    • కేసీఆర్ తప్ప మరో నాయకత్వాన్ని ఒప్పుకోను: ఎమ్మెల్సీ కవిత

  • May 30, 2025 13:06 IST

    కర్నూలు: ఎమ్మిగనూరు మున్సిపల్ కౌన్సిల్‌లో ఉద్రిక్తత

    • కౌన్సిల్ జరుగుతుండగా హాల్‌లోకి వచ్చిన బీసీ సంఘాలు

    • హిందూ శ్మశాన స్థలంలో రోడ్డు నిర్మాణనికి కౌన్సిల్ తీర్మానం

    • తీర్మానాన్ని రద్దు చేయాలని వినతిపత్రం ఇచ్చిన బీసీ సంఘాలు

    • బీసీ సంఘాల నేతలను బలవంతంగా బయటకు పంపిన పోలీసులు

  • May 30, 2025 13:06 IST

    టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

    • కడపలో మహానాడు అద్భుతంగా జరిగింది: సీఎం చంద్రబాబు

    • జిల్లా నాయకత్వమంతా కలిసి పనిచేసి మహానాడును విజయవంతం చేసింది: సీఎం చంద్రబాబు

    • మంత్రులంతా కార్యకర్తల్లా పనిచేసి స్ఫూర్తినిచ్చారు: చంద్రబాబు

    • 'నా తెలుగు కుటుంబం'లోని ఆరు శాసనాల కాన్సెప్ట్‌ను..

    • ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి: సీఎం చంద్రబాబు

    • ఏడాది పాలనపై ప్రజల్లో సానుకూలత ఉంది: చంద్రబాబు

    • జూన్‌లోనే తల్లికి వందనం, అన్నదాత పథకాలను ప్రారంభిస్తాం: చంద్రబాబు

    • ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం: చంద్రబాబు

    • ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందేలా త్వరోలనే క్యాలెండర్: చంద్రబాబు