Harish Rao: కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరైన మాజీ మంత్రి హరీష్‌రావు
ABN, Publish Date - Jun 09 , 2025 | 02:17 PM
కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు సోమవారం విచారణకు హాజరయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు విచారణ జరిగింది. వాస్తవాలు చెబుతానని దైవసాక్షిగా మాజీ మంత్రి ప్రమాణం చేశారు. హరీష్ రావును ఓపెన్ కోర్టులో పీసీ గోష్ కమిషన్ విచారించింది. ప్రాజెక్టు రీ డిజైన్, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, కేబినెట్ అనుమతులపై హరీష్‌రావును కాళేశ్వరం కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది.

కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఇవాళ (సోమవారం) విచారణకు హాజరయ్యారు.

దాదాపు 40 నిమిషాల పాటు విచారణ జరిగింది. వాస్తవాలు చెబుతానని దైవసాక్షిగా మాజీ మంత్రి ప్రమాణం చేశారు.

హరీష్‌రావును ఓపెన్ కోర్టులో పీసీ గోష్ కమిషన్ విచారించింది. ప్రాజెక్టు రీ డిజైన్, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, కేబినెట్ అనుమతులపై హరీష్‌రావును కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది.

కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైన్, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, కేబినెట్ అనుమతులపై హరీష్‌రావును కమిషన్ నిలదీసింది.

తుమ్మిడి హట్టి వద్ద చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్ట్‌కు డిజైన్ చేసి ఎందుకు మార్చాల్సి వచ్చిందని హరీష్‌రావును కమిషన్ వివరణ అడిగింది.

కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలకు హరీష్‌రావు సుదీర్ఘమైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్ట్‌ను నిర్మించాలని ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అందుకు సంబంధించిన డిజైన్‌ను తయారు చేసి పనులను కూడా ప్రారంభించిందని హరీష్‌రావు గుర్తుచేశారు.

అయితే ఆ పనులను ప్రారంభించిన సమయంలో గతంలో మహారాష్ట్రలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పిందని మాజీ మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఆ సమయంలో మహారాష్ట్ర, తెలంగాణ, కేంద్రంలో కూడా కాంగ్రెస్ సర్కారే ఉందని గుర్తుచేశారు. కానీ అంతర్రాష్ట్ర ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు హరీష్‌రావు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి నీళ్లు రావడం కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి మహారాష్ట్ర అభ్యంతరాలు చెప్పడంతో ముందుకు వెళ్లే సాధ్యం కాని పరిస్థితుల్లో పెండింగ్‌లో ఉన్న ప్రాణహిత ప్రాజెక్ట్‌పై నిర్ణయం కోసం తమ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసినట్లు కాళేశ్వరం కమిషన్‌కు హరీష్‌రావు వివరించారు.
Updated at - Jun 09 , 2025 | 02:33 PM