Sri Ram Navami: వాడవాడలా ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
ABN, Publish Date - Apr 06 , 2025 | 09:16 AM
శ్రీరామనవమి వేడుకలు ఆదివారం వాడవాడలా ఘనంగా ప్రారంభమయ్యాయి. నవమి నుంచి పౌర్ణమి వరకు వివిధ గ్రామాల్లో ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో శ్రీసీతారాముల కల్యాణం, రామ పట్టాభి షేకం తదితర కార్యక్రమాలను కమనీయంగా నిర్వహించారు.

శ్రీరామనవమి వేడుకలు ఆదివారం వాడవాడలా ఘనంగా ప్రారంభమయ్యాయి.

నల్గొండ రామగిరి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో స్వామివారి ఎదుర్కొళ్లు ఘనంగా నిర్వహించారు.

విద్యుత్ దీపాలతో స్వాగత ఏర్పాట్లు చేసిన ఆలయ నిర్వాహకులు

విద్యుత్ వెలుగుల్లో ఆలయం

పలు గ్రామాల్లోని రామాలయాల్లో సీతా రాముల కల్యాణమహోత్సవాలను రమణీయంగా నిర్వహించారు.

నల్గొండ రామగిరి సీతారామచంద్ర స్వామి ఆలయంలో కల్యాణం కోసం తీర్చిదిద్దిన ప్రత్యేక వేదిక

సీతారాముల కల్యాణం కోసం చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.

భూపాలపల్లి జిల్లాలో సింగరేణి జీఎం రాజేశ్వర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.

వనపర్తి జిల్లా కేంద్రంలో శ్రీరామనవమి సందర్భంగా కల్యాణం కోసం ప్రత్యేకంగా మండపాలను సిద్ధం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేపట్టారు.

భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను తిలకించారు.

ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు

స్వామివారి కల్యాణంలో భాగంగా ప్రత్యేక పూజలు చేస్తున్న బ్రాహ్మణులు

పూజలు చేస్తున్న బ్రాహ్మణులు
Updated at - Apr 06 , 2025 | 09:30 AM