Home » Bhadradri Ramaiah
భద్రాద్రి రాములోరి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. రామ నామ జపంతో భక్తులు పరవశించిపోతుండగా.. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం భద్రాద్రి జిల్లాల్లో పర్యటించనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో సీతారామ కల్యాణం కోసం స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం భద్రాద్రి జిల్లాల్లో పర్యటించనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో సీతారామ కల్యాణం కోసం స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.
శ్రీరామనవమి వేడుకలకు భద్రాచలం ముస్తాబైంది. నవమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సీతారాముల వారి కల్యాణంలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.
భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట జాతీయ రహదారి శ్రీరామనామ స్మరణతో మార్మోగుతోంది. రాజమండ్రి జగ్గారెడ్డి గూడెం ప్రాంతాల నుంచి వేలాదిమంది రామ భక్తులు సీతారాముల కల్యాణానికి గోటి తలంబ్రాలతో పాదయాత్రగా గురువారం నాడు భద్రాచలం బయలు దేరారు.
Bhadradri Ramayya: టీజీఎస్ఆర్టీసీ భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. భద్రాచల రామయ్య పెళ్లి తలంబ్రాలు ఇక నుంచి నేరుగా భక్తులకు డోర్ డెలివరీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అందుకోసం మీరు ఏం చేయాలంటే..
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం సీతారామచంద్ర స్వామి కల్యాణ తలంబ్రాలు కావాలనుకునే భక్తులకు నేరుగా వారి ఇంటి వద్దకే చేర్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం ఏర్పాట్లు చేసిందని ఎండీ సజ్జనార్ తెలిపారు.
Navami controversy: శ్రీరామనవమి మహోత్సవాల అంకురార్పణ కార్యక్రమం ఆరు గంటలు ఆలస్యంగా జరిగింది. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భద్రాచలం చరిత్రలో ఎన్నడూ జరగని అపచారం అంటూ మండిపడ్డారు.
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారిని శుక్రవారం దర్శించుకున్నారు.
భద్రాచలంలో శ్రీరామ టెంపుల్ ఆఫ్ యూఎస్ఏ ఖగోళయాత్ర బృందం ఆధ్వర్యంలో భద్రాద్రి సీతారాముల శాంతికల్యాణం నిర్వహించడంపై భద్రాచలం దేవస్థానం అధికారులు, వైదిక సిబ్బంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.