NRI: నాట్స్ సభలకు టాంపా చేరుకున్న నందమూరి బాలకృష్ణ
ABN , Publish Date - Jul 05 , 2025 | 06:22 AM
ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) 8వ ద్వైవార్షిక మహాసభలను పురస్కరించుకుని నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ టాంపా చేరుకున్నారు.

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) 8వ ద్వైవార్షిక మహాసభలను పురస్కరించుకుని నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ టాంపా చేరుకున్నారు. శుక్రవారం బ్యాంక్వెట్, శనివారం ప్రారభోత్సవం, ఆదివారం ముగింపు వేడుకలు నిర్వహించనున్నట్లు సభల సమన్వయకర్త గుత్తికొండ శ్రీనివాస్, నాట్స్ చైర్మన్ పిన్నమనేని ప్రశాంత్, అధ్యక్షుడు మందాడి శ్రీహరి, మాజీ అధ్యక్షుడు మదన్ పాములపాటి తెలిపారు. ఈ కార్యక్రమాల్లో బాలయ్య సందడి చేయనున్నారని చెప్పారు. నేడు మైయామీ చేరుకున్న బాలకృష్ణను.. గుత్తికొండ శ్రీనివాస్ ప్రత్యేక విమానంలో టాంపా తీసుకెళ్లారు. బాలకృష్ణకు నాట్స్ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహనకృష్ణ ఘన స్వాగతం పలికారు.