Zelensky: వైట్‌హౌస్ రచ్చ.. జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Mar 03 , 2025 | 09:12 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చల అనంతరం ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖనిజాల ఒప్పందంలో గత వారం ఏకాభిప్రాయం కుదరలేదని, నిర్మాణాత్మక చర్చ కోసం ట్రంప్ ఆహ్వానిస్తే మరోసారి భేటీకి వెళ్తానని, అమెరికాతో సత్సంబంధాలను కాపాడుకోగలనని ఆయన వ్యాఖ్యలు చేశారు.

ABN Ingternet: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Ukrainian President Zelensky) సంచలన వ్యాఖ్యలు (Sensational Comments) చేశారు. అమెరికా (America)తో సత్సంబంధాలను కాపాడుకోగలనని, ఖనిజాల ఒప్పందంలో గత వారం ఏకాభిప్రాయం కుదరలేదని, నిర్మాణాత్మక చర్చ కోసం ట్రంప్ (Trump) ఆహ్వానిస్తే మరోసారి భేటీ (Meet Again)కి వెళ్తానని, సమస్యలు పరిష్కరించుకోవడానికి తాను సిద్ధమని స్పష్టం చేశారు. మరోవైపు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ (British Prime Minister Keir Starmer) మాట్లాడుతూ.. ఐరోపా భద్రత కోసం నడుం బిగిద్దామని, ఉక్రెయిన్‌కు మంచి జరిగే ఒప్పందంతోనే ప్రతి దేశ భద్రత ఆధారపడి ఉందని అన్నారు. గాజాలోకి వెళ్లే మానవతా సాయం, ఇతర సరఫరాలను మరోసారి నిలిపివేసిన ఇజ్రాయెల్, కొత్త ప్రతిపాదనను హమాస్ అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలు తప్వని హెచ్చరించారు. ఇజ్రాయోల్ తీరును ఈజిప్టు తీవ్రంగా ఖండించింది. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీల మధ్య జరిగిన వాగ్వాదం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Read More: సునీల్ కుమార్ నాయక్ విచారణ
ఉమ్మడిగా ఎదుర్కొందాం
కాగా ఉక్రెయిన్ విషయంలో అమెరికాను నమ్మరాని మిత్రుడిగా తాను భావించట్లేదని.. ఆ దేశం తమకు ఎప్పటికీ ముఖ్యమైన మిత్రుడేనని యూకే ప్రధాని కీర్ స్టార్మర్ స్పష్టం చేశారు. కానీ, శాంతి చర్చల సమయంలో ఉక్రెయిన్‌ను బలమైన స్థానంలో ఉంచాలంటే యూరప్ నుంచి ఆ దేశానికి ఆర్థిక సాయం అందాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే.. ఉక్రెయిన్‌కు తాము చేసే ఆర్థిక సాయంలో 2 బిలియన్ డాలర్లతో (దాదాపు రూ.17,500 కోట్లు) 5000 ఎయిర్ డిఫెన్స్ మిసైళ్ల కొనుగోళ్లకు వీలు కల్పిస్తున్నట్టు వెల్లడించారు. ఉక్రెయిన్ విషయంలో యూరప్ ఇతోధికంగా కష్టపడాలని.. ఖండంలో శాంతి సాధనకు కృషి చేయాలని, ఈ శ్రమ ఫలించాలంటే అమెరికా అండ అవసరమని పేర్కొన్నారు. ఇటీవల శ్వేతసౌధంలో ట్రంప్–జెలెన్ స్కీ మధ్య జరిగిన వాగ్వాదం గురించి ప్రస్తావించిన ఆయన.. చర్చలు ఆ విధంగా చెడిపోవాలని ఎవ్వరూ కోరుకోరని వ్యాఖ్యానించారు. ఆ ఘటన నేపథ్యంలో.. ఆదివారం ఇక్కడ లండన్‌లోని 200 ఏళ్ల పురాతన లాంకస్టర్ హౌస్‌లో యూరప్ దేశాల అధినేతలు స్టార్మర్ నేతృత్వంలో సమావేశమై చర్చించారు. వారితోపాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, కెనడా ప్రధాని ట్రూడో, టర్కీ విదేశాంగ మంత్రి, నాటో చీఫ్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఉక్రెయిన్‌కు అమెరికా అండ లేదన్న కఠోర వాస్తవాన్ని అంగీకరించాల్సిందేనని.. ఎప్పుడో తరానికి ఒకసారి వచ్చే ఇలాంటి సందర్భాలను ప్రపంచ దేశాల నాయకులంతా కలిసి ఎదుర్కోవాలని ఈ భేటీ సందర్భంగా వ్యాఖ్యానించిన స్టార్మర్.. అనంతరం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాత్రం అమెరికాను తమకు అత్యంత ముఖ్యుడైన మిత్రుడుగా పేర్కొనడం గమనార్హం. ‘‘అమెరికా యూకేకు ఎన్నో ఎన్నో దశాబ్దాలుగా మిత్రదేశం. ఇకపైనా అలాగే కొనసాగుతుంది. మా రెండు దేశాలు ఉన్నంత సన్నిహితంగా మరే ఇతర దేశాలూ లేవు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు.. తాను ఉక్రెయిన్‌లో శాంతి దిశగా రచిస్తున్న ప్రణాళికల్లో అమెరికా అండ కూడా ముఖ్యమేనని ప్రకటించారు. అలాగే.. యుద్ధం ముగించడానికి చేసుకునే ఒప్పందంలో రష్యా కూడా భాగం కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. అంతకుముందు.. ‘సెక్యూరింగ్ అవర్ ఫ్యూచర్’ పేరిట నిర్వహించిన సమావేశంలో స్టార్మర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఉక్రెయిన్ విషయంలో సానుకూల ఫలితాన్ని రాబట్టడం ఇక్కడున్న ప్రతిదేశానికి, ఇతరులకు సైతం ముఖ్యమైన విషయమే’’ అని ఆయన స్పష్టం చేశారు. ‘‘యూరోపియన్ భద్రతను రక్షించుకునేందుకు, మనందరి సమష్టి భవిష్యత్తునూ కాపాడుకునేందుకు.. అందరం కలిసి దీన్ని ఎదుర్కోవాలి’’ అని పిలుపునిచ్చారు.
అమెరికాతో సంబంధం లేకుండా..
తాజా పరిస్థితుల నేపథ్యంలో యూరప్ దేశాలు ఆయుధపరంగా మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లెయెన్ ఈ భేటీలో అభిప్రాయపడ్డారు. 2022 నుంచి రష్యా ఆక్రమించుకున్న ఏ భూభాగాన్నీ రష్యాలో భాగంగా యూరోపియన్ యూనియన్ అంగీకరించకూడదని పేర్కొన్నారు. అమెరికాపై ఎంతమాత్రం ఆధారపడకుండా యూరోపియన్ యూనియన్ పూర్తిస్థాయిలో ఒక ఆర్మీని ఏర్పరచుకోవాలనే ప్రతిపాదనను ఉర్సులా చాలాకాలంగా చేస్తున్నారు. ఇక.. ఈ సమావేశం అనంతరం జెలెన్‌స్కీ కింగ్ చార్లెస్‌తో భేటీ అయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉభయ సభల్లో 2025 -26 ఏపీ బడ్జెట్‌పై చర్చ..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News