Zeeshan Siddique: బాబా సిద్ధిఖీ తర్వాత జీషన్ టార్గెట్..నీ తండ్రిలాగే నిన్ను చంపేస్తామని బెదిరింపు
ABN , Publish Date - Apr 22 , 2025 | 08:29 AM
గత సంవత్సరం, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని బహిరంగంగా కాల్చి చంపారు. ఇప్పుడు ఆయన కుమారుడు జీషన్ సిద్ధిఖీకి కూడా అలాంటి బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. అందులో తన తండ్రిలాగే అతన్ని కూడా చంపేస్తామని చెప్పారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

NCP నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి, దివంగత బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్దిఖీని(Zeeshan Siddique) కూడా హత్య చేస్తామని బెదిరింపులు వచ్చాయి. రూ. 10 కోట్లు డిమాండ్ చేస్తూ జీషన్‌కు ఇమెయిల్ ద్వారా బెదిరింపు వచ్చింది. నువ్వు డబ్బు చెల్లించకపోతే, నీ తండ్రి లాగే నిన్ను కూడా చంపేస్తామని మెయిల్‌లో రాసి ఉంది. బెదిరింపు చేస్తున్న వ్యక్తి తనను తాను 'డి-కంపెనీ' సభ్యుడిగా చెప్పుకున్నాడు. అంతేకాదు ఈ విషయం పోలీసులకు తెలుపవద్దని జీషన్‌ను హెచ్చరించారు కూడా.
ఇంటికి చేరుకున్న బాంద్రా పోలీసులు
హత్య బెదిరింపులు వచ్చిన తర్వాత, జీషన్ సిద్ధిఖీ.. పోలీసులకు సమాచారం అందించాడు. ఆ తరువాత, బాంద్రా పోలీసులు అతని ఇంటికి చేరుకుని ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో జీషాన్‌కు ఎవరు ఇమెయిల్ చేశారు, ఎవరు బెదిరించారనే వివరాలను ఆరా తీస్తున్నారు.
తండ్రి బాబా సిద్ధిఖీ గత సంవత్సరం హత్యకు గురయ్యారు.
బాబా సిద్ధిఖీ 2024 అక్టోబర్ 12న కాల్పుల ద్వారా హత్యకు గురయ్యారు. 66 సంవత్సరాల వయస్సులో, అతని కొడుకు కార్యాలయం వెలుపల ముగ్గురు దుండగుల చేతుల్లో ఆయన హత్యకు గురయ్యారు. తరువాత ఈ కేసు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో ముడిపడి ఉందని వెలుగులోకి వచ్చింది.
గతంలో కూడా బెదిరింపులు
గత ఆరు నెలల్లో జీషాన్‌కు అనేకసార్లు హత్యా బెదిరింపులు వచ్చాయి. అక్టోబర్ 2024లో, నోయిడాకు చెందిన 20 ఏళ్ల టాటూ ఆర్టిస్ట్ మహ్మద్ తయ్యబ్, వాట్సాప్ ద్వారా జీషన్‌ను బెదిరించినందుకు అరెస్ట్ అయ్యాడు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ డ్రోన్లతో దాడి చేయాలని ప్లాన్ చేస్తోందని అతను పేర్కొన్నాడు. గత సంవత్సరం, ఆజం మొహమ్మద్ ముస్తఫా అనే 56 ఏళ్ల వ్యక్తి కూడా ముంబై ట్రాఫిక్ పోలీసు హెల్ప్‌లైన్‌కు వాట్సాప్ సందేశం పంపించి ద్వారా జీషన్‌ను బెదిరించాడు.
ఇందులో అతను జీషన్, సల్మాన్ ఖాన్ నుంచి రూ.2 కోట్లు డిమాండ్ చేశాడు. ముస్తఫా సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చిన నిరుద్యోగి. ఆ మరుసటి రోజే అతన్ని అరెస్టు చేశారు. జీషన్ సిద్ధిఖీ తండ్రి హత్య తర్వాత, అనేక బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో అతని భద్రతను కట్టుదిట్టం చేశారు. అతనికి 'Y' కేటగిరీ భద్రతను కల్పించారు పోలీసులు.
ఇవి కూడా చదవండి:
Google CCI: గూగుల్ కీలక నిర్ణయం..ఆ కేసు పరిష్కారం కోసం రూ.20.24 కోట్లు చెల్లింపు
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
Viral News: 70 ఇన్ స్పేస్..అంతరిక్షంలో రోదసీ యాత్రికుడి బర్త్ డే సెలబ్రేషన్
Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Read More Business News and Latest Telugu News