Radhika Yadav Murder: చాలా పెద్ద తప్పుచేసా, నన్ను ఉరితీయండి.. కుమార్తె హత్యపై తండ్రి పశ్చాత్తాపం
ABN , Publish Date - Jul 12 , 2025 | 09:15 PM
హరియాణా టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్‌పై దీపక్ యాదవ్ గత గురువారంనాడు కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీపక్ యాదవ్ స్వయంగా తన నేరం ఒప్పుకోవడంతో కోర్టు ఒకరోజు పోలీసు కస్టడీ, అనంతరం జ్యూడిషియల్ కస్టడీకి ఆదేశించింది.

గురుగ్రామ్: 'ఆవేశంలో కన్న కూతుర్ని చంపుకున్నా. ఇందుకు ఉరి తీయాలనే నిబంధన ఏదైనా వెంటనే వెంటనే నన్ను ఉరితీయండి' అని టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ (Radhika Yadav) తండ్రి దీపక్ యాదవ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసు స్టేషన్‌కు వెళ్లినప్పుడు పోలీసుల ముందే 'నన్ను ఉరితీయండి' అంటూ కుమిలిపోయినట్టు ఆయన సోదరుడు విజయ్ యాదవ్ తెలిపారు.
హరియాణా టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్‌పై దీపక్ యాదవ్ గత గురువారంనాడు కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీపక్ స్వయంగా తన నేరం ఒప్పుకోవడంతో కోర్టు ఒకరోజు పోలీసు కస్టడీ, అనంతరం జ్యూడిషియల్ కస్టడీకి ఆదేశించింది. టెన్నిస్ అకాడమీని రాధిక నడుపుతుండటం ఆయనకు ఇష్టం లేకపోవడం, కుమార్తె సంపాదనపై ఆధార పడుతున్నావంటూ పలువురు హేళన చేయడంతో దీపక్ క్షణికావేశంలో ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు.
ఉరితీయండి..
'రాధిక తండ్రి ఉదయమే 5 గంటలకు ట్రైనింగ్ సెంటర్‌కు అమ్మాయిని తీసుకు వెళ్లేవాడు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత సాయంత్రం ఇంటికి తీసుకువచ్చేవాడు. అంతవరకూ పాపను కనిపెట్టుకునే ఉండేవాడు. ఎక్కడికీ వెళ్లేవాడు కూడా కాదు. పోలీసు స్టేషన్‌లో తన చర్యకు ఒక్క కారణం కూడా చెప్పలేదు. ఉరిశిక్ష అంటూ ఉంటే ఆ శిక్ష నాకు వేయండని పోలీసుల ముందు వాపోయాడు' అని విజయ్ యాదవ్ మీడియాకు తెలిపారు.
అకాడమీ లేదు, టెన్నిస్ కోచ్ మాత్రమే..
తనకు తెలిసినంతవరకూ రాధిక కేవలం టెన్నిస్ కోచింగ్ ఇచ్చేదని, సొంతగా ఎలాంటి అకాడమీ లేదని విజయ్ యాదవ్ తెలిపారు. మొదట్నించీ వీళ్లు బాగా డబ్బున్న వాళ్లు. ఆమె తండ్రి చాలా కష్టజీవి. వాళ్ల గ్రామంలో అందరికీ పూరిళ్లు ఉంటే వాళ్లకు మాత్రం పక్కా ఇల్లు ఉండేది. తాను దోషినని ఒక వ్యక్తి గ్రహించడం కన్నా మించిన పెద్ద శిక్ష ఇంకొకటి ఉండదు.. అని దీపక్ పశ్చాత్తాపపడుతున్న విషయాన్ని మీడియాకు ఆయన వివరించారు. రాధిక అంత్యక్రియలు గురుగ్రావ్‌లో శుక్రవారం సాయంత్రం ముగిసాయి.
ఇవి కూడా చదవండి..
ఇంట్లో ఆంక్షలు, స్వేచ్ఛ కావాలనుకున్న రాధిక.. హత్య కేసులో కీలక సమాచారం
కుర్చీ దొరికితే వదలొద్దు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి