Share News

Vyjayanthimala: వైజయంతిమాల క్షేమం.. వదంతులపై ఆమె కుమారుడు

ABN , Publish Date - Mar 07 , 2025 | 08:14 PM

ఇండియన్ సినిమా తొలి లేడీ సూపర్‌స్టార్‌గా వైజయంతీమాలకు ప్రత్యేక స్థానం ఉంది. 16 ఏళ్ల వయస్సులో 'వాళికై' అనే తమిళ సినిమాతో నటిగా ఆమె రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత సంవత్సరం 'జీవితం' అనే తెలుగు చిత్రంలో నటించారు.

Vyjayanthimala: వైజయంతిమాల క్షేమం.. వదంతులపై ఆమె కుమారుడు

చెన్నై: సీనియర్ నటి, ప్రముఖ నృత్య కళాకారిణి వైజంయతి మాల (Vyajayanthimala) ఇక లేరంటూ వస్తున్న వార్తలను ఆమె కుమారుడు సుచీంద్ర బాలి తోసిపుచ్చారు. వైజయంతిమాల పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని సామాజిక మాధ్యమాల్లో ఆయన పోస్ట్ చేశారు. వదంతులను నమ్మరాదని కోరారు.

Devendra Fadnavis: నేను ఆ మాజీ సీఎం మాదిరి కాదు.. ఫడ్నవిస్ చురకలు


vyjayanthimala.jpg

తొంభై ఒక్క ఏళ్ల వైజయంతిమాల కన్నుమూశారంటూ శుక్రవారం అనధికార వార్తలు వెలువడ్డాయి. దీంతో సుచీంద్ర బాల వెంటనే ఫేస్‌బుక్, వాట్సాప్ మాధ్యమాల్లో వివరణ ఇచ్చారు. తన తల్లి పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, తక్కిన వార్తలన్నీ నిరాధారమని అన్నారు. నిజానిజాలు నిర్ధారించుకున్న తర్వాతే ఎవరైనా సమాచారాన్ని షేర్ చేయాలని సూచించారు.


జనవరిలో చెన్నైలో ప్రదర్శన ఇచ్చిన నటి

వైజంయతీమాల ఈ ఏడాది జనవరిలో చెన్నైలో భరతనాట్య కళాప్రదర్శన ఇచ్చారు. ప్రముఖ మ్యుజిషియన్ గిరిజాశంకర్ ఈ ప్రదర్శనకు వోకల్ (vocal) సహకారం అందించారు. పద్మవిభూషణ్ డాక్టర్ వైజయంతి బాలి అమ్మతో వేదిక పంచుకోవడంతో ఒక గౌరవంగా భావిస్తున్నానని, ఆమె ప్రతిభ అనితరసాధ్యమని, భవిష్యత్ తరాల వారికి స్ఫూర్తిదాయకమని గిరిజాశంకర్ అన్నారు. ఈ ప్రదర్శన తమకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పారు.


vyjayanthimala2.jpg

తొలి లేడీ సూపర్‌స్టార్

ఇండియన్ సినిమా తొలి లేడీ సూపర్‌స్టార్‌గా వైజయంతీమాలకు ప్రత్యేక స్థానం ఉంది. 16 ఏళ్ల వయస్సులో 'వాళికై' అనే తమిళ సినిమాతో నటిగా ఆమె రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత సంవత్సరం 'జీవితం' అనే తెలుగు చిత్రంలో నటించారు. 1954లో వచ్చి రొమాంటిక్ ఫిల్మ్ 'నాగిన్' ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. 1955లో విడుదలైన "దేవదాసు'' చిత్రంలో చంద్రముఖిగా ఆమ నటించారు. 'సంగమ్', 'జ్యూవెల్ థీఫ్', 'ఆమ్రపాలి', 'గన్వార్' వంటి పలు చిత్రాలు సూపర్‌హిట్ అయ్యాయి. 2024లో భారతప్రభుత్వం 'పద్మవిభూషణ్'తో ఆమెను గౌరవించింది. 1984లో తమిళనాడు సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేశారు.


ఇవి కూడా చదవండి

Aircraft Crash: కుప్పకూలిన ఐఏఎఫ్ జాగ్వార్ విమానం

Bihar Assembly Polls 2025: నిన్న, నేడు, రేపు కూడా ఆయనే సీఎం

Ranya Rao questioned by Police: నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసు.. విచారణలో బయటపడ్డ కీలక విషయాలు

భారత్‌కు అప్పగించొద్దు.. చిత్రవధ చేస్తారు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 07 , 2025 | 08:15 PM