Viral News: వైరల్ వీడియో: లగేజీ విషయంలో స్పైస్ జెట్ సిబ్బందిపై ఆర్మీ అధికారి తీవ్ర దాడి
ABN , Publish Date - Aug 03 , 2025 | 03:21 PM
శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ లో ఒక సీనియర్ ఆర్మీ అధికారి రెచ్చిపోయాడు. స్పైస్ జెట్ విమాన సిబ్బందిని చితక్కొట్టాడు. దీంతో నలుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. కొందరు వెన్నులు విరిగిపోయి, మరికొందరు గాయాలతో ఆస్పత్రిలో చేరారు.

న్యూఢిల్లీ, ఆగష్టు, 3 : శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ లో ఒక సీనియర్ ఆర్మీ అధికారి వీరంగం సృష్టించాడు. స్పైస్ జెట్ విమాన సిబ్బందిపై తీవ్రంగా దాడి చేశాడు. సదరు ఆర్మీ అధికారి ఢిల్లీకి వెళ్తూ.. విమానంలో అదనపు క్యాబిన్ లగేజీ తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. అయితే, విమాన సిబ్బంది అందుకు గాను అదనపు చార్జీ చెల్లించాలని కోరారు. వినని ఆర్మీ అధికారి బలవంతంగా లగేజ్ విమానంలోనికి తీసుకు వెళ్లడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతన్ని నిలువరింప చూసిన నలుగురు స్పైస్ జెట్ సిబ్బంది మీద ఆర్మీ అధికారి తీవ్రంగా దాడిచేశాడు. అతను కొట్టిన దెబ్బలకి కొందరు విమాన సిబ్బందికి వెన్నుముక విరిగిపోగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురించి ఎయిర్ లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇంకా పేరు బహిర్గతం చేయని సదరు ఆర్మీ అధికారికి ఉచిత క్యాబిన్ లగేజ్ 7 కిలోల వరకూ తీసుకెళ్లే వీలుంది. అయితే, అతను 14 కేజీల బరువున్న (రెండు) బ్యాగులు తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. ఇది కుదరదన్నందుకు , ఎయిర్ లైన్స్ సిబ్బందిని పదే పదే చేతులతో కొట్టి, కాళ్లతో తన్నాడు. ఇంకా కోపం తగ్గక అక్కడున్న క్యూ స్టాండ్ తో ఒకరిపై దాడి చేశాడు. ఈ దాడిలో ఒక ఉద్యోగి స్పృహ కోల్పోయి కిందపడిపోయినా కాని అతడ్ని తన్నుతూనే ఉన్నాడని సదరు ఎయిర్ లైన్స్ సంస్థ వెల్లడించింది.
దీంతో విమానాశ్రయ భద్రతను నిర్వహించే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సిబ్బంది వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘటనపై ఆర్మీ స్పందించింది. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని పోలీస్ దర్యాప్తుకు తమ సహకారం అందిస్తామని వెల్లడించింది. బడ్జెట్ క్యారియర్ స్పైస్ జెట్ విమానం జూలై 26న ఢిల్లీకి వెళ్తున్న సమయంలో ఈ గొడవ జరిగింది. ఈ దాడిని స్పైస్ జెట్ తీవ్రంగా ఖండించింది. తగిన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్‌తో సీఐఎస్ఎఫ్ కి ఫిర్యాదు చేసింది.
ఇవి కూడా చదవండి
కొడాలి నానికి బిగ్ షాక్!
మాజీ మంత్రి కాకాణినీకి రెండు రోజుల పోలీసుల కస్టడీ..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి