Share News

Vijay: హీరో విజయ్ అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

ABN , Publish Date - May 28 , 2025 | 10:44 AM

అధికార డీఎంకే పార్టీపై ప్రముఖ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌ ధ్వజమెత్తారు. ఇది దురహంకార ఫాసిస్ట్‌ పాలన.. అంటూ ఆమన మండిపడ్డారు. డీఎంకే ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆయన వ్యాఖ్యానించారు.

Vijay: హీరో విజయ్ అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

- దురహంకార ఫాసిస్ట్‌ పాలన

- అగ్నిబాధితుల్ని ఆదుకునేవారిపై పోలీసులు దాడి చేస్తారా?

- ఇదేం వైఖరి?.. సీఎం దీనిని సమర్థిస్తారా?

- డీఎంకే ప్రభుత్వంపై విజయ్‌ ధ్వజం

చెన్నై: రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన లేదని, దురహంకారంతో కూడిన ఫాసిస్ట్‌ పాలన సాగుతోందని రాష్ట్ర ప్రభుత్వంపై తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌(Vijay) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన మంగళవారం ప్రకటన విడుదల చేశారు. పోలీసు శాఖ అధికార పార్టీకి కీలుబొమ్మగా మారి, అమాయక ప్రజలపె బలప్రయోగం చేస్తూ, ప్రజల్లో ద్వేషాన్ని రెచ్చగొడుతోందని విజయ్‌ దుయ్యబట్టారు.


స్థానిక వ్యాసర్పాడి ముల్లైనగర్‌ ప్రాంతంలో సోమవారం సంభవించిన అగ్నిప్రమాదంలో గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయన్నారు. సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులైన బాధిత కుటుంబాలను సమీపంలోని పాఠశాలలో ఉంచారని, వారికి టీవీకే కార్యకర్తలు మానవతా దృక్పథంతో బట్టలు, దుప్పట్లు, చాపలు, అత్యవసర సామగ్రి అందించారన్నారు. కానీ, పోలీసులు జోక్యం చేసుకుని, టీవీకే కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారన్నారు.


nani1..2.jpg

ఇదేమని ప్రశ్నించిన పార్టీ జిల్లా కమిటీ కార్యదర్శి గంగావతిపై పోలీసులు దాడిచేయడమేంటని ప్రశ్నించారు. బాధితులను ఆదుకొనేందుకు ముందుకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకోవడమేంటి? పోలీసుల చర్యలను సీఎం సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు పునరావృత్తమైతే టీవీకే తరఫున ప్రజలను సమీకరించి పోరాటాలు చేస్తామని విజయ్‌ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి.

Gold Rates Today: గుడ్ న్యూస్..వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధరలు..

Miss World 2025: మిస్‌ వరల్డ్‌ ఫైనల్స్‌... 3 గంటలు.. 3500 మంది ప్రేక్షకులు

Read Latest Telangana News and National News

Updated Date - May 28 , 2025 | 10:44 AM