CM Siddaramaiah: మరో వివాదంలో సీఎం సిద్దరామయ్య.. వీడియో వైరల్
ABN , Publish Date - Apr 28 , 2025 | 06:02 PM
CM Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్దరామయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. బహిరంగ సభలో పోలీస్ ఉన్నతాధికారి చెంపపై కొట్టేందుకు యత్నించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బెంగళూరు, ఏప్రిల్ 28: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరుసగా వివాదాల్లో చిక్కుకొంటున్నారు. ఇప్పటికే పహల్గాం దాడులపై ఆయన స్పందించిన తీరు కారణంగా.. కాంగ్రెస్ పార్టీ విమర్శలకు గురవుతోంది. తాజాగా సీఎం సిద్దరామయ్య మరో వివాదంలో చిక్కుకొన్నారు. ర్యాలీలో వేదికపై ఓ పోలీస్ ఉన్నతాధికారిని ఆయన చెంప దెబ్బ కొట్టేందుకు యత్నించారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ప్రతిపక్షాలు తమ విమర్శలకు పదును పెట్టాయి.
ఇంతకీ ఏం జరిగిందంటే.. బెళగావిలో సోమవారం అధికార కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. భారీగా జనం హాజరైన ఈ సభలో పలువుర వ్యక్తులు.. తన నిరసన తెలిపారు. అలాగే నల్ల జెండాలు సైతం ఎగరవేశారు.ఈ దృశ్యాన్ని చూసిన సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం కట్టలు తెంచుకొంది. ఈ సభను పర్యవేక్షించే పోలీస్ ఉన్నతాధికారి ఎవరు? ఎక్కడ? అంటూ అక్కడ ఉన్న వారిని ఆయన ప్రశ్నించారు.
ఇంతలో పోలీస్ ఉన్నతాధికారి సీఎం సిద్దరామయ్య వద్దకు వచ్చారు. సీఎం అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తుండగానే.. సిద్ధరామయ్య చెయ్యి.. పోలీస్ అధికారి చెంప మీదకు వెళ్లింది. ఈ విషయాన్ని గమనించి పోలీస్ ఉన్నతాధికారి కాస్తా వెనక్కి అడుగు వేశారు. అందుకు సంబంధించిన దృశ్యాలు మీడియాలో,సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే సదరు పోలీస్ అధికారి పేరు నారాయణ భారమణి.. ఆయన ధర్వాడ్ అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. సీఎం సిద్దరామయ్య వ్యవహార శైలిపై విపక్షాలు మండిపడుతోన్నాయి.
ఇక ప్రతిపక్ష జేడీ (ఎస్)అయితే తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించింది. అధికారం శాశ్వతం కాదని హెచ్చరించింది. పోలీసు అధికారిని కొట్టడానికి చేయి ఎత్తడం వల్ల మీ పదవికి లేదా గౌరవానికి ఎటువంటి కీర్తి రాదంది. మీ పదవీకాలం 5 సంవత్సరాలు మాత్రమే అని గుర్తు చేసింది. కానీ ప్రభుత్వ అధికారి 60 సంవత్సరాల వయస్సు వరకు పనిచేస్తారని వివరించింది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. మీ దుష్ప్రవర్తనను సరిదిద్దుకోండంటూ చురకలంటించింది. ఇక కర్ణాటక బిజెపి అధికార ప్రతినిధి విజయ్ ప్రసాద్ సైతం సీఎం సిద్దరామయ్య వ్యవహారశైలిని తప్పు పట్టారు. పోలీస్ అధికారికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
Attention train passengers: మే 1 నుంచి రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
Pahalgam Attack: దిద్దుబాటు చర్యలకు దిగిన కాంగ్రెస్ అధిష్టానం
AP Ministers: మార్చి నాటికి బందరు ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తి
Pahalgam Terror Attack: భరత్ భూషణ్ భార్య సుజాతను విచారించిన ఎన్ఐఏ
Pahalgam Terror Attack: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఉగ్ర దాడిపై స్పందించిన సీఎం
Varanasi: వారణాసిలో కెనడియన్ అరెస్ట్.. ఎందుకంటే..
Hyderabad IT Corridor: బంగ్లాదేశ్ వాసి అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు
Pahalgam Terror Attack: పాకిస్థానీ యూట్యూబ్ చానెల్స్‌ను నిషేధించిన భారత్
Supreme Court: కేంద్ర ప్రభుత్వానికి, ఓటీటీలకు సుప్రీంకోర్టు నోటీసులు.. ఎందుకంటే..
For National News And Telugu News