Vandebharath Express: కాట్పాడి మీదుగా విజయవాడకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్
ABN , Publish Date - May 21 , 2025 | 12:16 PM
త్వరలో ప్రారంభించనున్న విజయవాడ - బెంగుళూరు మధ్య కొత్తగా ప్రారంభించనున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వేలూరు జిల్లా కాట్పాడి రైల్వేస్టేషన్‌లో ఆగి వెళ్తుందని దక్షిణ రైల్వేశాఖ ప్రకటించింది. తిరుమల శ్రీవారి భక్తుల కోసం ఈ ఏర్పాట్లు చేశారు.

చెన్నై: విజయవాడ - బెంగుళూరు(Vijayawada-Bengaluru) మధ్య కొత్తగా ప్రారంభించనున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్(Vandebharath Express) రైలు వేలూరు జిల్లా కాట్పాడి రైల్వేస్టేషన్‌లో ఆగి వెళ్తుందని దక్షిణ రైల్వేశాఖ ప్రకటించింది. విజయవాడ నుంచి తిరుపతికి వెళ్లే శ్రీవారి భక్తుల కోసం, బెంగుళూరుకు వెళ్లే ప్రజలకు ఈ రైలు ప్రయోజనకరంగా వుంటుంది.
ఈ వార్తను కూడా చదవండి: Chennai: మీవల్లే మేం క్షేమంగా తిరిగొచ్చాం.. థ్యాంక్స్ సీఎం సార్..
మొత్తం 8 బోగీలతో వారంలో మంగళవారం మినహా మిగతా రోజుల్లో నడిపే ఈ రైలు విజయవాడ నుంచి ఉదయం 5.15 గంటలకు బయలుదేరి కాట్పాడికి ఉదయం 11.13 గంటలకు చేరుతుంది. మరో మార్గంలో బెంగుళూరు(Bengaluru) నుంచి మధ్యాహ్నం 2.45 గంటలకు విజయవాడకు బయలుదేరే ఈ రైలు సాయంత్రం 5.23 గంటలకు కాట్పాడికి చేరుకుంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి.
Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
నల్లమల సంపదపై రేవంత్ కన్ను: బీఆర్‌ఎస్
BSF Jawan: దేశసేవకు వెళ్లి.. విగతజీవిగా ఇంటికి..
Adilabad MP Nagesh: పటాన్‌చెరు- ఆదిలాబాద్ రైల్వే లైన్ నిర్మాణ పనులు చేపట్టాలి
Read Latest Telangana News and National News