Vadodara Bridge Collpase: ఒక్కసారిగా కుప్పకూలిన బ్రిడ్జి.. ట్రక్కు, వ్యాన్లు నదిలో..!
ABN , Publish Date - Jul 09 , 2025 | 12:08 PM
వంతెన ఒక్కసారిగా కుప్పకూలడంతో వాహనాలు నదిలో పడిపోయాయి. ఊహించని ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదం ఎక్కడ జరిగిందో ఇప్పుడు చూద్దాం..

గుజరాత్: వడోదరలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వడోదర జిల్లాలోని మహిసాగర్ నది మీద ఉన్న గంభీరా వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న 4 వాహనాలు నదిలో పడిపోయాయి. అందులో 2 ట్రక్కులు, 2 వ్యాన్లు ఉన్నాయి. బ్రిడ్జ్ మీద నుంచి వాహనాలు పడిపోవడంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఐదుగుర్ని కాపాడామని.. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
కారణం ఇదే..
‘మేం ఐదుగురిని రక్షించాం. వాళ్లు స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు 2 ట్రక్కులు, ఒక ఎకో వ్యాన్, ఓ పికప్ వ్యాన్, ఆటో రిక్షా నదిలో పడిపోయినట్లు గుర్తించాం’ అని వడోదర జిల్లా కలెక్టర్ అనిల్ ధమేలియా తెలిపారు. వంతెన పాతబడటం, గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా భారీగా వానలు పడుతుండటం వల్ల బ్రిడ్జి కూలిపోయి ఉండొచ్చని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. వడోదర-ఆనంద్ పట్టణాలను కలిపే ఈ వంతెన కూలడంతో ఇరు ప్రాంతాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. 45 ఏళ్ల కింద నిర్మించిన ఈ బ్రిడ్జి.. చాన్నాళ్లుగా శిథిలావస్థలో ఉందని స్థానిక ప్రజలు అంటున్నారు. బ్రిడ్జి ప్రమాద ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కూలిన బ్రిడ్జి మీద ట్యాంకర్ వేలాడటాన్ని వీడియోల్లో చూడొచ్చు.
ఇవీ చదవండి:
అత్తతో ఎఫైర్.. అల్లుడి కొంప ముంచింది..
మరిదిని పెళ్లి చేసుకోవాలని.. భర్తను..
దేశ వ్యాప్తంగా బంద్.. ఈ రాష్ట్రంలో..
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి