Share News

JD Vance India Visit: ఇండియాకు అమెరికా వైస్ ప్రెసిడెంట్.. ఘన స్వాగతం

ABN , Publish Date - Apr 21 , 2025 | 10:21 AM

JD Vance India Visit: సతీసమేతంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ భారత్‌ గడ్డపై అడుగుపెట్టారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్‌కు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఘన స్వాగతం పలికారు.

JD Vance India Visit: ఇండియాకు అమెరికా వైస్ ప్రెసిడెంట్.. ఘన స్వాగతం
JD Vance India Visit

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ (US Vice President Jd Vance) భారత్‌కు (India) చేరుకున్నారు. ఈరోజు (సోమవారం) ఉదయం సతీసమేతంగా వాన్స్‌ ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టారు. జేడి వాన్స్‌తో పాటు సతీమణి జేడి ఉష, వారి ముగ్గురు చిన్నారులు ఇవాన్, వివేక్, మిరాబెల్ ఇండియాకు వచ్చారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో జేడి వాన్స్‌కు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ (Union Minister Ashwini Vaishnaw) ఘన స్వాగతం పలికారు. కళాకారులు తమ నృత్యాలతో వాన్స్ ఫ్యామిలీకి వెల్కమ్ చెప్పారు. ఈనెల 24 వరకు భారత్‌లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ పర్యటిస్తారు. సతీమణి ఉషా వాన్స్, పిల్లలతో కలిసి వాన్స్ భారత్‌లో పర్యటించనున్నారు. అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపట్టిన అనంతరం జేడి వాన్స్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి.


భారత పర్యటనలో భాగంగా ఈరోజు సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) నివాసానికి జేడి వాన్స్ వెళ్లనున్నారు. సాయంత్రం 6:30 గంటలకు ప్రధానితో వాన్స్ సమావేశంకానున్నారు. భారత - అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై మోదీతో వాన్స్ చర్చిస్తారు. చర్చల తర్వాత జేడీ వాన్స్ దంపతులకు ప్రధాని మోదీ విందు ఏర్పాటు చేశారు. నాలుగు రోజుల భారత పర్యటనలో పలు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలను వాన్స్ దంపతులు సందర్శించనున్నారు. అక్షర్‌ధామ్ ఆలయం, జైపూర్, ఆగ్రా, తాజ్‌మహల్‌ను జేడి దంపతులు సందర్శించనున్నారు.

Disha Patani’s Sister Rescues Baby: పాడుబడ్డ ఇంట్లో అనాథ చిన్నారి.. కాపాడిన నటి దిశా పటానీ సొదరి


జేడి వాన్స్ పర్యటన సందర్భంగా భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎయిర్‌పోర్టు నుంచి జేడి బస చేయనున్న హోటల్ వరకు కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈరోజు సాయంత్రం స్వామినారాయణ్‌ అక్షర్‌ధామ్ ఆలయాన్ని జేడి వాన్స్ సందర్శించనున్నారు. అనంతరం చేనేత ఉత్పత్తుల దుకాణాలు సందర్శిస్తారు. రేపు (మంగళవారం) జైపూర్‌లోని చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు. ఈనెల 23న తాజ్‌మహల్‌ను జేడి దంపతులు సందర్శించనున్నారు. ఈనెల 24న (గురువారం) అమెరికాకు జేడి వాన్స్ తిరుగు ప్రయాణంకానున్నారు.


ఇవి కూడా చదవండి

TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..

Jharkhand Encounter: జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోలు మృతి

Read Latest National News And Telugu News

Updated Date - Apr 21 , 2025 | 10:54 AM