Share News

UP Crime: 15 వేల ఎన్‌కౌంటర్లు.. 238 మంది హతం

ABN , Publish Date - Jul 18 , 2025 | 06:02 AM

శాంతిభద్రతలు గాడితప్పుతూ.. గూండారాజ్‌ కొనసాగుతున్న ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితులను ‘బుల్లెట్‌ రాజ్‌’తో అదుపులోకి తీసుకువచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.

UP Crime: 15 వేల ఎన్‌కౌంటర్లు.. 238 మంది హతం

  • 2017 నుంచి యూపీలో బుల్లెట్‌ రాజ్‌..!

  • శాంతిభద్రతలు నియంత్రణలో ఉన్నాయంటున్న డీజీపీ

లఖ్‌నవూ, జూలై 17: శాంతిభద్రతలు గాడితప్పుతూ.. గూండారాజ్‌ కొనసాగుతున్న ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితులను ‘బుల్లెట్‌ రాజ్‌’తో అదుపులోకి తీసుకువచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. 2017లో యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటినుంచి ఇప్పటి వరకు మొత్తం 14,973 ఎన్‌కౌంటర్లు జరగ్గా.. 238 మంది మృతిచెందారని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్లలో 9,467 మంది నేరగాళ్లకు గాయాలవ్వగా.. 30,694 మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్స్‌ అరెస్టయ్యారు.


ఈ గణాంకాలపై ఉత్తరప్రదేశ్‌ డీజీపీ రాజీవ్‌ కృష్ణ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశాల మేరకు నేరస్థులపై కఠిన చర్య లు తీసుకుంటున్నామన్నారు. 2017 నుంచి తీసుకున్న కఠిన చర్యలతో ఇప్పు డు దేశంలోనే యూపీ అత్యంత సురక్షిత రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిందన్నారు.

Updated Date - Jul 18 , 2025 | 10:06 AM