Share News

Union Minister: ‘మెట్రో’పై స్టాలిన్‌ రాజకీయం చేస్తున్నారు..

ABN , Publish Date - Nov 21 , 2025 | 11:52 AM

మదురై, కోయంబత్తూరు మెట్రో రైల్‌ ప్రాజెక్టు ప్రతిపాదనలకు కేంద్రం అనుమతివ్వలేదంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ రాజకీయం చేస్తున్నారని కేంద్రమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ఆరోపించారు. కోవై, మదురై మెట్రో రైల్‌ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతివ్వకుండా వివక్ష చూపిస్తోందంటూ స్టాలిన్‌ ఆరోపించిన విషయం తెల్సిందే.

Union Minister: ‘మెట్రో’పై స్టాలిన్‌ రాజకీయం చేస్తున్నారు..

- కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌

చెన్నై: మదురై, కోయంబత్తూరు మెట్రో రైల్‌ ప్రాజెక్టు ప్రతిపాదనలకు కేంద్రం అనుమతివ్వలేదంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ రాజకీయం చేస్తున్నారని కేంద్రమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌(Manohar Lal Khattar) ఆరోపించారు. కోవై, మదురై మెట్రో రైల్‌ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతివ్వకుండా వివక్ష చూపిస్తోందంటూ స్టాలిన్‌ ఆరోపించిన విషయం తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఏ ఒక్క రాష్ట్రంలోని లేని విధంగా చెన్నై మెట్రో రైల్‌(Chennai Metro Rail) రెండో దశ ప్రాజెక్టుకు రూ.6326 కోట్లు కేటాయించామన్నారు.


2024 అక్టోబరులో కేంద్రం ఇచ్చిన అనుమతులను ముఖ్యమంత్రి స్టాలిన్‌ విస్మరించి, 2017లో ప్రతిపాదనలను ఆధారంగా చేసుకుని కోవై, మదురై మెట్రో ప్రాజెక్టులను రాజకీయం చేస్తున్నారని, ఇది దురదృష్టమన్నారు. కోవై, మదురై మెట్రో రైల్‌ ప్రాజెక్టులకు అనేక లోటుపాట్లున్నాయన్నారు. చెన్నైతో పోల్చితే కోయంబత్తూరులో మెట్రో ప్రాజెక్టు దూరం చాలా తక్కువని, కానీ, అధిక మొత్తంలో రవాణా సదుపాయాలను ప్రతిపాదించారన్నారు.


nani2.2.jpg

కోవై మెట్రో ప్రాజెక్టు కోసం ప్రతిపాదించిన ఏడు మార్గాల్లో సరైన స్థలం కూడా లేదన్నారు. అదే విధంగా ప్రతిపాదనల్లో కార్పొరేషన్‌ పరిధిలో నివసించే ప్రజల కంటే ఐదు రెట్లు ఎక్కువ నివసిస్తున్నట్టు చూపించారన్నారు. అలాగే, తమిళనాడుకు పది వేల ఎలక్ట్రిక్‌ బస్సులు ఇచ్చే కేంద్రప్రభుత్వ పథకంలో రాష్ట్రాన్ని చేరేందుకు సీఎం స్టాలిన్‌ ప్రభుత్వం నిరాకరించిందని కేంద్ర మంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

రూపాయి మారకానికి లక్ష్యమేమీ పెట్టుకోలేదు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 21 , 2025 | 11:52 AM