Mumbai-pune Expressway: ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రక్కు బీభత్సం.. 20 వాహనాలు ధ్వంసం, ఒకరి మృతి
ABN , Publish Date - Jul 26 , 2025 | 08:30 PM
ట్రక్కు డ్రైవర్‌ను ఖోపోలి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రమాదం సమయంలో అతను తాగిలేడని వైద్య పరీక్షలో వెల్లడైంది. కేసు నమోదు చేసుకుని తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు.

ముంబై: ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే (Mumbai-Pune Exprssway)పై శనివారం మధ్యాహ్నం భారీ రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కంటైనర్ ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పి సుమారు 20 నుంచి 25 వాహనాలపైకి దూసుకుపోయింది. దీంతో బీఎండబ్ల్యూ, మెర్సెడెస్ సహా పలు లగ్జరీ కార్లు సైతం దెబ్బతిన్నాయి. 20 మందికి పైగా ఈ ప్రమాదంలో గాయపడగా, వారిని హుటాహుటిన నవీ ముంబైలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ ఒక మహిళ మృతిచెందారు.
సమాచారం తెలిసిన వెంటనే ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసు బృందాలు హుటాహుటిన సహాయక కార్యక్రమాలు చేపట్టారు. ఖోపోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని అదోషి టన్నెల్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదం కారణంగా పలు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
కాగా, ట్రక్కు డ్రైవర్‌ను ఖోపోలి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రమాదం సమయంలో అతను తాగిలేడని వైద్య పరీక్షలో వెల్లడైంది. కేసు నమోదు చేసుకుని తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
భారత సైన్యంలోకి ఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్... రుద్ర
నితీష్‌కు మద్దతిచ్చినందుకు చింతిస్తున్నా... కేంద్ర మంత్రి నిప్పులు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి