Share News

Tripura Girl Missing: ఢిల్లీ వర్శిటీ విద్యార్థిని అదృశ్యం.. రంగంలోకి పోలీసులు

ABN , Publish Date - Jul 13 , 2025 | 05:55 PM

త్రిపుర జిల్లా సబ్రూమ్ నివాసి అయిన స్నేహ ఢిల్లీ యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న ఆత్మారామ్ సనాతన్ ధర్మ కాలేజీలో చదువుతోంది. చివరిసారిగా తన కుటుంబ సభ్యులతో జులై 7న మాట్లాడింది. తన స్నేహితురాలిని దింపేందుకు సరాయ్ రోహిల్లా రైల్వేస్టేషన్‌కు వెళ్తున్నట్టు తల్లికి తెలిపింది.

Tripura Girl Missing: ఢిల్లీ వర్శిటీ విద్యార్థిని అదృశ్యం.. రంగంలోకి పోలీసులు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో స్నేహ దెబ్‌నాథ్ అనే 19 ఏళ్ల విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో అదృశ్యం కావడం సంచలనం రేపుతోంది. త్రిపురకు చెందిన స్నేహ అదృశ్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మానిక్ సాహా పోలీసులను ఆదేశించారు.


త్రిపుర జిల్లా సబ్రూమ్ నివాసి అయిన స్నేహ.. ఢిల్లీ యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న ఆత్మారామ్ సనాతన్ ధర్మ కాలేజీలో చదువుతోంది. చివరిసారిగా తన కుటుంబసభ్యులతో జులై 7న మాట్లాడింది. తన స్నేహితురాలిని దింపేందుకు సరాయ్ రోహిల్లా రైల్వేస్టేషన్‌కు వెళ్తున్నట్టు తల్లికి తెలిపింది. ఉదయం 5.56 గంటలకు చివరిసారిగా ఫోన్ కాల్ రికార్డయింది. 8.45 గంటలకు ఆమె ఫోన్ స్విచ్చాఫ్ అయింది. అయితే స్నేహ తనను కలుకోలేదని ఆమె ఫ్రెండ్ చెప్పడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. క్యాబ్ ట్రైవర్‌ను కనుక్కోగా సిగ్నేచర్ బ్రిడ్జి దగ్గర దింపినట్టు తెలియడంతో కుటుంబ సభ్యులు మరింత బెంబేలెత్తారు. సిగ్నేచర్ బ్రిడ్జి అంత సేఫ్టీ కాకపోవడమే కాకుండా అక్కడ పరిమితంగానే సీసీటీవీ నిఘా ఉంది. స్నేహ ఆచూకీపై కెమెరా ఫుటేజ్ లేకపోవడంతో ఆమె జాడ తెలుసుకోవడం క్లిష్టంగా మారింది.


ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు జులై 9న ఎన్‌డీఆర్ఎఫ్ సాయంతో సిగ్నేచర్ బ్రిడ్జి చుట్టూ ఏడు కిలోమీటర్ల పరిధిలో తీవ్రమైన గాలింపు చర్యలు జరిపారు. అయితే ఇంతవరకూ సరైన ఆధారాలు ఏవీ దొరకలేదు. స్నేహ గత నాలుగు నెలలుగా డబ్బులు డ్రా చేయలేదని, బ్యాంకు అకౌంట్ ముట్టుకోలేదని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. దీంతో స్నేహ ఆచూకి తెలిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలను పోలీసులు కోరారు.


నేను విఫలమయ్యానని అనిపిస్తోంది..

కాగా, స్నేహ గదిలో స్వదస్తూరీతో ఆమె రాసిన ఒక లేఖ కుటుంబ సభ్యులకు కనిపించినట్టు తెలుస్తోంది. 'నేను విఫలమయ్యాయని, భారంగా మారారని అనిపిస్తోంది. ఇలా బతకడం సాధ్యం కావడం లేదు. సిగ్నేచర్ బ్రిడ్జి నుంచి దూకి జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాను' అని ఆ లేఖలో ఉన్నట్టు సమాచారం. ఇందులో ఎవరి ప్రమేయం లేదని, తనకు తానుగా ఈ నిర్ణయం తీసుకున్నానని కూడా స్నేహ పేర్కొన్నట్టు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి..

విరిగిపడిన కొండచరియలు.. తృటిలో తప్పించుకున్న మాజీ సీఎం

భారీ అగ్ని ప్రమాదం.. తగలబడిపోయిన రైలు..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 13 , 2025 | 07:26 PM