Share News

Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని మృతి..

ABN , Publish Date - Apr 18 , 2025 | 10:00 AM

అమెరికాలోని టెక్సాస్‌‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుంటూరు, రాజేంద్ర నగర్‌‌కు చెందిన దీప్తి అనే విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటనలో ఆమె స్నేహితురాలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని మృతి..
Road Accident Deepthi death

గుంటూరు జిల్లా: అమెరికా (America)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident)లో తెలుగు విద్యార్థిని మృతి (Student Death) చెందింది. ఇటీవల కాలంలో విదేశాలలో ఉంటున్న భారతీయులు (Indians) ఎక్కువగా మృత్యువాద పడుతున్నారు. ఇందులో చదువు కోసం విదేశాలకు వెళ్లిన విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వీరిలో కొందరు హత్య గావించబడుతుండగా.. మరి కొందరు ప్రమాదవ శాత్తు మృత్యువడిలోకి వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే గుంటూరు (Guntur)కు చెందిన దీప్తి (Deepthi) ఎంఎస్ (MS) చేసేందుకు అమెరికాలోని టెక్సాస్ (Texas) వెళ్ళింది. తన స్నేహితురాలితో కలిసి‌ రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చి కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది.

Also Read..: పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్


ఈ విషయం తెలుసుకున్న దీప్తి తల్లిదండ్రులు బోరున విలపించారు. ఆమె స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీప్తి మృతదేహాన్ని గుంటూరుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీప్తి తల్లిదండ్రులు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సాయాన్ని అభ్యర్థించారు. వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి పెమ్మసాని అతని సోదరుడు రవి అన్ని చర్యలు చేపట్టారు. ఈ నెల 15వ తేదీన జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దీప్తి చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది.ఆమె స్నేహితురాలు స్నిగ్ధకు కూడా గాయాలు అయ్యాయి. ఆమె చికిత్స పొందుతోంది. కాగా దీప్తి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పాస్టర్లకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

అమెరికాలో మరోసారి కాల్పులు.. ఇద్దరి మృతి

For More AP News and Telugu News

Updated Date - Apr 18 , 2025 | 10:00 AM