Share News

Breaking News: మానవత్వం చాటుకున్న మంత్రి నాదెండ్ల

ABN , First Publish Date - Jan 26 , 2025 | 08:19 AM

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: మానవత్వం చాటుకున్న మంత్రి నాదెండ్ల
Republic Day Celebrations

Live News & Update

  • 2025-01-26T13:37:26+05:30

    మానవత్వం చాటుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్

    • విజయవాడ నుంచి గుంటూరు వెళ్తున్న మంత్రి

    • వారధి వద్ద ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలు

    • వెంటనే కారు ఆపి క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స అందించిన మంత్రి

    • 108 కి కాల్ చేసి ఆస్పత్రికి పంపిన మంత్రి మనోహర్

    • విజయవాడ‌లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో జాయిన్ చేస్తున్నట్టు తెలిపిన 108 సిబ్బంది

  • 2025-01-26T11:03:57+05:30

    ఆకట్టుకున్న ఇండోనేషియా మిలిటరీ బ్యాండ్ కవాతు

    • ఇండోనేషియా మిలిటరీ అకాడమీకి చెందిన 190 మంది సభ్యుల బృందం నిర్వహించిన కవాతు అందరినీ ఆకట్టుకుంది. ఈ ఏడాది ఈ వేడుకకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

  • 2025-01-26T10:34:09+05:30

    ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలు ప్రారంభం

    • ఢిల్లీలో ప్రారంభమైన రిపబ్లిక్ డే వేడుకలు

    • కర్తవ్యపథ్‌కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగధీప్ దన్కర్

    • రిపబ్లిక్‌డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షులు సుబియాంతో

  • 2025-01-26T10:14:07+05:30

    అమరవీరులకు ప్రధాని నివాళులు

    • ఢిల్లీలో అమరవీరులకు నివాళులర్పించిన ప్రధాని మోదీ

    • జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని నివాళులు

    • కార్యక్రమంలో పాల్గొన్న రక్షణమంత్రి రాజ్‌నాధ్ సింగ్, త్రివిధ దళాధిపతులు

  • 2025-01-26T08:41:02+05:30

    హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో..

    • గణతంత్ర దినోత్సవం సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

  • 2025-01-26T08:24:44+05:30

    మోదీ ట్వీట్

    • 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు ఘనమైన గణతంత్ర 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ జాతీయ పండుగ మన రాజ్యాంగ విలువలను పరిరక్షించడమే కాకుండా బలమైన, సుసంపన్నమైన భారతదేశాన్ని సృష్టించే దిశగా మన ప్రయత్నాలను బలపరచాలని కోరుకుంటున్నట్లు మోదీ తెలిపారు.

  • 2025-01-26T08:19:38+05:30

    దేశ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు

    • దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.