Kolkata Gang Rape Case: మిత్రుడే మృగమైతే ఏం చేస్తాం.. అత్యాచార కేసులో ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
ABN , Publish Date - Jun 28 , 2025 | 11:26 AM
పశ్చిమ బెంగాల్‌లో లా విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో (Kolkata Gang Rape Case) పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఇదే సమయంలో ఈ విషయంపై టీఎంసీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

పశ్చిమ బెంగాల్: కోల్‌కతాలో న్యాయ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో (Kolkata Gang Rape Case) పోలీసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితుల్లో లా కాలేజీ మాజీ విద్యార్థి కూడా ఉన్నాడు. పోలీసుల విచారణలో నిందితులు ఇప్పటివరకు కొన్ని విషయాలను వెల్లడించారు. పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు నిందితుల్లో ఒకరు మొదట తాను బాధితురాలికి వివాహ ప్రతిపాదన చేసినట్లు పోలీసులకు తెలిపాడు. బాధితురాలు ఆ ప్రతిపాదనను తిరస్కరించినప్పుడు, నిందితుడు తన స్నేహితులతో కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు వెల్లడించాడు.
నెటిజన్ల కామెంట్స్
పోలీసుల దర్యాప్తు నేపథ్యంలో ఈ విషయం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనను సమర్థించనని టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ (Kalyan Banerjee) అన్నారు. ఈ క్రమంలో నిందితుడిని అరెస్టు చేయాలని, కొంతమంది ఇలాంటి నేరాలు చేస్తారని వ్యాఖ్యానించారు. కానీ ఒక స్నేహితుడు మృగంగా మారి తన స్నేహితురాలిపై అత్యాచారం చేస్తే ఏం చేస్తామని, కాలేజీల్లో కూడా పోలీసులు ఎప్పుడూ ఇక్కడే ఉంటారా? అని ఎంపీ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పందంగా మారాయి. ప్రజలకు న్యాయం చేయాల్సింది పోయి, ఇలా మాట్లాడటం ఏంటని ఎంపీ తీరుపై అనేక మంది నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మహిళా కమిషన్ కూడా..
బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ఈ కేసులో ప్రధాన నిందితుడితో అభిషేక్ బెనర్జీ ఉన్న చిత్రాలను పంచుకున్నారు. అత్యాచారం చేసిన వ్యక్తిని రక్షించేది టీఎంసీ అనిమాలవీయ అన్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వం న్యాయం గొంతును అణచివేయనివ్వబోమన్నారు. బాధితురాలి కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందన్నారు. న్యాయం జరిగే వరకూ తాము పోరాడుతూనే ఉంటామన్నారు. ఈ ఘటన తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ (NCW) కోల్‌కతా పోలీస్ కమిషనర్‌కు లేఖ రాసి తక్షణ దర్యాప్తునకు ఆదేశించింది. భారత పౌర భద్రతా కోడ్ (BNSS) సెక్షన్ 396 కింద ఆమెకు పరిహారం ఇవ్వాలని NCW తెలిపింది.
బీజేపీ డిమాండ్
ఈ ఘటన విషయంలో మమతా ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రభుత్వ పాలనలో మహిళలపై నేరాలు నిరంతరం పెరుగుతున్నాయని బీజేపీ ఆరోపించింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో మహిళలు సురక్షితంగా తిరిగే పరిస్థితి లేదని పేర్కొంది. ఈ ఘటనకు వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ వెలుపల బీజేపీ యువ మోర్చా కస్బా నిరసన తెలిపింది. ఆ సమయంలో బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు, పోలీసులకు మధ్య ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. దీంతో పరిస్థితిని నియంత్రించడానికి పోలీసులు స్వల్పంగా లాఠీ ఛార్జ్ చేశారు. ఆ క్రమంలో కొంతమంది కార్యకర్తలు గాయపడగా, మరి కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చదవండి:
సిబిల్ స్కోర్ కారణంగా ఉద్యోగం తొలగింపు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
జూన్ 30లోపు ముగియాల్సిన ఆర్థిక కార్యకలాపాలు ఇవే..
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి