Share News

Cyclone Ditwah: తమిళనాడులో ముగ్గురు మృతి.. నీటమునిగిన 57,000 హెక్టార్ల పంట

ABN , Publish Date - Nov 30 , 2025 | 05:12 PM

భారీ వర్షాల కారణంగా తూత్తుకుడి, తంజావూరులో గోడ కూలి ఇద్దరు మరణించారని, మైలాడుతురైలో విద్యుదాఘాతంతో 20 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడని మంతి రామచంద్రన్ చెప్పారు.

Cyclone Ditwah: తమిళనాడులో ముగ్గురు మృతి.. నీటమునిగిన 57,000 హెక్టార్ల పంట
Cyclone Ditwah effet

చెన్నై: దిత్వా తుఫాన్ (Cyclone Ditwah) ప్రభావం తమిళనాడుపై తీవ్రంగా కనిపిస్తోంది. తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ముగ్గురు మృతి చెందారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ నుంచి తమిళనాడు మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ మీడియాతో మాట్లాడుతూ, శనివారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా తూత్తుకుడి, తంజావూరులో గోడ కూలి ఇద్దరు మరణించారని, మైలాడుతురైలో విద్యుదాఘాతంతో 20 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు.


దిత్వా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో డెల్టా జిల్లాల్లో వేలాది హెక్టార్లలో పంట నీటమునిగిందని, 149 పశువులు ప్రాణాలు కోల్పోయాని రామచంద్రన్ చెప్పారు. నాగపట్నంలో 24,000 హెక్టార్లు, తిరువారూర్‌లో 15,000 హెక్టార్లు, మైలాడుతురైలో 8,000 హెకార్ట పంట దెబ్బతిందని, ఓవరాల్‌గా 57,000 హైక్టార్లలో పంట దెబ్బతిందని చెప్పారు. డెల్టా ప్రాంతంలో 234 గుడిసెలు ధ్వంసమైనట్టు తెలిపారు.


ఎస్‌డీఆర్ఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బందితో సహా 28 డిజాస్టర్ రెస్పాన్ టీమ్‌లను మోహరించామని, అదనంగా మరో 10 టీమ్‌లు ఇతర రాష్ట్రాల నుంచి తమిళనాడుకు చేరుకున్నాయని మంత్రి వివరించారు. తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలను ఈ టీమ్‌లు చేపడుతున్నట్టు చెప్పారు. కోస్తా, వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో పరిస్థితిని ఆయా జిల్లాల అధికారులతో ప్రభుత్వ కంట్రోల్ రూమ్‌ నుంచి సంప్రదిస్తున్నట్టు తెలిపారు. ఎవరు ఎలాంటి సహాయం కోరినా వెంటనే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దృష్టికి తీసుకువచ్చి తక్షణం చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.


ఇవి కూడా చదవండి..

తపోవనంలో వేలాది చెట్ల నరికివేత.. ప్రభుత్వ నిర్ణయంపై సయాజీ షిందే ఆగ్రహం

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిల పక్షం భేటీ..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 30 , 2025 | 05:26 PM