Moists: మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు హతం
ABN , Publish Date - Jul 26 , 2025 | 03:48 PM
ఘాగ్రా అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే ఇంటెలిజెన్స్ సమాచారంతో జార్ఖాండ్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో కూడిన భద్రతా బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. బలగాల రాకను గుర్తించిన మావోయిస్టులు కాల్పులకు దిగడంతో ఇరువైపులా సుదీర్ఘంగా కాల్పులు చోటుచేసుకున్నాయి.

రాంచీ: భద్రతా బలగాల ఆపరేషన్‌లో మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్ (Jharkhand)లోని గుమ్లా జిల్లా ఘాగ్రా అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య శనివారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయి హతమయ్యారు. వీరిని నిషేధిత సీపీఐ(మావోయిస్ట్) చీలిక వర్గమైన జార్ఖండ్ జన్ ముక్తి పరిషత్ (జేజేఎంపీ)కి చెందిన వారిగా గుర్తించిట్టు అధికారులు తెలిపారు. ఆపరేషన్ కొనసాగుతున్నందున పూర్తికాగానే మరిన్ని వివరాలు తెలియజేస్తామని జార్ఖండ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఆపరేషన్స్) మిచెల్ ఎస్.రాజ్ చెప్పారు.
ఘాగ్రా అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే ఇంటెలిజెన్స్ సమాచారంతో జార్ఖండ్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో కూడిన భద్రతా బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. బలగాల రాకను గుర్తించిన మావోయిస్టులు కాల్పులకు దిగడంతో ఇరువైపులా సుదీర్ఘంగా కాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాల వైపు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్టు సమాచారం లేదు.
కాగా, బొకారో జిల్లాలో పది రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్ అనంతరం శనివారం నాడు మరో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. జులై 16న గోమియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బిరహోడేరా అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో రూ.5లక్షల రివార్డు ఉన్న ఒక మావోయిస్టుతోపాటు సీఆర్‌పీఎఫ్ జవాన్ ఒకరు మృతిచెందారు. ఎదురుకాల్పుల్లో దురదృష్టవశాత్తూ ఒక పౌరుడు కూడా మరణించాడు.
ఇవి కూడా చదవండి..
సిద్ధరామయ్య, డీకే ప్రత్యేక అధికారుల మధ్య బాహాబాహీ
ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా ప్రధాని మోదీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి