Share News

Maoist Party Central Committee: లేఖ విడుదల చేసిన మావోయిస్టు కేంద్ర కమిటీ

ABN , Publish Date - Oct 19 , 2025 | 02:07 PM

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేసింది. శత్రువుకు లొంగిపోయిన వారు విప్లవ ప్రతిఘాతకులు, విచ్ఛిత్తి ద్రోహులు అని లేఖలో పేర్కొంది. సోనూ అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ రావు, సతీష్ కు విప్లవ ప్రజలు తగిన విధంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Maoist Party Central Committee: లేఖ విడుదల చేసిన మావోయిస్టు కేంద్ర కమిటీ
Maoist Party Central Committee

ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 19: మావోయిస్టుల లొంగుబాట్లపై మావోయిస్టు కేంద్రకమిటీ (Maoist Party Central Committee) స్పందించింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేసింది. శత్రువుకు లొంగిపోయిన వారు విప్లవ ప్రతిఘాతకులు, విచ్ఛిత్తి ద్రోహులు అని లేఖలో పేర్కొంది. సోనూ అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ రావు, సతీష్ ను విప్లవ ప్రజలు తగిన విధంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.


సోనూ, సతీష్ ముఠాను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. 2024 నుంచి విప్లవానికి ప్రతిఘాతుకంగా ఆపరేషన్ కగార్ మొదలైందని తెలిపారు. లొంగిపోయిన వారు సుఖానికి, స్వార్థానికి అలవాటు పడ్డారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టగా.. పలువులు మావోయిస్టులు జనజీవన స్రవంతిలో వరుసగా కలిసిపోతున్నారు. మరోవైపు మావోయిస్టులను హతమార్చేందుకు ఆపరేషన్ కగార్ నిర్విరామంగా కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి:

Air India: చివరి నిమిషంలో ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాక్

Delhi Air Quality Hits Dangerous: దీపావళి వేళ.. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం

Updated Date - Oct 19 , 2025 | 04:20 PM