Share News

Tejaswi Yadav: నితీష్‌ను రెండు సార్లు సీఎం చేసిందే నేనే

ABN , Publish Date - Mar 05 , 2025 | 08:17 PM

బీహార్‌లో 58 శాతం మంది 18 నుంచి 25 ఏళ్ల లోపు యువకులేనని, రెక్కలు అలిసిపోయిన రిటైర్డ్ సీఎం ఈ రాష్ట్రానికి అవసరం లేదని పరోక్షంగా నితీష్‌పై తేజస్వి యాదవ్ విమర్శలు గుప్పించారు.

Tejaswi Yadav: నితీష్‌ను రెండు సార్లు సీఎం చేసిందే నేనే

పాట్నా: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌పై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) చేసిన వ్యాఖ్యల దుమారం కొనసాగుతోంది. లాలూ ఎదుగుదలకు తానే కారణమంటూ నితీష్ కుమార్ బీహార్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై లాలూ తనయుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) విరుచుకుపడ్డారు. నితీష్ కుమార్‌ను రెండుసార్లు ముఖ్యమంత్రి చేసి, ఆయన పార్టీని కాపాడింది తానేనని, ఆ విషయం ఆయన మరచిపోకూడదని అన్నారు.

Mani Shankar Aiyar: రెండు సార్లు ఫెయిలైన రాజీవ్ ఎలా ప్రధాని అయ్యారో?: మణిశంకర్ అయ్యర్


''నితీష్ కుమార్ నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ తానే లాలూను సీఎం చేశానని చెప్పారు. నితీష్ ఏం చేప్పారనేది పక్కనపెట్టండి. కానీ ఆయన ఒకటి గుర్తుంచుకోవాలి. ఆయన కంటే ముందే మా తండ్రి (లాలూ) ఎమ్మెల్యేగా రెండుసార్లు, ఎంపీగా ఒకసారి ఎన్నికయ్యారు. లూలూ పలువురిని ప్రధానమంత్రులను చేశారు. నేనే ఆయనను (నితీష్) రెండుసార్లు ముఖ్యమంత్రిని చేశాను. ఆయన పార్టీ (జేడీయూ)ని కాపాడాను'' అని మీడియాతో మాట్లాడుతూ తేజస్వి చెప్పారు. రాష్ట్రంలో అలసిపోయిన (టైర్డ్) ముఖ్యమంత్రి, రిటైర్డ్ అధికారులు ఉన్నారంటూ విమర్శలు గుప్పించారు.


75 ఏళ్ల రిటైర్డ్ సీఎం ఇంకా కావాలా?

దీనికి ముందు ఆర్జేడీ ''యువ చౌపల్''లో తేజస్వి మాట్లాడుతూ, 2025లో ప్రభుత్వాన్ని ఆర్జేడీ ఏర్పాటు చేస్తుందని అన్నారు. దేశంలోనే బీహార్ 'యువప్రదేశ్' అని, సరికొత్త బీహార్‌ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం మనకుందని చెప్పారు. బీహార్‌లో 58 శాతం మంది 18 నుంచి 25 ఏళ్ల లోపు యువకులేనని, రెక్కలు అలిసిపోయిన రిటైర్డ్ సీఎం ఈ రాష్ట్రానికి అవసరం లేదని పరోక్షంగా నితీష్‌పై విమర్శలు గుప్పించారు. "ఇప్పుడు అసమర్ధ ప్రభుత్వం మనకు అవసరం లేదు. 60 ఏళ్లకు రిటైర్మెంట్ ఉంటుంది. మీకు 75 ఏళ్ల ముఖ్యమంత్రి కావాలా? ఇప్పుడు సమయం వచ్చింది. బీహార్‌ను ముందుకు తీసుకువెళ్లే కొత్త సైకిల్ కావాలి, పాతపడిపోయిన సైకిల్ కాదు'' అంటూ పార్టీ కార్యకర్తలకు తేజస్వి దిశానిర్దేశం చేశారు.


ఇవి కూడా చదవండి

Rahul Gandhi: సావర్కర్ కేసులో విచారణకు గైర్హాజర్.. రాహుల్‌గాంధీకి రూ.200 ఫైన్

Aurangzeb Row: అబూ అజ్మీని యూపీ పంపండి.. గట్టి ట్రీట్‌మెంట్ ఇస్తాం: యోగి

Arvind Kejriwal: ట్రంప్‌ను మించిన సెక్యూరిటీతో ధ్యాన కేంద్రానికి కేజ్రీవాల్

Former Minister: హీరో విజయ్‌ది పగటికలే.. అందరూ ఎంజీఆర్‌ కాలేరు

Hero Vishal: హీరో విశాల్‌ ప్రశ్న.. విజయ్‌ మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు..

Updated Date - Mar 05 , 2025 | 08:21 PM