Tej Pratap Yadav: అనుష్కతో 12 ఏళ్లుగా రిలేషన్షిప్.. తేజ్‌ప్రతాప్ వెల్లడి
ABN , Publish Date - May 24 , 2025 | 08:47 PM
తేజ్ ప్రతాప్ యాదవ్ శనివారంనాడు తన ఫేస్బుక్ పేజ్‌లో అనుష్కతో తనకు చిరకాలంగా ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇద్దరూ కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు.

పాట్నా: ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) సంచలన విషయం వెల్లడించారు. అనుష్క యాదవ్ (Anushka Yadav)తో తనకు 12 ఏళ్లుగా రిలేషన్షిప్ ఉన్నట్టు అంగీకరించారు. శనివారంనాడు తన ఫేస్బుక్ పేజ్‌లో అనుష్కతో తనకు చిరకాలంగా ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇద్దరూ కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు.
PM Modi: ఎన్డీయే ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ కీలక సమావేశం
''నేను తేజ్‌ప్రతాప్ యాదవ్‌ను. ఈ ఫోటోలో నాతో ఉన్నది అనుష్క యాదవ్. ఇద్దరం ఒకరికొకరు బాగా తెలుసు. 12 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం. 12 ఏళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నాం. చాలాకాలంగా ఈ విషయాన్ని అందరితో పంచుకోవాలని అనుకుంటున్నప్పటికీ అదెలాగో తెలియలేదు. ఈరోజు ఈ పోస్ట్‌తో నామనసులో ఏముందో మీతో పంచుకుంటున్నాను. మీరంతా అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను'' అని తేజస్వి యాదవ్ ఆ పోస్ట్‌లో రాశారు.
తేజ్ ప్రతాప్ వ్యక్తిగత జీవితం చాలాకాలంగా చర్చనీయంశమవుతోంది. 2018లో బీహార్ మాజీ మంత్రి చందిక్రా రాయ్‌తో అట్టహాసంగా తేజ్ ప్రతాప్ వివాహం జరిగింది. అయితే కొద్దిరోజుల్లోనే విభేదాలు పొడచూపాయి. విడాకుల కోసం వెళ్లారు. ఆరేళ్లుగా పైగా కోర్టులో ఈ కేసు నడుస్తోంది. ప్రస్తుతం తేజ్ ప్రతాప్ విదేశాల్లో ఉన్నారు. మాల్దీవుల్లో సముద్రం ఒడ్డున్న ధ్యానం చేసుకుంటున్న ఫోటోను ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కాగా, ఈ ఏడాది చివర్లో జరుగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వైశాలి జిల్లా మహువా నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకుముందు సమష్టిపూర్లోని హసన్పూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2015లో వ్యూహాత్మకంగా మహువా నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు. ఈసారి కూడా అక్కడే పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Covid 19 Cases in India: ఢిల్లీ, ముంబైలో కోవిడ్ కేసులు.. ఆసుపత్రుల్లో హైఅలర్ట్
Rains: రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్.. రేపు, ఎల్లుండి పొంచివున్న ముప్పు
Karnataka: జైలు నుంచి విడుదలయ్యాక ఊరేగింపు.. కర్ణాటక అత్యాచార నిందితుల అరెస్టు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి