Share News

Manav Sharma: భార్య వేధింపులతో మరో టెకీ ఆత్మహత్య

ABN , Publish Date - Mar 01 , 2025 | 06:15 AM

బెంగళూరులో అతుల్‌ సుభాష్‌ ఆత్మహత్య ఘటన మరవక ముందే.. భార్య వేధింపులతో ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో మరో టెకీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ‘దయచేసి.. మగవాళ్ల గురించి కూడా ఆలోచించండి..

Manav Sharma: భార్య వేధింపులతో మరో టెకీ ఆత్మహత్య

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: బెంగళూరులో అతుల్‌ సుభాష్‌ ఆత్మహత్య ఘటన మరవక ముందే.. భార్య వేధింపులతో ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో మరో టెకీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ‘దయచేసి.. మగవాళ్ల గురించి కూడా ఆలోచించండి..’ అంటూ ఆత్మహత్యకు ముందు అతడు తీసుకున్న సెల్ఫీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. యూపీకి చెందిన 25 ఏళ్ల మానవ్‌ శర్మ ముంబైలోని టీసీఎస్‌లో మేనేజర్‌. ఏడాది కిత్రం అతడికి వివాహమవ్వగా.. ఈనెల 24న తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.


భార్య నికితా శర్మ తీవ్ర వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు దాదాపు 7 నిమిషాల చివరి సెల్ఫీ వీడియోలో.. ‘నా భార్య వేరొకరితో సంబంధం పెట్టుకొని నాపైనే కేసులు పెడతానంటూ వేధిస్తోంది. నన్నెప్పుడు ఓ మనిషిలా కూడా చూడలేదు.. దయచేసి మగవాళ్ల గురించి ఎవరైనా మాట్లాడండి’ అని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే మానవ్‌ భార్య నికితా శర్మ స్పందించారు. ‘మానవ్‌ మద్యానికి బానిసయ్యాడు. పలుమార్లు ఆత్మహత్యకు యత్నించాడు. 3సార్లు నేనే కాపాడాను’ అని చెప్పారు.

Updated Date - Mar 01 , 2025 | 06:15 AM