Share News

TCS: 12వేల మంది ఉద్యోగులను తొలగించబోతున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్

ABN , Publish Date - Jul 27 , 2025 | 05:48 PM

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) షాకింగ్ న్యూస్ చెప్పింది. టెక్నాలజీలో వస్తున్న వేగవంతమైన మార్పుల కారణంగా 2 శాతం మంది ఎంప్లాయిస్ అంటే, దాదాపు 12వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది.

TCS: 12వేల మంది ఉద్యోగులను తొలగించబోతున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్
TCS to cut 2 percent of workforce

ఇంటర్నెట్ డెస్క్: భారతదేశపు అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) షాకింగ్ న్యూస్ చెప్పింది. టెక్నాలజీలో వస్తున్న వేగవంతమైన మార్పులను ఎదుర్కోడానికి 2 శాతం మంది ఎంప్లాయిస్ అంటే, దాదాపు 12వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. సాంకేతికతలో వస్తున్న అంతరాయాల కారణంగా భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యకు దిగాల్సి వచ్చిందని అంటోంది. దీని ప్రభావం ఇండియాతోపాటు, వివిధ దేశాలలో పనిచేస్తున్న ఉద్యోగులపై ఉండనుంది. తొలగింపు ప్రక్రియ 2026 ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 2025 నుండి మార్చి 2026 వరకు) జరుగుతుందని సమాచారం.


కంపెనీ సీఈవో (CEO)గా తాను తీసుకోవలసిన అత్యంత కఠినమైన నిర్ణయాలలో ఇది ఒకటి అని చెప్పిన TCS CEO కృతివాసన్.. ముఖ్యంగా ఇది మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. కొత్త టెక్నాలజీలను, ముఖ్యంగా AI ఇంకా ఆపరేటింగ్ మోడల్ లో మార్పుల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. 'కొత్త సాంకేతికత కారణంగా పని చేసే విధానాలు మారుతున్నాయి.. మనం భవిష్యత్తుకు సిద్ధంగా, చురుగ్గా ఉండాల్సిన అవసరం ఉంది' అని ఆయన అన్నారు.

కాగా, జూన్‌తో ముగిసిన తాజా త్రైమాసికంలో TCS ఉద్యోగుల సంఖ్య 6,13,000 గా ఉంది. దీని ప్రకారం 2 శాతం తగ్గింపు అంటే, దాదాపు 12,200 మందికి పైగా ఉద్యోగులను ఈ తాజా నిర్ణయం ప్రభావితం చేస్తుంది. 'బలమైన TCSను ముందుకు తీసుకెళ్లడానికి మేము తీసుకోవలసిన కష్టమైన నిర్ణయం ఇది' అని కృతివాసన్ అన్నారు. అందుకే ఈ ప్రక్రియను సాధ్యమైనంత మానవతాదృక్పదంతో చేయడానికి కంపెనీ కృషి చేస్తోందని చెప్పారు.


ఇవి కూడా చదవండి...

గాజాపై దాడులకు విరామం.. ఇజ్రాయెల్ కీలక నిర్ణయం

కంబోడియా, థాయ్‌లాండ్ తక్షణం చర్చలు చేపట్టేందుకు రెడీ.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 27 , 2025 | 05:51 PM