Love Marriage: తమిళ యువకుడితో వియత్నాం యువతి ప్రేమవివాహం
ABN , Publish Date - Apr 11 , 2025 | 12:34 PM
ప్రేమకు ఎల్లలు లేవంటే ఇదేనేమో.. తమిళ యువకుడితో వియత్నాం యువతి ప్రేమవివాహం చేసుకున్నారు. తమిళ సంస్కృతీ సంప్రదాయాలపై ఆసక్తి కలిగిన వియత్నాం యువతి తమిళ యువకుడిని ప్రేమించి తమిళ సంప్రదాయ రీతిలో వివాహం చేసుకుంది.

చెన్నై: తమిళ సంస్కృతీ సంప్రదాయాలపై ఆసక్తి కలిగిన వియత్నాం యువతి తమిళ యువకుడిని ప్రేమించి తమిళ సంప్రదాయ రీతిలో వివాహం చేసుకుంది. తిరునల్వేలి(Tirunalveli)కి చెందిన మహేష్ (35) డిగ్రీ చదివి వియత్నాం(Vietnam)లోని ఓ ఐటీ సంస్థలో పనిచేశాడు. ఆ సంస్థలోనే పనిచేస్తున్న నుయెన్ లే తూయ్‌తో అతడికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. నాలుగేళ్లు ప్రేమించుకున్న తర్వాత ఇరువైపు కుటుంబీకుల ఆమోదంతో పెళ్లికి సిద్ధమయ్యారు.
ఈ వార్తను కూడా చదవండి: Minister: వేసవిలో విద్యుత్ కోతలుండవ్..
వధువు కోరిక మేరకు తమిళ సంప్రదాయరీతిలో వీరి వివాహం తిరునల్వేలి కుట్రాలం రోడ్డులోని కల్యాణమండపంలో అట్టహాసంగా జరిగింది. వియత్నాం నుంచి వచ్చిన వధువు తరఫు కుటుంబీకులంతా తమిళ సంప్రదాయ దుస్తులైన పట్టుచొక్కా, పట్టు ధోవతి, పట్టు చీరలు ధరించి కల్యాణమండపం అంతటా సందడి చేయడం కొసమెరుపు.
ఈ వార్తలు కూడా చదవండి:
గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలి
Read Latest Telangana News and National News